Andhra Pradesh

News July 10, 2024

తిరుపతి ఐఐటీలో JRFకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(JRF)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐఐటీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఎంటెక్(M.Tech) పాసైన అభ్యర్థులు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 11. ఇతర వివరాలకు www.iittp.ac.in వెబ్‌సైట్ చూడాలి.

News July 10, 2024

యుటిలైజేషన్ పత్రాలు సమర్పించాలి: కలెక్టర్ దినేశ్

image

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అయిన ఖర్చుకు సంబంధించిన బిల్లులను వెంటనే సమర్పించాలని, ఎన్నికల రిటర్నింగ్ అధికారులను, నియోజకవర్గ ప్రధాన కేంద్రం తహశీల్దార్‌లను కలెక్టర్ ఏఎస్.దినేశ్ కుమార్ ఆదేశించారు. అదేవిధంగా గత 2022, 2023లలో జరిగిన వరదలకు సంబంధించి ముంపు మండలాల్లో డీసీ బిల్లులు డ్రా చేసిన తహశీల్దార్లు వెంటనే ఏసీ బిల్లులు పెట్టాలని, యుటిలైజేషన్ పత్రాలు సమర్పించాలని ఆదేశించారు.

News July 10, 2024

ఉన్నత విద్యకు 10వ తరగతి తొలి మెట్టు: నంద్యాల కలెక్టర్

image

ఉన్నత విద్యకు పదవ తరగతి తొలి మెట్టు అని, ప్రతి విద్యార్థి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలోని శ్రీ దామోదరం సంజీవయ్య స్మారక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులను కలెక్టర్ కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానం తెలుసుకున్నారు.

News July 10, 2024

రొట్టెల పండగ ఏర్పాట్లను పరిశీలించిన ఖాదర్ బాషా

image

నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండగ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో దర్గా ప్రాంగణంలో జరుగుతున్న పనులను బారాషహీద్ దర్గా ఫెస్టివల్ కమిటీ ఛైర్మన్ షేక్ ఖాదర్ బాషా, సయ్యద్ సమీ, సాబీర్ ఖాన్ తదితర నేతలు మంగళవారం పరిశీలించారు. రొట్టెల పండగకు సుమారు పది లక్షల పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో వారికి మౌలిక వసతులు కల్పించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

News July 10, 2024

విద్యా శాఖ అధికారులతో ప్రకాశం కలెక్టర్ సమీక్ష

image

విద్యా సంవత్సరం మొదలైన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలు, పాఠ్య పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విద్యాశాఖ అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్షించారు. అకడమిక్, విద్యాలయాలలో చేపడుతున్న నిర్మాణాలు, ఎడ్యుకేషన్ కార్యకలాపాలతో పాటు వివిధ యాజమాన్యాల క్రింద ఉన్న పాఠశాలల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News July 10, 2024

ఉక్కు పరిశ్రమ కోసం మంత్రి మండిపల్లికి వినతి

image

కడపలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలని కోరుతూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి విద్యార్థి యువజన సంఘాల నాయకులు మంగళవారం వినతి పత్రం ఇచ్చారు. ఏటా లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు మంత్రికి తెలిపారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు దొరుకుతాయని వారు మంత్రికి విన్నవించారు.

News July 10, 2024

రైతు నష్టపోకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోండి: నంద్యాల కలెక్టర్

image

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఇబ్బంది లేకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయడంతో పాటు నకిలీ విత్తనాల అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ జి.రాజకుమారి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రగతిపై సంబంధిత అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

News July 10, 2024

వెంకటగిరిలో వందేళ్ల చరిత్ర ఉన్న పీర్ల చావిడి

image

వెంకటగిరి పట్టణం ఫీర్జాతిపేటలో సుమారు వందేళ్ల చరిత్ర ఉన్న హజరత్ హట్లే సాహెబ్ పీర్ల చావిడి ఉంది. ఇది శిథిలావస్థలోకి చేరడంతో గతేడాది తొలగించి హిందూ, ముస్లిం పెద్దల సహకారంతో పునర్నిర్మించారు. ఇటీవల ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. గతంలో ఈ పీర్ల చావిడిలో ఉన్న పీర్లకు వెంకటగిరి రాజా కుటంబీకులు ఫాతిహా అందించే వారని చెప్పారు.

News July 10, 2024

సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సత్యసాయి ఎస్పీ

image

ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న కొత్త రకాలైన సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ట్రేడింగ్ మోసాలు, హాని ట్రాప్, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే విధంగా తయారుచేసిన పోస్టర్లను విడుదల చేశారు. తక్కువ సమయంలో సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశను ఎంచుకుంటున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

News July 10, 2024

రాజమండ్రి MP పురందీశ్వరిని కలిసిన మాజీ ఎంపీ

image

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందీశ్వరిని మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీకి పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడపాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు ఉన్నారు.