Andhra Pradesh

News July 10, 2024

నిత్యావసర ధరలు అందుబాటులోకి తెస్తాం: కలెక్టర్

image

నిత్యావసర ధరలు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం రైస్, డాల్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈనెల 11 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రభుత్వం ప్రకటించిన ధరల ప్రకారం నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుందన్నారు.

News July 10, 2024

నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి: జీవీఎంసీ కమిషనర్

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన నేపధ్యంలో నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. అడిషనల్ డిప్యూటీ కమిషనర్ కె.ఎస్ విశ్వనాథన్‌తో కలిసి కోస్టల్ బ్యాటరీ ఏరియా నుంచి ఆర్కే బీచ్ వరకు మంగళవారం పర్యటించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కమిషనర్ వెంట పలువురు అధికారులు ఉన్నారు.

News July 10, 2024

ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాల పట్ల నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకునేలా చూడాలని, ఇందుకోసం వివిధ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం అధికారులకు సూచించారు. అగ్నివీర్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో.. వాయుసేనకు చెందిన నాన్ కమిషన్ ఆఫీసర్ సందీప్, జిల్లా ఉపాధి కల్పనాధికారి డి విక్టర్ బాబు కలెక్టర్‌కు వివరాలు తెలియజేశారు.

News July 10, 2024

ఎక్సైజ్ శాఖ మంత్రిని కలిసిన ఏలూరు MP

image

విజయవాడలో రాష్ట్ర మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి మంగళవారం వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలను గురించి చర్చించారు.

News July 10, 2024

తలకోనలో అరుదైన కప్ప గుర్తింపు

image

శ్రీలంక భూభాగంలో కనిపించే అరుదైన జాతికి చెందిన కప్ప శేషాచలం అడవుల్లో దర్శనమిచ్చింది. గోధుమ రంగులో ఉండే ఈ కప్పను జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు, ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలి పరిశోధకులు కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ద్రీతి బెనర్జీ మాట్లాడుతూ.. శ్రీలంకన్ స్యూడో ఫిలేటస్ రిజియస్‌గా పిలవబడే ఈ కప్ప తలకోనలో కనిపించిందని చెప్పారు.

News July 9, 2024

శ్రీకాకుళంలో TODAY TOP HEADLINES

image

✒ నాగావళి రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కలెక్టర్ ప్రణాళికలు
✒ కళింగ వైశ్య మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు మృతి
✒ దళితులకు భూహక్కు పత్రాలు అందజేయాలి
✒ మందస మండలంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
✒ కోడి రామ్మూర్తి స్టేడియం పునః నిర్మాణ పనులకు ప్రభుత్వం ఆమోదం
✒ హిరమండలంలో వలకు చిక్కిన కొండచిలువ
✒ మందసలో 1500 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
✒ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులపై రామ్మోహన్ సమీక్ష

News July 9, 2024

బొబ్బిలి: ప్రేమ పేరుతో మోసం.. వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష

image

బొబ్బిలి గుడారి వీధికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి దాడితల్లి కాలనీకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను లోబరుచుకున్నడాని, ఆ తర్వాత పెళ్లికి నిరాకరించినట్లు యువతి 2016లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. తాజాగా నేరం రుజువు కావడంతో అతనికి ఉమెన్ కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.30వేల జరిమాన విధించినట్లు బొబ్బిలి సీఐ నాగేశ్వరరావు తెలిపారు.

News July 9, 2024

ప.గో.: సొమ్ము కోసం హత్య.. 14 రోజుల రిమాండ్

image

ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం శివారులో మృతిచెందిన జానపాముల సత్యవతి (48) కేసులో నిందితుడు చిక్కాల శ్రీనును తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సొమ్ములు కోసం హత్యచేసినట్లు నేరం అంగీకరించడంతో తణుకు కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించినట్లు పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం మంగళవారం తెలిపారు. మృతురాలికి చెందిన బంగారు ఆభరణాలు రికవరి చేసినట్లు వివరించారు.

News July 9, 2024

మహానంది: యువకుడిపై చిరుత దాడి

image

మహానంది గ్రామ సమీపంలోని ఈశ్వర్ నగర్ కాలనీ వద్ద గిరిజనుడు నాగన్నపై చిరుతపులి దాడి చేసింది. మంగళవారం సాయంకాలం బహిర్భూమికి వెళ్లిన నాగన్నపై చిరుత దాడి చేయడంతో చాకచ్యకంగా తప్పించుకుని పారిపోయి వచ్చాడు. మీదకు దూకడంతో గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గిరిజనులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. 

News July 9, 2024

ఎక్సైజ్ శాఖ మంత్రిని కలిసిన ఏలూరు MP

image

విజయవాడలో రాష్ట్ర మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి మంగళవారం వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలను గురించి చర్చించారు.