Andhra Pradesh

News April 21, 2025

విశాఖ కేంద్రంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్.. నిర్వాహకుల అరెస్ట్

image

ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ప.గో జిల్లా పాలకొల్లుకు చెందిన వెంకటరావు, మురళీలను ఆదివారం పాలకొల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. DSP శ్రీవేద వివరాల మేరకు.. HYD, విశాఖ కేంద్రంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 10 ఫోన్లు, రూ.33,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రధాన నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని.. వీరిలో ఒకరు వైసీపీ నేత అని చెప్పారు.

News April 21, 2025

తూ.గో. జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో డీఎస్సీ ద్వారా 1,241 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు. ➤ OC-498 ➤ BC-A:88 ➤ BC-B:120 ➤ BC-C:13 ➤ BC-D:84 ➤ BC-E:48 ➤ SC-1:17 ➤ SC-2:79 ➤ SC-3:93 ➤ ST:74 ➤ EWS:120 ➤ PH-256:1 ➤ PH-05: 6. సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం << 16156039>>ఇక్కడ<<>> క్లిక్ చేయండి.

News April 21, 2025

DSC: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,645 పోస్టులు.. పోటీ వేలల్లో.!

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఎస్సీ పోస్టులకు పోటీ నెలకొంది. జిల్లాకు 2,645 పోస్టులు మంజూరయ్యాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 30వేల మందికిపైగా అభ్యర్థులు డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఎస్జీటీ పోస్టులు రాష్ర్టంలోనే అధికంగా కర్నూలు జిల్లాలో 1,817 ఉండటంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News April 21, 2025

నెల్లూరు జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో డీఎస్సీ ద్వారా 668 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-264 ➤ BC-A:50 ➤ BC-B:61
➤ BC-C:8 ➤ BC-D:46 ➤ BC-E:26
➤ SC- గ్రేడ్1:10 ➤ SC-గ్రేడ్2:40
➤ SC-గ్రేడ్3:51 ➤ ST:43 ➤ EWS:65
➤ PH-విజువల్:2 ➤ PH- హియర్:2
NOTE: సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం <<16155982>>ఇక్కడ <<>>క్లిక్ చేయండి.

News April 21, 2025

చిత్తూరు జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీఎస్సీ ద్వారా 1,478 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-578 ➤ BC-A:111 ➤ BC-B:139
➤ BC-C:19 ➤ BC-D:102 ➤ BC-E:53
➤ SC- గ్రేడ్1:21 ➤ SC-గ్రేడ్2:94 ➤ SC-గ్రేడ్3:112
➤ ST:95 ➤ EWS:138
➤ PH-విజువల్:1 ➤ PH- హియర్:10
➤ ట్రైబల్ వెల్ఫేర్ :5

News April 21, 2025

విశాఖ: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్!

image

విశాఖ జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తీసుకురావాలని హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు. మీ కామెంట్?

News April 21, 2025

కడప: చెట్టును ఢీకొని ఇద్దరి మృతి

image

మర్రిపాడు మండలం కదిరి నాయుడుపల్లి వద్ద నిన్న <<16156996>>ప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. కడప జిల్లా అట్లూరు మండలం ముత్తుకూరుకు చెందిన నరసింహులు(26), బద్వేల్‌లోని రూపవరం పేటకు చెందిన ఝాన్సీ(26) బైకుపై పెంచలకోనకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా చెట్టును ఢీకొట్టారు. యువతి అక్కడికక్కడే మృతిచెందగా.. బద్వేలు ఆసుపత్రికి తరలిస్తుండగా యువకుడి మృతి చెందాడు. మర్రిపాడు ఎస్ఐ కేసు నమోదు చేశారు.

News April 21, 2025

కర్నూలు: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

image

కర్నూలు జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితితంటూ ప్రైవేటు టీచర్లు వాపోతున్నారు.

News April 21, 2025

ప్రకాశం: పుట్టింటి నుంచి ఆలస్యంగా వచ్చిందని.!

image

పేర్నమిట్టలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పేర్నమెట్టకు చెందిన నవీన్.. భార్య శ్రావణి గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆమె పుట్టినిల్లు అయిన జమ్ములపాలెంకు వెళ్లింది. అదే రోజు రమ్మని నవీన్ కోరగా ఆమె మరుసటి రోజు వచ్చింది. దీంతో అనుమానం పెంచుకున్న నవీన్ ఆదివారం ఆమె గొంతు మీద కాలు పెట్టి తొక్కడంతో ఆమె మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 21, 2025

తూ.గో: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

image

జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.