Andhra Pradesh

News July 9, 2024

ఒంగోలు మీదగా వెళ్లే పలు రైళ్లు రద్దు

image

మూడో కొత్త రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా విజయవాడ డివిజన్ పరిధిలోని ఒంగోలు మీదగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. (07500)విజయవాడ-గూడూరు, (12743/44)విజయవాడ-గూడూరు వెళ్లే ఈ రైళ్లను 15 నుంచి 30 వరకు, (07576) ఒంగోలు-విజయవాడ, (07461) విజయవాడ-ఒంగోలు వెళ్లే రైళ్లను 16 నుంచి 30 వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News July 9, 2024

నెల్లూరు: కరెంట్ షాక్‌తో ఒకరు మృతి

image

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామసమీపంలోని జొన్నవాడ దశయ్య రొయ్యల గుంటల వద్ద గుర్తుతెలియని వ్యక్తి కరెంట్ షాక్‌తో మంగళవారం చనిపోయాడు. అతను రొయ్యల దొంగతనానికి వచ్చినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. విడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 9, 2024

నిడదవోలు: డిజిటల్ అసిస్టెంట్లకు న్యాయం చేస్తాం: మంత్రి

image

నిడదవోలులో నియోజకవర్గంలోని డిజిటల్ అసిస్టెంట్లు మంత్రిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ టెక్నికల్ అర్హతలను పరిగణనలోకి తీసుకొని జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలని విన్నవించారు. మంత్రి స్పందిస్తూ.. డిజిటల్ అసిస్టెంట్లకు పదోన్నతి అంశాన్ని మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లి తగిన న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.

News July 9, 2024

చిత్తూరు: ఇసుక స్టాక్ యార్డు పరిశీలన

image

చిత్తూరు రూరల్ మండలంలోని దిగువమాసపల్లి ఇసుక స్టాక్ యార్డును కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన ఇసుక విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులు యూపీఐ ద్వారా నగదును చెల్లించాలని సూచించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుకను పొందాలన్నారు.

News July 9, 2024

తూ.గో.: పాఠాలు చెబుతుండగా.. ఊడిపడిన శ్లాబ్ పెచ్చులు

image

కూనవరం మండలం బండారుగూడెం ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు టీచర్ పాఠాలు చెబుతున్న సమయంలో గది శ్లాబ్ పెచ్చులు ఊడిపడిన ఘటన మంగళవారం జరిగింది. ఆ సమయంలో విద్యార్థులు గదిలోనే ఉన్నప్పటికీ ఎవరిపైనా పడకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. HM కుమారి మాట్లాడుతూ.. భవనం శిథిలావస్థకు చేరడంతో బయటే పిల్లలకు పాఠాలు బోధిస్తున్నామన్నారు. అధికారులు స్పందించి కొత్త భవనం నిర్మించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

News July 9, 2024

పోలాండ్‌లో సత్తా చాటిన విజయవాడ అమ్మాయి

image

విజయవాడకు చెందిన అనూష భారత సాఫ్ట్ టెన్నిస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి మూడు పతకాలు కైవసం చేసుకున్నట్లు, ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్ తెలిపారు. జులై 5 నుంచి 8 వరకు పోలాండ్‌లో జరిగిన 17వ పోలాండ్ కప్ అంతర్జాతీయ సాఫ్ట్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. అనూషను అసోసియేషన్ సభ్యులు అభినందించారు.

News July 9, 2024

ఆర్జేడీగా బాధ్యతలు స్వీకరించిన కర్నూలు డీఈవో

image

కర్నూలులోని డీఈవో కార్యాలయంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ-కడప)గా కర్నూలు విద్యాశాఖ అధికారి శామ్యూల్
మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలనుసారం రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించాలని అన్నారు. పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.

News July 9, 2024

ప్రజా సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం: మంత్రి మండిపల్లి

image

ప్రజా సంక్షేమమే సీఎం చంద్రబాబు ధ్యేయమని మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి అన్నారు. కడప జడ్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అవినీతిని ప్రోత్సహించే ప్రసక్తే లేదని, వచ్చే 5 ఏళ్లలో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటామన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, ఇతర సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

News July 9, 2024

బంద్ కారణంగా వాయిదా పడ్డ పరీక్ష 11న నిర్వహణ: టీ.చిట్టిబాబు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ నెల నాలుగో తేదీన విద్యార్థి సంఘాల బంద్ కారణంగా వాయిదా పడిన డిగ్రీ రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షను ఈ నెల 11వ తేదీన నిర్వహిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టీ.చిట్టిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష జరుగుతుందని, యూజీ విద్యార్థులంతా హాజరుకావాలన్నారు.

News July 9, 2024

ఆదోని: విద్యుత్ షాక్‌తో బాలుడికి తీవ్రగాయాలు

image

విద్యుత్ షాక్‌‌కు గురై బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం జరిగింది. ఆదోని(M) ఇస్వీ గ్రామానికి చెందిన ఈరమ్మ, బసవరాజు కుమారుడు హుసేని అంగన్వాడీ స్కూల్‌కి వెళ్లాడు. ఆడుకోవడానికి బయటికొచ్చిన బాలుడికి సమీపంలోనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కి ఉన్న విద్యుత్ తీగ తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో అదృష్టవశాత్తు కరెంట్ పోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. బాలుడిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.