Andhra Pradesh

News July 9, 2024

చంద్రగిరి మాజీ MLAకు రూ.50 లక్షల టోకరా?

image

సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ మాజీ MLA మోసపోయిన ఉదంతం ఇది. చంద్రగిరి మాజీ MLA జయదేవనాయుడు(1985)కు ఈనెల 5న ఓ మహిళ ఫోన్ చేసి CBI అధికారిణి అని చెప్పింది. మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్ చేస్తామని బెదిరించింది. తన పైఅధికారితో మాట్లాడాలని మరొక వ్యక్తికి ఫోన్ ఇచ్చింది. సదరు వ్యక్తి రూ.50 లక్షలు పంపాలని ఆయనకు చెప్పడంతో ఆ మొత్తాన్ని బదిలీ చేశారు. చివరకు మోసాన్ని గుర్తించిన మాజీ ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించారు.

News July 9, 2024

మార్కాపురం ఎమ్మెల్యేకు ఆపరేషన్

image

మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి హైదరాబాద్‌లో సోమవారం ఆపరేషన్ చేశారు. చిన్నపాటి సమస్య ఉండటంతో ఆయన తన కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ మంగళవారం ఆసుపత్రికి వెళ్లి నారాయణ రెడ్డిని పరామర్శించారు. త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలని ఆకాంక్షించారు.

News July 9, 2024

రాయచోటి: పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

రాయచోటిలోని కొత్తపేట రామాపురం చౌడేశ్వరి టెంపుల్ వద్ద ఈశ్వర్ రెడ్డి (35) ఒంటిమీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం ఆయన ఇంటి నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి డోర్ పగలగొట్టి చూడగా ఆయన అప్పటికే చనిపోయాడు. ఈశ్వర్ రెడ్డికి ఏడాది కిందటే వివాహమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News July 9, 2024

SKLM: నాగావళి రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రణాళికలు

image

నగరం మీదుగా ప్రవహిస్తున్న నాగావళి నది (రివర్ ఫ్రంట్) అభివృద్ధికి, సుందరీకరణకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాగావళి నదీ పరీవాహక ప్రాంతాన్ని పర్యాటకంగా వేగంగా అభివృద్ధి చేసేలా ప్రాజెక్టులను గుర్తించాలని అన్నారు.

News July 9, 2024

నరసన్నపేట: కళింగ వైశ్య మాజీ అధ్యక్షుడి మృతి

image

నరసన్నపేట కళింగ వైశ్య మాజీ అధ్యక్షుడు పొట్నూరు జగన్ మోహన్ రావు మంగళవారం అకాల మరణం చెందారు. ఈ మేరకు సంఘం సభ్యులు జగన్మోహన్ రావు మృతి పట్ల తమ సంతాపం ప్రకటించారు. కళింగ వైశ్య సంఘం అభివృద్ధికి, సభ్యుల మధ్య సమన్వయానికి జగన్మోహన్ రావు కృషి చేశారని వారు గుర్తు చేశారు. జాతికి చేసిన మేలును మరవలేమని కొనియాడారు. జగన్మోహన్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

News July 9, 2024

ఎన్నాళ్లీ.. చెట్ల కింద పాఠాలు

image

ఉరవకొండ పట్టణం శివరామిరెడ్డి కాలనీలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలకు నేటికీ సొంత భవనం లేదు. ఏడాదిన్నర నుంచి పాఠశాలను స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాల నడుస్తున్న డీఆర్‌డీఏ భవనాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. పాఠాలు చెట్ల కింద చెబుతుండగా.. ప్రాంగణం ప్రహరీకి నల్లరంగులు వేసి బోర్డులుగా మార్చి బోధన సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక్కడ ప్రస్తుతం 1 నుంచి 4వ తరగతి వరకు 93 మంది విద్యార్థులు ఉన్నారు.

News July 9, 2024

ఊపందుకున్న భవన నిర్మాణ రంగం: పల్లా

image

ఉచిత ఇసుక పాలసీ వలన భవన నిర్మాణ రంగం ఊపందుకుందని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత ఇసుక విధానం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాత గాజువాక పార్టీ కార్యాలయం వద్ద కూటమి నేతలతో కలిసి భవన కార్మికులకు మిఠాయిలు పంచారు. ప్రజా ప్రయోజనార్థం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ అనవసర రాద్దాంతం చేస్తుందని విమర్శించారు.

News July 9, 2024

సిద్దవటం: రైలు కింద పడి మేకల కాపరి మృతి

image

సిద్దవటం మండలం మాధవరం-1 గ్రామ పంచాయతీలోని గడుసుపల్లి కాలనీకి చెందిన మేకల కాపరి మామిడి రామసుబ్బారెడ్డి మంగళవారం రైలు కింద పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆయన మేకలు రైల్వే ట్రాక్‌పై పరిగెత్తడంతో వాటిని తప్పించబోయి కాపరి కూడా రైలు కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆయనతో పాటు రెండు మేకలు కూడా రైలు కింద పడి మృతి చెందాయన్నారు.

News July 9, 2024

విశాఖ డాక్ యార్డ్ వంతెన మూసివేత

image

విశాఖ నగరంలో డాక్‌ యార్డ్ వంతెనను జులై 10 నుంచి మూసివేస్తున్నట్లు వీపీఏ తెలిపింది. ఈ మేరకు వంతెనకు ఇరువైపులా ప్రయాణికులకు తెలిసేలా నోటీస్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు వెళుతున్న మార్గం ద్వారానే నగరవాసులు రాకపోకలు సాగించాలని విజ్ఞప్తి చేసింది. 9-12 నెలల వరకు వంతెనకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు జరపనున్నట్లు పేర్కొంది.

News July 9, 2024

నెల్లూరు: యువకుడు దారుణహత్య

image

కోవూరులోని రాళ్లమిట్ట ప్రాంతంలో మంగళవారం జరిగిన ఇరువర్గాల ఘర్షణలో నాగరాజు అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వారధిసెంటర్‌కు చెందిన యువకులకు, రాళ్లమిట్టకు చెందిన యువకులకు పాతకక్షలు ఉన్నాయి. ఈక్రమంలో వారధిసెంటర్‌కు చెందిన నాగరాజు రాళ్లమిట్టకు రావడంతో ఇక్కడ యువకులు దాడి చేసి కత్తితో పొడిచి హత్య చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.