Andhra Pradesh

News July 9, 2024

తిరుపతి: అతిసారంతో ఇద్దరు మృతి!

image

అతిసారంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన తిరుపతిలో మంగళవారం జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం.. తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని మనోవికాస కేంద్రంలో ఏడుగురు అతిసారానికి గురయ్యారు. వీరిని స్థానిక రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మనోవికాస కేంద్రంలో మానసిక వైకల్యం ఉన్నవారు ఉంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 9, 2024

ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కు ఘన స్వాగతం

image

ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ యాదవ్‌కు కూటమి నేతలు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా స్వాగతం పలికేందుకు జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఎంపీ మహేశ్ అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ 4 రోడ్ల కూడలిలోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. తర్వాత పార్టీ ఏలూరు జిల్లా కార్యాలయంలో సమావేశంలో పాల్గొంటారు.

News July 9, 2024

విశాఖ: మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు

image

ఏయూ హిందీ ప్రొఫెసర్ సత్యనారాయణపై అందిన ఫిర్యాదు మేరకు ఏమి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ ఈనెల 19న స్వయంగా జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని ఏయూ ఉపకులపతికి కమిషన్ నోటీసు జారీ చేసింది. ఆ రోజు ఉదయం వ్యక్తిగతంగా కాని, తన తరఫున మరో వ్యక్తిగాని 11.30 గంటలకు కమిషన్ ముందు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొంది. గత ఏడాది ఏయూ హిందీ విభాగం ప్రొఫెసర్ లైంగికంగా వేధించారని ఓ మహిళా స్కాలర్ ఫిర్యాదు చేశారు.

News July 9, 2024

విశాఖ-అరకు రహదారి విస్తరణకు గ్రీన్ సిగ్నల్..!

image

విశాఖ-అరకు జాతీయ రహదారి విస్తరణకు త్వరలో మోక్షం కలగనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని కొత్తవలస, శృంగవరపుకోట మీదుగా రహదారి విస్తరణ పనులు జరగనున్నాయి. గత ఏడాది విస్తరణ పనులు ప్రారంభించినప్పటికీ కేంద్రం ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూలంగా స్పందించారు.కొత్తవలస, ఎల్ కోట, వేపాడ, ఎస్ కోట మీదుగా 4 లైన్లకు విస్తరించనున్నారు.

News July 9, 2024

మార్కాపురం: తల్లిని చంపి.. సూసైడ్

image

మార్కాపురానికి చెందిన అరిమెల్ల అశోక్(26) 2022లో తల్లిని హత్య చేశాడు. దీంతో అతణ్ని ఒంగోలు జైలుకు తరలించారు. బెయిల్ మీద బయటికి వచ్చి తర్వాత ఆయన పెదనాన్నను చంపాడు. మళ్లీ అతడిని జైలుకు పంపారు. కొద్ది రోజుల తర్వాత మానసిక స్థితి బాగోలేదు. వైద్యం కోసం విశాఖ మెంటల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ తనకు బెయిల్ రాదేమోనని భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News July 9, 2024

రేపు ఆత్మకూరులో వైసీపీ ఆత్మీయ సమావేశం

image

ఆత్మకూరులోని శ్రీధర్ గార్డెన్స్ లో బుధవారం ఉదయం 10.30 గంటలకు వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని మేకపాటి కార్యాలయ ప్రతినిధులు కోరారు.

News July 9, 2024

భారత వాయుసేనలో దరఖాస్తుల ఆహ్వానం

image

భారత వాయుసేనలో అగ్నివీర్-వాయు ఉద్యోగాలకు సంబంధించి మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సెట్కూరు సీఈవో రమణ తెలిపారు. ఇంటర్, డిప్లొమా పూర్తైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 28వ తేదీ లోగా అందజేయాలని తెలిపారు. అక్టోబరు 18వ తేదీ తర్వాత ఆన్‌లైన్‌లో అర్హత పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సెట్కూరు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News July 9, 2024

రొంపిచర్ల వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన రొంపిచర్ల మండలంలో జరిగింది. ఏఎస్ఐ మధుసూదన్ వివరాల ప్రకారం.. రొంపిచర్లలోని ఆదర్శ పాఠశాల సమీపంలో హైవేపై సోమవారం సాయంత్రం ఎదురుగా వస్తున్న ట్రక్కును ఆటో ఢీకొని లక్ష్మి(18), అంజమ్మ(40) అనే ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మల్లిక, అయ్యప్ప, ఉరుకుందమ్మ, చంద్ర, నరసింహా, ఈరమ్మ గాయపడినట్లు తెలిపారు. వీరు కర్నూలు జిల్లా కోసిగి నుంచి వచ్చి కూలి పని చేస్తున్నారని తెలిపారు.

News July 9, 2024

సీఎం హోదాలో తొలిసారి విశాఖకు చంద్రబాబు

image

ఎన్నికల తర్వాత CM హోదాలో చంద్రబాబు తొలిసారి విశాఖ రానున్నారు. ఈనెల 11న విశాఖలో ఆయన పర్యటించనున్నట్లు TDP శ్రేణులు తెలిపాయి. మెడ్‌టెక్, ఫార్మా, ఎస్ఈజెడ్‌ను సందర్శించనున్నట్లు సమాచారం. కాగా.. 2019 ఆగస్టు 9న, అనంతరం అక్టోబర్ 12న సంభవించిన హుద్‌హు‌ద్ తుపాన్ సమయంలో చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించారు. ఆ తర్వాత ఒకటి రెండుసార్లు పర్యటించారు. 2019 నుంచి 2024 వరకూ ప్రతిపక్ష హోదాలో ఉన్నారు.

News July 9, 2024

శభాష్.. ధీరజ్: నారా లోకేశ్

image

పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విజయవాడ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌కు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘బొమ్మదేవర ధీరజ్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అద్భుతమైన ప్రదర్శనతో ముందుకు సాగుతున్న రికర్వ్ ఆర్చర్‌కు నా శుభాకాంక్షలు’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. కాగా ఇటీవల ఆసియా టోర్నీలో రజతంతో మెరిసిన 22 ఏళ్ల ధీరజ్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.