Andhra Pradesh

News July 9, 2024

ప.గో: అమ్మను అక్క వేధిస్తోందని చెల్లి ఫిర్యాదు

image

ఇంట్లోంచి తల్లి వెళ్లిపోవాలంటూ కుమార్తె వేధింపులకు గురి చేస్తున్నట్లు ప.గో జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. SI రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరవాసరానికి చెందిన వనువులమ్మకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కుమార్తె కొద్దిరోజులుగా తల్లి ఇంట్లోనే ఉంటూ ఆమెనే ఇంటి నుంచి వెళ్లిపోవాలని వేధిస్తోందని చిన్న కుమార్తె ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News July 9, 2024

విజయవాడ ధీరజ్‌కు నారా లోకేశ్ అభినందనలు

image

విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్‌కు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిభావంతుడైన ధీరజ్.. తన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆసియా కాంటినెంటల్ క్వాలిఫికేషన్ టోర్నీలో రజతంతో ధీరజ్ ఒలింపిక్స్ కోటా స్థానం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

News July 9, 2024

స్కీం తీసుకున్న వారానికే యువకుడి మృతి.. రూ.10లక్షల చెక్కు

image

పోస్టల్ శాఖ అందిస్తున్న ఇన్సూరెన్స్ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని రాజమండ్రి పోస్టల్ సూపరింటెండెంట్ కె.శేషారావు సూచించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన అడపా వెంకటేశ్వర్లు అనే యువకుడు వారం రోజుల కింద రూ.359 చెల్లించి పోస్టల్‌లో ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకున్నాడు. ఆ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. నామినీగా ఉన్న అడపా లక్ష్మికి రూ.10లక్షల బీమా చెక్కును శేషారావు అందజేశారు.

News July 9, 2024

ఖాజీపేట: పది దుకాణాల్లో దొంగతనాలు

image

మండల కేంద్రమైన ఖాజీపేటలో సోమవారం రాత్రి పది దుకాణాల్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు దుకాణాల పైకప్పులుగా ఉన్న రేకులను తొలగించారు. తరువాత అందులో నుంచి దుకాణాల లోపలికి దిగి క్యాష్ బాక్సుల్లో ఉన్న నగదును దోచుకెళ్లారు. ఖాజీపేటలో ఒకే రోజు 10 షాపుల్లో దొంగతనం జరగడం ఇదే మొదటి సారని స్థానికులు చర్చించుకుంటున్నారు.

News July 9, 2024

చిత్తూరు: పెద్దిరెడ్డిపై గుంటూరు ఏఎస్పీకి ఫిర్యాదు

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫిరంగిపురం మండలానికి చెందిన షేక్ జహంగీర్ గుంటూరు పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. సర్వే రాళ్లు సరఫరాకు గత ప్రభుత్వం తనకు కాంట్రాక్టు ఇచ్చిందని, ఆపై అప్పటి మంత్రి పెద్దిరెడ్డి వాటిని కొనుగోలు చేయొద్దని అధికారులను ఆదేశించారన్నారు. దీనిపై అడిగితే పెద్దిరెడ్డి బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు.

News July 9, 2024

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై గుంటూరు ఏఎస్పీకి ఫిర్యాదు

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫిరంగిపురం మండలానికి చెందిన షేక్ జహంగీర్ గుంటూరు పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. సర్వే రాళ్లు సరఫరాకు గత ప్రభుత్వం తనకు కాంట్రాక్టు ఇచ్చిందని, ఆపై అప్పటి మంత్రి పెద్దిరెడ్డి వాటిని కొనుగోలు చేయొద్దని అధికారులను ఆదేశించారన్నారు. దీనిపై అడిగితే పెద్దిరెడ్డి బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు.

News July 9, 2024

విశాఖ: హత్య కేసుల్లో నిందితుడు ఆత్మహత్య

image

కన్నతల్లి, పెదనాన్న హత్య కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తి విశాఖ మెంటల్ ఆస్పత్రిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఏ.అశోక్ (26) తల్లిని హత్య చేయడంతో ఒంగోలు జైలుకు తరలించారు. బెయిల్‌కు సహకరించిన పెదనాన్నను హత్య కూడా చేశాడు. అతని మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో విశాఖ మెంటల్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. బెయిల్ రాదని ఆందోళనతో కిటికీ ఊచలకు ఉరి వేసుకుని మృతి చెందాడు.

News July 9, 2024

ఏర్పేడు : JRFకు దరఖాస్తులు

image

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) నందు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. మాస్టర్ డిగ్రీ ఇన్ జియాలజీ, ఎర్త్ సైన్స్, జియో కెమిస్ట్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. పూర్తి వివరాలకు https://www.iisertirupati.ac.in/job/ వెబ్‌సైట్ చూడాలి. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 10.

News July 9, 2024

నెల్లూరు మీదుగా వెళ్లే పది రైళ్లు రద్దు

image

నెల్లూరుజిల్లా మీదుగా వెళ్లే 10 రైళ్లను ఈ నెల 15-30 తేదీల మధ్య రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే విజయవాడ పీఆర్‌ఓ మడృప్కర్ తెలిపారు. విజయవాడ- GDR మధ్య మూడో రైల్వేలైన ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. GDR- విజయవాడ మధ్య నడిచే రైళ్లు రద్దు కాగా.. ఎర్నాకులం-హౌరా, సత్రగంచి-తాంబరం, హౌరా-బెంగళూరు, మధురై- నినిజాముద్దీన్ రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొన్నారు.

News July 9, 2024

ఉమ్మడి జిల్లాలో మందకొడిగా ఖరీఫ్ సాగు

image

జులై మొదటి వారం గడుస్తున్నప్పటికీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఖరీఫ్ సేద్యం మందకొడిగా సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఆశాజనకంగా కురవకపోవడమే దీనికి కారణంగా రైతులు చెబుతున్నారు. అధికారిక గణంకాల ప్రకారం విజయనగరం జిల్లాలోని 4 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని 6 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టుల్లో నీరు లేని కారణంగా వరి సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.