Andhra Pradesh

News July 9, 2024

విశాఖ: అతిథి అధ్యాపకుల పోస్టులకు నోటిఫికేషన్

image

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో డాక్టర్ అంబేడ్క‌ర్ గురుకులాల్లో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త రూపవతి తెలిపారు. ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, సోషల్, ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టుల్లో బోధించాలన్నారు. ఆసక్తి గల అర్హులైన వారు ఈ నెల 11న ఉదయం 10 గంటలకు మేహద్రి గెడ్డ అంబేడ్క‌ర్ గురుకులంలో జరిగే డెమోకు హాజరు కావాలన్నారు.

News July 9, 2024

పవన్ ఆదేశాలు.. ‘కోరింగ’లో అరుదైన జీవిపై ఫోకస్

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాకినాడ జిల్లా తాళ్లరేవు పరిధిలోని కోరింగ ఫారెస్ట్‌లో ఫిషింగ్ క్యాట్స్(నీటి పిల్లులు) లెక్కింపుపై అటవీ శాఖ ఫోకస్ పెట్టింది. వాటిని సంరక్షించాలని ఈనెల 2న కాకినాడ కలెక్టరేట్‌లో జరిగిన కీలక శాఖల సమీక్షలో పవన్ అధికారులకు సూచించారు. 2018 నాటికే అక్కడ 118 ఫిషింగ్ క్యాట్స్ ఉన్నట్లు గుర్తించారు. తాజాగా వాటి వివరాల కోసం 100 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

News July 9, 2024

గుంతకల్లులో మరికొందరిపై కేసులు

image

గుత్తేదారుల నుంచి రైల్వే అధికారులు, సిబ్బంది లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై గుంతకల్లులో CBI విచారణ కొనసాగుతోంది. ఢిల్లీ, బెంగళూరుకు చెందిన అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు గుత్తేదారులను అరెస్టు చేయగా మరికొందరిపై కేసులను నమోదు చేశారు. ఏయే పనులకు లంచాలు ఇచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రసుత్తం DRM అరెస్టు కావడంతో ADRM సుధాకర్‌ ఇన్‌ఛార్జి డీఆర్‌ఎంగా కొనసాగుతున్నారు.

News July 9, 2024

విజయవాడ డివిజన్‌లో రద్దయిన రైళ్లు ఇవే

image

విజయవాడ, గూడూరు సెక్షన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రద్దైన రైళ్లు..
★ 07500 విజయవాడ-గూడూరు (ఈ నెల 15 నుంచి 30 వరకు)
★ 07458 గూడూరు-విజయవాడ (16 నుంచి 31 వరకు)
★ 07461 విజయవాడ-ఒంగోలు 16 నుంచి 30 వరకు)
★ 07576 ఒంగోలు-విజయవాడ 16 నుంచి 30 వరకు)
★ 12743/12744 విజయవాడ-గూడూరు (15 నుంచి 30 వరకు)
★ 17259/17260 గూడూరు-విజయవాడ (16, 23, 24, 30 తేదీల్లో)

News July 9, 2024

నెల్లూరు: వ్యక్తి ప్రాణాలు కాపాడిన హెల్మెట్

image

హెల్మెట్ వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఘటన నెల్లూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వెంకటాచలం(M) నిడిగుంటపాలెంకు చెందిన సుబమ్మ(58), భర్త ప్రసాద్ సోమవారం విడవలూరు(M) వావిళ్ల నుంచి బైక్‌పై వెంకటాచలం బయలుదేరారు. నెల్లూరు సమీపంలోని ప్రశాంత్ నగర్ కూడలి హైవే వద్దకు రాగానే వెనుక నుంచి టిప్పర్ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో సుబ్బమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, భర్త హెల్మెట్ ధరించడంతో స్పల్పగాయాలతో బయటపడ్డారు.

News July 9, 2024

శ్రీకాకుళం: కొర్రాయి గేటు అండర్ పాస్ కింద మృతదేహం కలకలం

image

శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొర్రాయి గేటు అండర్ పాస్ కింద గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద చంద్రగిరి సామాజిక ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ పొందినట్లు మందుల చీటీ ఉంది. సంబంధిత వ్యక్తి యాచకుడిగా తెలుస్తోంది. మందస పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

News July 9, 2024

విశాఖ: మాటు వేసి హత్య..!

image

దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం <<13592420>>అర్ధరాత్రి హత్య<<>>కు గురైన సూర్యకిరణ్ శ్రీనగర్‌కు చెందిన మేఘనను రెండేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమె ఈనెల 1న అగనంపూడి ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అత్త సుజాత ఆసుపత్రికి రాగా సూర్య కిరణ్ అడ్డుకోవడంతో గొడవ జరిగింది. ఈ విషయాన్ని ఆమెతో సన్నిహితంగా ఉన్న కొర్లయ్యకు చెప్పింది. దీంతో సిగ్నల్ దగ్గర మాటు వేసి సూర్యకిరణ్‌ను కొర్లయ్య హత్యచేశాడు.

News July 9, 2024

విజయనగరం జిల్లాలో నేడు కేంద్ర మంత్రి పర్యటన

image

విజయనగరం జిల్లాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం పర్యటించనున్నారు. భోగాపురం మండలంలో జరుగుతున్న అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను మధ్యాహ్నం రెండు గంటలకు రామ్మోహన్ నాయుడు పరిశీలించనున్నారు. విమానాశ్రయ నిర్మాణ పనుల పురోగతి, వేగవంతానికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి ఆరా తీయనున్నారు.

News July 9, 2024

VZM: రోడ్డు ప్రమాదంతో వ్యక్తి మృతి

image

వేపగుంట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.కోట మండలం వెంకటరమణపేటకు చెందిన కృష్ణ(37) మృతి చెందాడు. విశాఖలోని ఆసుపత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు వెళ్తుండగా.. బైక్ అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రగా గాయపడ్డ అతనిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా.. కృష్ణ దంపతులకు రెండు నెలల క్రితమే కవల పిల్లలు(ఆడ, మగ)పుట్టారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

News July 9, 2024

నేటి నుంచి మెప్మా అధికారులతో సమీక్షలు

image

మహిళా స్వశక్తి సంఘాల బలోపేతానికి మంగళవారం నుంచి మూడు రోజులపాటు సమీక్షలు నిర్వహిస్తామని మెప్మా పీడీ ప్రియంవద సోమవారం తెలిపారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో 22 వేల మహిళా సంఘాలకు సంబంధించిన వివిధ అంశాలపై పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు, సిబ్బందితో సమీక్షిస్తారన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లింకేజీ రుణాలు, పుస్తక నిర్వహణ, సమృద్ధి పథకాలపై చర్చిస్తారని తెలిపారు.