Andhra Pradesh

News July 9, 2024

VZM: జీఎంఆర్‌ను కలిసిన మంత్రి శ్రీనివాస్

image

రాజాంకు చెందిన జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంథి మల్లిఖార్జునరావును రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో సోమవారం ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా జిఎంఆ‌ర్‌ను మంత్రి శ్రీనివాస్ సత్కరించారు. తాను జీఎంఆర్ ఐటిలో ఇంజినీరింగ్ చదివిన రోజులను గుర్తు చేసుకున్నారు.

News July 9, 2024

విశాఖలో దారుణ హత్య

image

అగనంపూడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి సిగ్నల్ జంక్షన్ వద్ద ఓ యువకుడిని దారుణంగా హత మార్చారు. మల్కాపురానికి చెందిన క్యాబ్ డ్రైవర్ సూర్య (25)ను కత్తితో పొడిచి దుండగుడు హత మార్చాడు. మృతిని భార్య అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం. ఇంతలో భర్త హత్యకు గురి కావడం ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై దువ్వాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News July 9, 2024

టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నాయకుడిపై కేసు

image

అనంతపురం జిల్లా కనేకల్ మండలంలోని 43 ఉడేగోళం గ్రామ వైసీపీ నాయకుడు రామాంజనేయులుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 1న పింఛన్ల పంపిణీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, గ్రామ టీడీపీ నాయకులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రామాంజనేయులుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

News July 9, 2024

విజయవాడ పటమట వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై సోమవారం సాయంత్రం పోలీసులు దాడి చేశారు. సీఐ మోహన్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పటమటలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేశారు. నిర్వాహకుడు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఐదుగురు మహిళలను రక్షించి కేసు నమోదు చేశామన్నారు.

News July 9, 2024

ఏర్పేడు: 10న KVలో వాక్‌-ఇన్ ఇంటర్వ్యూలు

image

ఏర్పేడు ఐఐటి ప్రాంగణంలోని కేంద్రీయ విద్యాలయం (kV)లో 2024-25 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు 10న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రకటించారు. ప్రైమరీ టీచర్స్, స్పోర్ట్స్ కోచ్, స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించారు.

News July 9, 2024

పరిశ్రమల్లో భద్రతా చర్యలను పటిష్ఠం చేయాలి: కలెక్టర్

image

పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేయాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో కార్మికులకు రక్షణ కల్పించేందుకు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్‌వో గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

News July 9, 2024

విశాఖ: ఘనవిజయం సాధించిన ఉత్తరాంధ్ర లయన్స్

image

విశాఖ వైయస్సార్ స్టేడియంలో సోమవారం ఏపీఎల్ సీజన్-3లో వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ జట్లు తలబడ్డాయి. ఉత్తరాంధ్ర లయన్స్ జట్టు 14 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన వైజాగ్ వారియర్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరాంధ్ర లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అనంతరం వైజాగ్ వారియర్స్ ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి ఓటమి చెందింది.

News July 9, 2024

పేదల సొంతింటి కల సహకారం: మంత్రి పయ్యావుల కేశవ్

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేసిన ఉచిత ఇసుక విధానంతో పేదల సొంతింటి కల సహకారం కానుందని ఉరవకొండ ఎమ్మెల్యే, మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక ధరలు పెంచి పేదలను ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీ మేరకు సీఎం ఉచిత ఇసుక పాలసీని అమలు చేశారని మంత్రి వెల్లడించారు

News July 9, 2024

10న చిత్తూరులో మెగా జాబ్ మేళా

image

చిత్తూరు పట్టణంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో 10న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పద్మజ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు. టెన్త్, ఇంటర్, డిప్లమా, ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని చెప్పారు. అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 9, 2024

రొట్టెల పండుగకు ఏర్పాట్లు చేయండి: నెల్లూరు కలెక్టర్

image

బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో రొట్టెల పండుగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మున్సిపల్ కమీషనర్ వికాస్ మర్మత్‌తో పాటు వివిధ శాఖల అధికారుల పాల్గొన్నారు.