Andhra Pradesh

News July 9, 2024

శ్రీకాకుళం: ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్‌లో కొత్త ఫీచర్లు

image

విద్యుత్ బిల్లులు చెల్లింపు కోసం ఏపీఈపీడీసీఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్‌లో కొత్త ఫీచర్లు జత చేసినట్లు సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వితేజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులు సర్వీస్ సంబంధించిన విద్యుత్ వినియోగం, బిల్లు వివరాలు, బిల్లు చెల్లింపు, విద్యుత్ సరఫరా పరిస్థితి వివరాలు తెలుసుకునేలా కొత్త ఫీచర్లు తీసుకువచ్చినట్లు తెలిపారు.

News July 9, 2024

విశాఖ: గిరిప్రదక్షిణపై కలెక్టర్ సమీక్ష సమావేశం

image

ఈనెల 20వ తేదీన జరగనున్న సింహాచలం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వివిధ శాఖల అధికారులతో సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప, జాయింట్ కలెక్టర్ కే.మయూర్ అశోక్, ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.

News July 9, 2024

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించండి: ఎస్పీ మాధవరెడ్డి

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారి నుంచి 35 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి పరిష్కరించాలని ఆదేశించారు.

News July 9, 2024

గడువులోగా సమస్యలు పరిష్కరించాలి: పల్నాడు ఎస్పీ

image

ఫిర్యాదు దారుని సమస్యలపట్ల శ్రద్ధ వహించి వారి సమస్యలను గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ మలికా గార్గ్ ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వినతి పత్రాలను అందజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.

News July 9, 2024

కృష్ణా: స్టాప్ డయేరియా క్యాంపైన్ నిర్వహణపై కలెక్టర్ సమీక్ష

image

సీజనల్ వ్యాధుల నివారణకు జిల్లాలో స్టాప్ డయేరియా క్యాంపైన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని సోమవారం కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమావేశమైన ఆయన స్టాప్ డయేరియా క్యాంపైన్ నిర్వహణ తీరుపట్ల సమీక్షించారు. మున్సిపాలిటీల్లోని వార్డు సచివాలయం ఎమినిటీస్ సెక్రటరీల పరిధిలోని పైపులైనుల తనిఖీపై సమీక్షించారు.

News July 9, 2024

ఒంగోలు: Way2news కథనానికి స్పందించిన ఎస్పీ

image

జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగులు వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ పేర్కొన్నారు. మహిళకు అర్ధరాత్రి ఫోన్ చేసి వేధింపులు అనే కథనం “way2news”లో ఆదివారం రావడంతో ఎస్పీ సోమవారం స్పందించారు. లైంగిక వేధింపు నిరోధక చట్టాన్ని పక్కగా అమలు చేస్తున్నామని, అంతర్గత ఫిర్యాదుల మేరకు విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

News July 8, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

➤ ప్రజా ఫిర్యాదు నమోదు పరిష్కార వేదికలో 235 అర్జీలు స్వీకరణ ➤జి.సింగడాం: వర్షాలు కురవాలని కప్పతల్లికి పూజలు ➤ నరసన్నపేటలో రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ➤ నేటి నుంచి ఉచిత ఇసుక ➤ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో నేటి నుంచి దరఖాస్తులు ➤ ఇంజినీరింగ్ ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదు ➤ ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్‌లో కొత్త ఫీచర్లు ➤ పూరి జగన్నాథ యాత్రకు ప్రత్యేక బస్సులు ➤ శ్రీకాకుళం: ఫ్రైడే డ్రై డే పాటించాలి

News July 8, 2024

పాడేరు: ప్రభుత్వ పథకాలకు దూరం కాకూడదు- కలెక్టర్

image

జిల్లాలో ప్రతి ఒక్కరికీ ఆధార్ చేయించాలని, ఇదివరకే ఉన్న నమోదై పది ఏళ్లు దాటినవారికి మరోసారి అప్డేట్ చేయించి, బయోమెట్రిక్ చేయించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సోమవారం ఎంపీడీవోలను ఆదేశించారు. ఆధార్ లేక ఏ ఒక్కరూ ప్రభుత్వ పథకాలకు దూరం కాకూడదని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల ఫరిధిలో, ఏఎన్ఎంలు మినహా సచివాలయ సిబ్బందిని వినియోగించి మరోసారి ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించారు.

News July 8, 2024

శ్రీకాకుళం: ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్‌లో కొత్త ఫీచర్లు

image

విద్యుత్ బిల్లులు చెల్లింపు కోసం ఏపీఈపీడీసీఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్‌లో కొత్త ఫీచర్లు జత చేసినట్లు సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వితేజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులు సర్వీస్ సంబంధించిన విద్యుత్ వినియోగం, బిల్లు వివరాలు, బిల్లు చెల్లింపు, విద్యుత్ సరఫరా పరిస్థితి వివరాలు తెలుసుకునేలా కొత్త ఫీచర్లు తీసుకువచ్చినట్లు తెలిపారు.

News July 8, 2024

పాణ్యం హత్య కేసులో నలుగురి అరెస్ట్

image

పాణ్యం మండలంలోని మద్దూరు గ్రామంలో ఈ నెల 2న జరిగిన పెద్ద దస్తగిరి (50) హత్య కేసులో సోమవారం నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు పాణ్యం సీఐ నల్లప్ప తెలిపారు. వడ్డే రామాంజనేయులు, హరి, శ్రీనివాసులు, రవితేజ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి ఒక కారు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీస్ సిబ్బందిని సీఐ నల్లప్ప అభినందించారు.