Andhra Pradesh

News July 8, 2024

అనకాపల్లి: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

image

ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సమస్యలపై ప్రజలు 303 అర్జీలను అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులకు వాటిని పంపించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

News July 8, 2024

విశాఖ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

వేపగుంట పేస్ట్రీ చెఫ్ రెస్టారెంట్ వద్ద బి.ఆర్.టి.ఎస్ ప్రధాన రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదంఒకరు మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. పోలీసులు మృతుడిని ఎస్ కోట మండలం వెంకటరమణ పేట చెందిన కృష్ణ(37)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 8, 2024

ఏర్పేడు: 12న IISERలో కాన్వొకేషన్

image

ఏర్పేడు మండలం శ్రీనివాసపురం వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)నందు 12వ తేదీన ఐదో కాన్వొకేషన్ వేడుకను నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు లెక్చరర్ హాల్ కాంప్లెక్స్ వద్ద ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరు కావాలని కోరారు.

News July 8, 2024

శ్రీకాకుళం: మత్స్య అవతారంలో జగన్నాథుడు

image

శ్రీకాకుళం నగరంలోని మెండేటివీధి షిర్డీసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో జగన్నాథుని రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా సోమవారం జగన్నాథుడు, సుభద్ర బలభద్రుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగన్నాథ స్వామి వారిని మత్స్య అవతారంలో అలకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పరిసర ప్రాంతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.

News July 8, 2024

విజయనగరంలో ఈ నెల 11న జాబ్‌మేళా: అరుణ

image

నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి కల్పించే చర్యల్లో భాగంగా, వివిధ ప్రైవేటు కంపెనీల్లో మొత్తం 270 ఉద్యోగాల భ‌ర్తీ కోసం ఈ నెల 11న జాబ్‌మేళా నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి అరుణ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు త‌మ వివరాలను ముందుగా employment.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. జులై 11న ఉదయం 10 గంటలకు విజయనగరం శ్రీ చైతన్య డిగ్రీ క‌ళాశాల‌లో జరిగే ఇంటర్వ్యూకి హాజరుకావాలన్నారు.

News July 8, 2024

ఏలూరు: అంగన్వాడీలో భోజనం చేసిన కలెక్టర్

image

ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దామరచర్లలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం తప్పనిసరిగా పోషకాహారాన్ని అందించాలన్నారు. ఉదయం పాలు, మధ్యాహ్న భోజనంలో కూర, సాంబారు, కోడిగుడ్డు అందించాలన్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో పాల్గొన్నారు.

News July 8, 2024

గత ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీని తలపించింది: MP

image

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీని తలపించిందని రాజమండ్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి విమర్శించారు. సోమవారం రాజమండ్రిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. NDA ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. వీరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా NDA ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందిస్తుందని తెలిపారు.

News July 8, 2024

స్విమ్స్‌లో డిగ్రీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల

image

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జులై 22వ తేదీ లోగా దరఖాస్తులను సమర్పించాలని కోరింది.

News July 8, 2024

వైఎస్ జగన్‌‌ని కలిసిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కలిశారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వైసీపీ నాయకులతో కలిసి వైఎస్సార్‌కు నివాళులర్పించారు. ఈ క్రమంలో వైఎస్ భారతితో ఉష శ్రీ చరణ్ కాసేపు ముచ్చటించారు.

News July 8, 2024

శ్రీశైలంలో ఆ ఐదు రోజుల స్పర్శ దర్శనం నిలుపుదల

image

శ్రావణమాసంలో ఆగస్టు 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీ మల్లికార్జున స్వామి అలంకార దర్శనం మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంటుందని ఆయన ఈవో పెద్దిరాజు తెలిపారు. ఐదు రోజులపాటు స్వామివారి స్పర్శ దర్శనానికి భక్తులకు అనుమతి ఉండదన్నారు. నెలలో 16 రోజుల పాటు అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. వేకువజామున 4.30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తామన్నారు.