Andhra Pradesh

News July 8, 2024

అనకాపల్లి: ఆచూకీ చెబితే రూ.50వేలు బహుమతి

image

రాంబిల్లి మండలం కొప్పుగుంటపాలెంలో బాలికను హత్య చేసిన హంతకుడి వివరాలు తెలిపితే రూ.50 వేలు బహుమతి అందజేస్తామని అనకాపల్లి పోలీస్ శాఖ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హంతకుడి కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నా ఇంతవరకు ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ప్రకటన విడుదల చేసింది. హంతకుడి పేరు బోడాబత్తుల సురేశ్‌గా పేర్కొంది. ఆచూకీ తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, 94407 96084 నంబర్‌కు తెలియజేయాలని కోరింది.

News July 8, 2024

ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు: నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కలెక్టర్ ఆనంద్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

News July 8, 2024

ప.గో.: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

అగ్నివీర్ పథకంలో భాగంగా భారత వాయుసేనలో అగ్నివీర్ వాయి ఉద్యోగాల నియామకం కోసం భారత వాయుసేన నోటిఫికేషన్ విడుదల చేసిందని ప.గో. జిల్లా ఉపాధి అధికారి మధుభూషణరావు తెలిపారు. జులై 2004 నుంచి జనవరి 2008 మధ్య జన్మించిన స్త్రీ/పురుష అభ్యర్థులు మ్యాథ్స్, ఫిజిక్స్ ఇంగ్లీష్‌లో ఇంటర్ ఒకేషనల్, పాలిటెక్నిక్ కనీసం 50 శాతం మార్కులతో పాసైనవారు http://agnipathvayu.cdac.in వెబ్ సైట్లో 29వ తేదీలోపు అప్లై చేసుకోవాలన్నారు.

News July 8, 2024

రుషికొండ భవనాల వాడుక నీరు శుద్ధికి రూ.2.5 కోట్లు..!

image

రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాల నుంచి వచ్చే వాడుక నీటిని శుద్ధి చేసేందుకు భారీ వ్యయంతో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నిర్మించారు. దీనిని నిర్మించినందుకు రూ.2.50 కోట్లు ఖర్చు చేశారు. దీనిని బీచ్ రోడ్డులోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం పక్కన నిర్మించారు. ఇందుకోసం అర కిలోమీటర్ మేర భూగర్భంలో పైపులైన్లను ఏర్పాటు చేశారు. అత్యంత విలువైన వీధి దీపాలను కూడా ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.

News July 8, 2024

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ షర్మిల

image

కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి కుటుంబ సమేతంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గాన బయలుదేరి విజయవాడకు వెళ్లారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

News July 8, 2024

ఎమర్జెన్సీని తలపించిన YCP పాలన: పురందీశ్వరి

image

ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ పాలన ఎమర్జెన్సీ కాలంనాటి రోజులను తలపించిందని బీజేపీ  స్టేట్ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి అన్నారు. రాజమండ్రిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. జగన్ ఎంత నొక్కేశారో ప్రజలు గమనించే ఓడించారని తెలిపారు. బాధ్యతతో మెలుగుతూ ఏపీ అభివృద్ధికి సహకరిద్దామని పురందీశ్వరి అన్నారు.

News July 8, 2024

భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రావణమాసం ఏర్పాట్లు

image

శ్రీశైలం ఆలయానికి శ్రావణమాసంలో వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ ఈవో పెద్దిరాజు ఆదేశించారు. శ్రావణమాసం ఏర్పాట్లలో భాగంగా సోమవారం ఆలయ సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారికి శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.

News July 8, 2024

REWIND: వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జిల్లా పర్యటనలు

image

మాజీ ముఖ్యమంత్రి డా.వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో టెక్కలి, పలాస మీదుగా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగించారు. 2006లో నందిగం మండలం దేవలభద్ర గ్రామంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. 2008 జనవరి 2వ తేదీన శ్రీకాకుళం రిమ్స్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన, 2008 ఏప్రిల్ 4న పలాస మండలం రేగులపాడులో ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జూన్ 14 ఆమదాలవలస మండలం కృష్ణాపురం వద్ద వంశధార కెనాల్ ప్రారంభించారు.

News July 8, 2024

శ్రీశైలంలో ఉద్యోగుల విధుల్లో మార్పులు

image

పరిపాలన సౌలభ్యంలో భాగంగా శ్రీశైలం దేవస్థానంలో వివిధ కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల స్థానాలను మారుస్తూ ఈవో పెద్దిరాజు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఆలయంలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న 50మంది రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అంతర్గత బదిలీలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ.. ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారు విధులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

News July 8, 2024

నారా లోకేశ్‌తో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి భేటీ

image

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్‌తో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కోటంరెడ్డిని నారా లోకేశ్ ఆప్యాయంగా పలకరించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పనులకు సంబంధించి పలు అంశాలను కోటంరెడ్డి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.