Andhra Pradesh

News September 28, 2024

విజయవాడ: మధ్యాహ్న భోజన పథకం అమలుపై వర్క్‌షాప్

image

కలెక్టర్ జి.సృజన శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో విజయవాడ కలెక్టరేట్‌లో వర్క్‌షాప్ నిర్వహించారు. వర్క్‌షాప్‌లో DSEO యూవీ సుబ్బారావు, న్యూట్రిషనిస్ట్ డా.సుష్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం మెనూ అమలు, తదితర అంశాలపై కలెక్టర్ జి. సృజన క్షేత్రస్థాయి అధికారులకు పలు కీలక సూచనలిచ్చారు.

News September 28, 2024

CM పర్యటన ఏర్పాట్లపై కర్నూలు కలెక్టర్ సమీక్ష

image

కర్నూలు జిల్లా పత్తికొండ మండల పరిధిలోని పుచ్చకాయలమడలో అక్టోబర్ 1న CM చంద్రబాబు పర్యటించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో CM పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. CM పర్యటన ఏర్పాట్లపై శనివారం జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్షించారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, పత్తికొండ ఆర్డీవో రామలక్ష్మి పాల్గొన్నారు.

News September 28, 2024

ఏలూరు: వైసీపీ మాజీ MLAపై కేసు నమోదు

image

ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని)పై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. అవుటుపల్లి నాగమణి అనే మహిళ కోర్టులో ఫిర్యాదు చేయగా.. కోర్టు ఆదేశాల మేరకు ఆళ్ల నాని అతని అనుచరులపై కేసు నమోదు చేశామని శనివారం పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 28, 2024

VZM: రేపు శాప్ ఎండీ గిరీశ పి.ఎస్‌ జిల్లాకు రాక

image

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ. గిరీశ పి.ఎస్‌.ఆదివారం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంక‌టేశ్వ‌ర‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఉద‌యం 12 గంట‌ల‌కు జిల్లా కేంద్రానికి చేరుకొని విజ్జీ స్టేడియం వ‌ద్ద శాప్ క్రీడా మైదానాన్ని ప‌రిశీలిస్తారని పేర్కొన్నారు. అనంతరం క్రీడా సంఘాలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.

News September 28, 2024

ప్రకాశం: అక్టోబర్ 1న పెన్షన్ పంపిణీ చేయండి: కలెక్టర్

image

వచ్చే నెల 1వ తేదీన ఉదయం 5 గంటల నుంచే ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీపై డీఎల్‌డీఓలు, అన్ని మండలాల ఎంపీడీవోలు, మండల స్పెషల్ ఆఫీసర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబరు 2వ తేదీ మహాత్మా గాంధీజీ జయంతి ప్రభుత్వ సెలవు దినము కావున 1వతేదీనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News September 28, 2024

కృష్ణా: సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున వర్సిటీ పరిధిలోని కాలేజీలలో ఎం-ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల (సప్లిమెంటరీ) టైం టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 18, 21, 23, 25 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News September 28, 2024

పాలకొల్లులో మంత్రి నారాయణ రేపటి పర్యటన ఇలా..

image

మంత్రి నారాయణ ఆదివారం పాలకొల్లులో పర్యటించనున్నారనిి అధికారులు శనివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు పాలకొల్లు మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్‌ను పరిశీలిస్తారన్నారు. 10:40కి అబ్దుల్ కలాం పార్క్, 10:50 గంటలకు సీబీఎన్ ఉద్యానవనం, 11 గంటలకు ఎన్టీఆర్ కళాక్షేత్రం, 11:10 గంటలకు అన్న క్యాంటీన్, 12:50 గంటలకు టిడ్కో ఇళ్ల వద్ద ప్రెస్ మీట్ ఉంటుందన్నారు. 2:30 గంటలకు మున్సిపల్ ఆఫీసులో రివ్యూ నిర్వహిస్తారన్నారు.

News September 28, 2024

కృష్ణా జిల్లాలో పకడ్బందీగా పోలీస్ గస్తీ విధులు

image

కృష్ణా జిల్లాలో రాత్రి సమయాల్లో పకడ్బందీగా పోలీస్ గస్తీ విధులు నిర్వహిస్తున్నామని జిల్లా పోలీస్ యంత్రాంగం తమ అధికారిక ఖాతాలో శనివారం ట్వీట్ చేసింది. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది బీట్ పాయింట్స్ విస్తృతంగా తనిఖీ చేస్తున్నారని పేర్కొంది. ఏటీఎంలు, వ్యాపార సముదాయాల వద్ద పహారా కాస్తూ ఎటువంటి నేరాలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పని చేస్తోందని ఈ మేరకు Xలో పోస్ట్ చేసింది.

News September 28, 2024

టెట్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: DRO

image

అక్టోబర్ 3వ తేదీ నుంచి జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌కు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని DRO పెద్ది రోజా అధికారులను ఆదేశించారు. టెట్ పరీక్షల నిర్వహణపై తన ఛాంబర్లో శనివారం ఆమె సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144సెక్షన్ అమలు చేయాలన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని చెప్పారు. రవాణా శాఖ అధికారులు అన్ని రూట్‌లలో సకాలంలో బస్సులు నడపాలని స్పష్టం చేశారు.

News September 28, 2024

కడప జిల్లాలో టెట్ పరీక్షలు.. పరీక్షా కేంద్రాలు ఇవే

image

<<14220966>>కడప<<>> జిల్లాలో అక్టోబర్ 3 నుంచి జరిగే టెట్ పరీక్షా కేంద్రాల వివరాలు.
☛ శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ KORM కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కడప
☛ KSRM కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కడప
☛ శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ KLM ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ కడప
☛ SRIT ప్రొద్దుటూరు
☛ CBIT ప్రొద్దుటూరు