Andhra Pradesh

News July 8, 2024

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డల్లాస్‌లో నిరసనలు

image

అమెరికాలోని డల్లాస్‌లో థామస్ జేఫర్ సన్ పార్కులో ప్రవాసాంధ్రులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. సెయిల్ ‌లో స్టీల్ ప్లాంట్ ‌ను విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలన్నారు. విశాఖ ఉక్కు తెలుగు వారి గండె చప్పుడుగా పేర్కొన్నారు.

News July 8, 2024

పుంగనూరు: న్యాయ విభాగం ఏర్పాటు చేసిన పెద్దిరెడ్డి

image

వైసీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు దాడి చేస్తున్న నేపథ్యంలో వారికి అండగా ఉండేలా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయ విభాగం ఏర్పాటు చేసినట్టు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం నలుగురు లాయర్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. దాడులను అడ్డుకుంటే.. తిరిగి వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయడం దారుణమని వెల్లడించారు.

News July 8, 2024

మాచర్ల: రోడ్డు ప్రమాదంలో పర్యాటకశాఖ ఉద్యోగి మృతి

image

మాచర్ల మండలం ఏకనాంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్యాటక శాఖ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న రామారావు(45) బైక్ మీద వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఆయన మృతిచెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News July 8, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి దశావతారాల్లో జగన్నాథుడు

image

జిల్లా వ్యాప్తంగా శ్రీకాకుళం, టెక్కలి, ఇచ్చాపురం, నరసన్నపేట ప్రాంతాల్లో జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర రథయాత్ర ప్రారంభమైంది. ఈ మేరకు సుమారు 11 రోజుల పాటు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 8న మత్స్యవతారం, 9న కూర్మావతారం, 10న వరాహవతారం, 11,12న నృసింహావతారం, 13న వామనావతారం, 14న పరశురామవతారం, 15న శ్రీరామ అవతారం, 16న బలరామ-శ్రీకృష్ణావతారం, 17న తొలి ఏకాదశి రోజున శేష పాన్పు అవతారంలో దర్శనమిస్తారు.

News July 8, 2024

పవన్ కళ్యాణ్‌కు మాటిచ్చి.. రంగంలోకి కలెక్టర్

image

సమస్యల పరిష్కారం నిమిత్తం 2 వారాలకొకసారి కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ స్వయంగా పిఠాపురంలో అందుబాటులో ఉంటానని ముందుకు వచ్చినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడ సభా వేదికపై వెల్లడించిన విషయం తెలిసిందే. పవన్‌కు ఇచ్చిన మాట ప్రకారం ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కలెక్టర్ షాన్‌మోహన్ సోమవారం పిఠాపురం విచ్చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

News July 8, 2024

వైఎస్ఆర్‌తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కాటంరెడ్డి

image

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆయనతో ఉన్న జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వైఎస్సార్‌తో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేస్తూ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇవే మా ఘన నివాళులంటూ ఆయన పేర్కొన్నారు.

News July 8, 2024

పాప ఆచూకీ తెలిసినవారు మాకు తెలియజేయండి : ఎస్ఐ జయశేఖర్

image

ఎనిమిదేళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన ఆదివారం జరిగింది. ఎస్సై జయశేఖర్ వివరాలు..పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 8ఏళ్ల చిన్నారి వాసంతి ఆదివారం మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటికి వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ముచ్చుమర్రి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన కేసు నమోదు చేసుకొని పాప కోసం గాలిస్తున్నారు. పాప ఆచూకీ తెలిసినవారు పోలీసుస్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.

News July 8, 2024

పీఏబీఆర్‌లో పడిపోయిన నీటిమట్టం

image

కూడేరు మండల పరిధిలోని పెన్నాహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) డ్యాంలో నీటిమట్టం పడిపోయిందని అధికారులు తెలిపారు. ఆదివారం నాటికి డ్యామ్‌లో 0.588 టీఎంసీల నీరు ఉన్నట్లు డ్యాం అధికారులు వెల్లడించారు. జలాశయం వద్ద ఏర్పాటైన శ్రీరామారెడ్డి, సత్యసాయి, అనంతపురం, ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు రోజు సుమారు 60 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు.

News July 8, 2024

కృష్ణా: కైకలూరులో మాజీ ఎమ్మెల్యేపై ఫ్లెక్సీల కలకలం

image

కైకలూరు మాజీ MLA దూలం నాగేశ్వరరావు 2019 నుంచి 2024 వరకు చేసిన అరాచకాలు అంటూ.. మంగళవారం పలుచోట్ల ఫ్లెక్సీలు కలకలం రేపాయి. నాగేశ్వరావు ఐదేళ్ల పాలనలో అనేక అక్రమాలు, ఆక్రమణలు, దౌర్జన్యాలు చేశారంటూ పట్టణంలోని నాలుగు ప్రధాన కూడళ్లలో ప్లెక్సీ ఏర్పటు చేశారు. ఎమ్మెల్యే బాధితుల సంఘం అధ్యక్షుడు అంటూ వరప్రసాద్(బాబి) పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

News July 8, 2024

రుషికొండ భవనాల వాడుక నీరు శుద్ధికి రూ.2.5 కోట్లు..!

image

రుషి కొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాల నుంచి వచ్చే వాడుక నీటిని శుద్ధి చేసేందుకు భారీ వ్యయంతో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నిర్మించారు. దీనిని నిర్మించినందుకు రూ.2.50 కోట్లు ఖర్చు చేశారు. దీనిని బీచ్ రోడ్డులోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం పక్కన నిర్మించారు. ఇందుకోసం అర కిలోమీటర్ మేర భూగర్భంలో పైపులైన్లను ఏర్పాటు చేశారు. అత్యంత విలువైన వీధి దీపాలను కూడా ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.