Andhra Pradesh

News July 8, 2024

నగరి : YSRకు నివాళులు అర్పించిన ఆర్కే రోజా

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి ఆర్కే రోజా సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. రాష్ట్ర చరిత్రలోనే 108 అంబులెన్స్ ప్రవేశపెట్టి రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. ఆరోగ్యానికి పెద్దపీట వేసి ఎంతోమందికి పునఃజన్మ ప్రసాదించిన దేవుడు వైఎస్సార్ అని కొనియాడారు.

News July 8, 2024

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

image

కేంద్ర ప్రభుత్వం పరిధిలో అగ్నివీర్, అగ్నిపథ్ స్కీం కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు జులై 8 నుంచి 28వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ వెల్లడించారు. ఈ మేరకు అవివాహిత యువత ఇంటర్, 10వ తరగతిలో 50 శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. మరిన్ని వివరాల కోసం agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

News July 8, 2024

కర్నూలు: వెబ్సైట్‌లో ఇసుక నిల్వల వివరాలు

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో ఇవాళ నుంచి ఉచిత ఇసుక విధానం అమలవుతోంది. వినియోగదారులు ఇసుక సమాచారం వివరాలు https://www.mines.ap.gov.in/permit/ అనే వెబ్సైట్‌లో చూసుకోవాలని జిల్లా గనులు, భూగర్భ శాఖ ఉప సంచాలకులు రాజశేఖర్ తెలిపారు. ఇసుక స్టాక్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎంత నిల్వ ఉంది, తదితర వివరాలు వెబ్‌సైట్‌లో ఉంటాయని పేర్కొన్నారు.

News July 8, 2024

విశాఖ: నేటి నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు

image

ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న కౌన్సిలింగ్‌లో భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఆదివారంతో ముగిశాయి. వెబ్ ఆప్షన్లను సోమవారం నుంచి ఈనెల 12 వరకు ఎంపిక చేసుకోవాలని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సూర్యనారాయణ ఆదివారం తెలిపారు. 13న వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చన్నారు. 16న సీట్ల కేటాయింపు 17 నుంచి 22 వరకు సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టు చేయాలన్నారు. 19న క్లాసులు ప్రారంభమవుతాయన్నారు

News July 8, 2024

నెల్లూరు: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన వేదాయపాళెం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే పోలీసులు మృతుడి వయసు సుమారు 55 ఏళ్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

News July 8, 2024

కాకినాడ: BJP గూటికి ఇద్దరు మాజీ కార్పొరేటర్లు

image

కాకినాడకు చెందిన ఇద్దరు మాజీ కార్పొరేటర్లు గోడి సత్యవతి, గరిమెళ్ల శర్మ బీజేపీ గూటికి చేరారు. గోడి సత్యవతి భర్త వెంకట్ సైతం కాషాయ కండువా కప్పుకున్నారు. గతంలో BJPలో ఉన్న వీరు YCPలో చేరారు. తిరిగి ఆదివారం సొంతగూటికి రాగా.. బీజేపీ స్టేట్ చీఫ్, రాజమండ్రి MP పురందీశ్వరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్‌కుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News July 8, 2024

అనకాపల్లి: ప్రాణాలు తీసిన ఫొటోల సరదా

image

మాడుగుల మండలం తాచేరు ప్రాంతంలో ఫొటోలు దిగేందుకు వచ్చిన గుర్రం చందుమోహన్, గుబ్బల జ్ఞానేశ్వర్ అనే బావ బామ్మర్దులు నీటిలో మునిగి చనిపోయినట్లు ఎస్సై దామోదర్ నాయుడు తెలిపారు. తాచేరులో రాయిపై చందుమోహన్ నిల్చుని ఫొటో తీసుకుంటూ నీటిలో పడిపోగా.. అతనిని రక్షించేందుకు జ్ఞానేశ్వర్ నీటిలో దూకాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మరణించినట్లు పేర్కొన్నారు. మృతదేహాలను అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు.

News July 8, 2024

శ్రీకాకుళం: ‘కల్కి బుజ్జి’ కారు పర్యటన రద్దు

image

శ్రీకాకుళం జిల్లాల్లో ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి సినిమాలోని బుజ్జి కారు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో ప్రదర్శన చేపట్టారు. అయితే సోమవారం శ్రీకాకుళం జిల్లాకు బుజ్జి కారు రావాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా కారు విజయనగరం నుంచి వెనక్కి వెళ్లిపోయినట్లు జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం తెలిపారు.

News July 8, 2024

గుంటూరు: ఇసుకపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ఇదే.!

image

జిల్లాలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమలు కానుంది. కొల్లిపర, మున్నంగి, గుండిమెడ, తాళ్లాయపాలెం, లింగాయపాలెంలో ఇసుక నిల్వలు ఉండగా.. టన్ను ధర రూ.250గా నిర్ణయించారు. వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేసి ఇసుక పొందవచ్చని జిల్లా అధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 0863-2234301కు ఫోన్ చేయవచ్చని చెప్పారు.

News July 8, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీగార్డు దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం ఉదయం జరిగింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న లక్ష్మీనారయణ విధులు ముగించుకుని బైక్‌లో వెళుతుండగా బత్తలపల్లి మండలం ముష్టూర్ వద్ద కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది.