Andhra Pradesh

News July 8, 2024

ఉత్తరాంధ్ర లయన్స్‌పై రాయలసీమ కింగ్స్ విజయం

image

విశాఖ వైఎస్‌ఆర్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం ఏపీఎల్ సీజన్-3 మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర లయన్స్- రాయలసీమ కింగ్స్ జట్లు తలబడ్డాయి. ఆరు వికెట్ల తేడాతో రాయలసీమ కింగ్స్ జట్టు విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి ఉత్తరాంధ్ర లయన్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 121 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తర్వాత రాయలసీమ కింగ్స్ 17.3 ఓవర్లలో ఆరు వికెట్ల ఆదిక్యంతో 122 పరుగులు చేసి గెలుపొందింది.

News July 8, 2024

విజ‌య‌వాడ‌: ముగిసిన UPSC EPFO, ESICప‌రీక్ష‌లు

image

విజ‌య‌వాడ‌లో ఆదివారం యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించిన EPFO ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌, ESIC న‌ర్సింగ్ ఆఫీస‌ర్ ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా ముగిసిన‌ట్లు క‌లెక్ట‌ర్ సృజ‌న తెలిపారు. EPFO ప‌రీక్ష‌కు సంబంధించి 2,401 మందికి, ESIC ప‌రీక్ష‌కు 5,433 మంది అభ్య‌ర్థులకు విజయవాడలో ఏర్పాటు చేసిన 25 ప‌రీక్షా కేంద్రాలను క‌లెక్ట‌ర్ సృజ‌న పరిశీలించారు. 

News July 8, 2024

ఆమదాలవలస: కుప్పిలికి రాష్ట్ర స్థాయి బహుమతి

image

ఆమదాలవలస పట్టణానికి చెందిన సాహితీవేత్త, కవి, తెలుగు విశ్రాంత ఉపాధ్యాయుడు కుప్పిలి వెంకటరాజారావుకు రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. నెల్లూరుకు చెందిన అక్షరం సంస్థ గతనెలలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన కవితల పోటీల్లో రాజారావు రచించిన ‘ఆ వేలి చుక్కకు ఎప్పుడూ చుక్కెదురే’ అనే
కవితకు ప్రథమ బహుమతి లభించినట్లు రాజారావు ఆదివారం తెలిపారు.

News July 7, 2024

శ్రీకాకుళం జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

* ప్రతి ఎకరానికి సాగునీరు: కలెక్టర్
* 104 సిబ్బంది సమస్యలను పరిష్కరించండి: వైద్య సిబ్బంది
* థాంక్యూ సీఎం కార్యక్రమంలో రక్తదానం
* విధుల్లో నిర్లక్ష్యం.. ఉద్యోగి సస్పెండ్
* కేజీబీవీ సిబ్బందిపై అధికారుల ఆగ్రహం
* రెండు వరుస అల్పపీడనాలు: నిపుణులు
* నెల రోజుల్లో సాగునీరు అందించాను: గౌతు శిరీష
* మలేరియాతో చిన్నారి మృతి

News July 7, 2024

శ్రీకాకుళం: విధుల్లో నిర్లక్ష్యం.. ఉద్యోగి సస్పెండ్

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని సాంఘీక సంక్షేమ బాలురు కళాశాల వసతిగృహంలో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి డీ.ఎర్రన్నాయుడును సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టి.. రుజువవ్వడంతో ఆదివారం ఆయనని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

News July 7, 2024

గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

గంట్యాడ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో గంట్యాడకి చెందిన హరీశ్ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

News July 7, 2024

ఏలూరు: 30 రోజులుగా నిరసన

image

ఏలూరు జిల్లా గణపవరం మండలం సరిపల్లి ఫ్యాక్టరీ వద్ద సీపీఎఫ్ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన నిరసన ఆదివారంతో 30వ రోజుకు చేరుకుంది. మూసిన ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగుతుందని, సమస్య పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. నెల రోజులుగా ధర్నా చేస్తున్నా యాజమాన్యం స్పందించకపోవడం దారుణమని అన్నారు.

News July 7, 2024

విశాఖలో జగన్నాథ స్వామి 1,008 వంటకాలతో నైవేధ్యం

image

విశాఖలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్ర ఉడా పార్కు నుంచి సిరిపురంలో గురజాడ కళాక్షేత్రం వరకు ఘనంగా సాగింది. దారిపొడవునా జగన్నాథ స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి ఊరేగింపు ఘనంగా సాగింది. గురజాడ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్నాథ స్వామికి 1,008 వంటకాలతో నైవేద్యం సమర్పించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు.

News July 7, 2024

భూ కజ్జాలు చేస్తే ఉపేక్షించం: మంత్రి సుభాశ్

image

పామర్రు మండలం కోటిపల్లిలో ఆరాద్రి అంజనీకుమారి అనే వృద్ధురాలి భూమి కబ్జాకు గురైంది. ఈ విషయాన్ని మంత్రి వాసంశెట్టి సుభాశ్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన మంత్రి వెంటనే వెళ్లి ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించారు. భూమిని ఆక్రమించుకున్నది ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అంజనీకుమారికి ధైర్యం చెప్పి.. తక్షణమే ఆమెకు న్యాయం జరగాలని పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు.

News July 7, 2024

 మంత్రి ఫరూక్‌ను కలిసిన నంద్యాల కలెక్టర్

image

మంత్రి ఫరూక్‌ను ఆదివారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నంద్యాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ మంత్రిని కోరారు. నంద్యాల జిల్లా అభివృద్ధే తన ధ్యేయమని మంత్రి వెల్లడించారు.