Andhra Pradesh

News July 7, 2024

బుచ్చి: కాలువలోకి దూసుకెళ్లిన కారు

image

బుచ్చిరెడ్డిపాలెం మండలం సల్మాన్ పురం గ్రామం సమీపంలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 7, 2024

ఆమదాలవలస: కుప్పిలికి రాష్ట్ర స్థాయి బహుమతి

image

ఆమదాలవలస పట్టణానికి చెందిన సాహితీవేత్త, కవి, తెలుగు విశ్రాంత ఉపాధ్యాయుడు కుప్పిలి వెంకటరాజారావుకు రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. నెల్లూరుకు చెందిన అక్షరం సంస్థ గతనెలలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన కవితల పోటీల్లో రాజారావు రచించిన ‘ఆ వేలి చుక్కకు ఎప్పుడూ చుక్కెదురే’ అనే
కవితకు ప్రథమ బహుమతి లభించినట్లు రాజారావు ఆదివారం తెలిపారు.

News July 7, 2024

టన్ను ఇసుక రూ.250: కలెక్టర్ నాగలక్ష్మి

image

గుంటూరు జిల్లాలో ఒక టన్ను ఇసుక రూ.250లకు లభిస్తుందని కలెక్టర్ నాగలక్ష్మి ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 5 స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక అందుబాటులో ఉందని ఆమె వెల్లడించారు. వినియోగదారులు ఆధార్ కార్డును చూపించి ఇసుకను పొందాలని సూచించారు. అయితే రోజుకి 20 టన్నులు మాత్రమే ఒక్కో వినియోగదారుడికి అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News July 7, 2024

ప్యాపిలి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ప్యాపిలి మండలంలో జరిగినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఎర్రగుంట్లపల్లెకు చెందిన వైసీపీ నేత పోతురెడ్డి వెంకటేశ్వర రెడ్డి కుమారుడు ధీరజ్(23) స్నేహితుడు రమేశ్‌తో కలిసి ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి  వస్తుండగా పెద్దమ్మ డాబా వద్ద ఓ కారు వారిని ఢీకొంది. ధీరజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన రమేశ్‌ను కర్నూలుకు తరలించారు. 

News July 7, 2024

తిరుపతి ఎస్వీ జూలో ఆడ పులి మృతి

image

తిరుపతి SV జూపార్క్‌లో ఆడ పులి మృతి చెందిందని జూపార్క్ క్యూరేటర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అనిమల్ ఎక్స్చేంజ్ అనే కార్యక్రమంలో భాగంగా లక్నోలో గల నవాబ్ మజీద్ అలీషా జువాలాజికల్ పార్క్ నుంచి జాలి అనే ఐదేళ్ల వయసు గల ఆడపులిని జూ పార్క్ కు తీసుకొచ్చారు. జూన్ మొదటి వారంలో డే కేర్ లో ఆడుతూ కిందపడి తీవ్రంగా గాయపడింది. మెరుగైన వైద్యం అందించినప్పటికీ పులి మృతి చెందిందని అన్నారు.

News July 7, 2024

ఉదయగిరి: జగన్‌పై అటవీ శాఖకు తగ్గని ప్రేమ !

image

రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలల గడుస్తున్న అటవీశాఖ అధికారులలో మాత్రం జగనన్న ప్రభుత్వం మీద అమితమైన ప్రేమ అలాగే ఉంది. ఉదయగిరి మండలం బండగానిపల్లె కూడలి వద్ద అటవీశాఖ ఉదయగిరి రేంజ్ అధికారులు ఏర్పాటు చేసిన ‘అడవికి నిప్పు మనుగడకు ముప్పు’ అనే ఫ్లెక్సీలు జగనన్న ఫోటోతో దర్శనమివ్వడంతో అధికారుల తీరును పలువురు విమర్శిస్తున్నారు.

News July 7, 2024

ఒంగోలు: 11న ఐటీఐ విద్యార్థులకు జాబ్ మేళా

image

ఒంగోలులోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కాలేజీలో ఈ నెల 11న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు బాలికల ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్‌ పి.ఉమామహేశ్వరిదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ చదువుతున్న, పాసైన అభ్యర్థులను ఉద్యోగం లేదా అప్రంటీస్‌ శిక్షణకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షణ భృతి చెల్లిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 7, 2024

డి.హీరేహల్: రోడ్డు ప్రమాదంలో యువకుడి స్పాట్ డెడ్ 

image

రహదారిపై అతివేగంగా ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన ఘటన డి.హీరేహల్ మండలంలో ఆదివారం జరిగినట్లు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. బళ్లారికి చెందిన ఇద్దరు యువకులు స్కూటీపై వేగంగా వెళుతూ ఓబుళాపురం వద్ద అదుపుతప్పి కింద పడ్డారు. ప్రమాదంలో మహబూబ్ బాషా(21) అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని బళ్లారికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.       

News July 7, 2024

ప్రజాస్వామ్యాన్ని కాపాడిన అక్షరయోధులు రామోజీరావు: ఎంపీ లావు

image

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య వైఫల్యాలపై నిరంతరం యుద్ధం చేసి ప్రజా విజయానికి కృషి చేసిన అక్షరయోధులు రామోజీరావు అని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఆదివారం గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జన చైతన్య వేదిక, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో అక్షరయోధులు రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. 

News July 7, 2024

శ్రీకాకుళంలో అతిపెద్ద జగన్నాథ రథం ఇక్కడే

image

పాలకొండ పట్టణంలోని జగన్నాథ ఆలయానికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. ఒడిశాకి చెందిన జైపూర్ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఏటా రథయాత్ర ఉత్సవాలు ఒడిశా సంప్రదాయంలోనే నిర్వహిస్తారు. ఇక్కడి జగన్నాథ రథం జిల్లాలోనే అతిపెద్దది. ఉత్తరాంధ్ర, ఒడిశా భక్తులు కూడా స్వామివారి ఉత్సవాలలో పాల్గొంటారు. పూరీ తర్వాత అంతటి నిష్ఠతో ఏటా తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వేల మంది భక్తులు హాజరవుతారు.