Andhra Pradesh

News July 7, 2024

ఒంగోలు: ఆకతాయిని స్తంభానికి కట్టేసి చితకబాదిన స్థానికులు

image

కారుకు పోలీసు హారన్‌ బిగించి ఒంగోలు రోడ్లపై ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ భయాందోళనలకు గురి చేసిన ఓ ఆకతాయికి స్థానికులు శనివారం దేహాశుద్ధి చేశారు. పేర్నమిట్టకు చెందిన రవి ఇటీవలే కొత్త కారు కొని 4 రోజుల నుంచి పగలు రాత్రీ తేడాలేకుండా తిరుగుతున్నాడు. రోడ్డుపై వెళుతున్న ఒక మహిళకు అతి సమీపంలో కారు తీసుకెళ్లి ఆటపట్టించాడు. ఆగ్రహానికి గురైన మహిళ, స్థానికులు అతనిని పట్టుకొని తాళ్లతో కట్టేసి చితకబాదారు.

News July 7, 2024

పల్నాడు: పొలంలో పేలిన నాటు బాంబు

image

దుర్గి మండలం జంగమహేశ్వరంపాడు గ్రామ శివారు ప్రాంతంలో ఆదివారం ఉదయం నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగమహేశ్వరంపాడు గ్రామ శివారు పొలాలకు ఆనుకొని ఉన్న కంచెలో నాటు బాంబు పేలి పెద్ద శబ్దం వచ్చింది. దీంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

News July 7, 2024

సరుబుజ్జిలి: మలేరియాతో చిన్నారి మృతి

image

సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల మూడో తరగతి విద్యార్థి బిడ్డిక రశ్మిత మలేరియాతో రిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు. పాఠశాలలో చిన్నారికి జ్వరం రావడంతో సరుబుజ్జిలి పీహెచ్సీ వైద్యులు చికిత్స చేశారు. వైద్యుల సలహా మేరకు ఈనెల 5న మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. బాలిక మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News July 7, 2024

అమరావతిలో ORR విశేషాలు ఇలా.!

image

ఉమ్మడి గుంటూరు జిల్లా CRDA పరిధిలో 189 KM పొడవున ORR నిర్మాణం జరగనుంది. 150 మీటర్ల వెడల్పుతో 2 వైపులా సర్వీస్‌ రోడ్లు కాకుండా 6 వరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో నిర్మాణం పూర్తయితే కంచికచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు కలిపి 10 మండలాల్లోని 49 గ్రామాల మీదుగా ORR వెళ్తుంది.

News July 7, 2024

ప.గో.: అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశాలు

image

ప.గో. జిల్లాలో పంట కాల్వలు, డ్రెయిన్లకు సంబంధించిన పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. పాలకొల్లులో శనివారం నిర్వహించిన సమీక్షలో అధికారులతో ఆయన చర్చించారు. డ్రెయిన్లకు సంబంధించి 35, పంట కాల్వలకు సంబంధించి 55 పనులను చేయడానికి టెండర్ల ప్రక్రియ పూర్తయినందున తదుపరి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన సూచించారు.

News July 7, 2024

బాపట్ల: అగ్నివీర్‌కు దరఖాస్తులు ఆహ్వానం.. వెబ్సైట్ ఇదే.!

image

అగ్నివీర్ భారత వాయు సేనలో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భారత వైమానిక దళం నాన్ కమిషన్ ఆఫీసర్ సుధాకర్ తెలిపారు. బాపట్లలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని.. 2004 జులై 3 నుంచి 2008 జనవరి 3వ తేదీ మధ్యలో జన్మించిన వారే అర్హులన్నారు. భారత సైన్యంలో చేరాలనుకునే యువకులు ” https://agnipathvayu.cdac.in ” వెబ్ సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News July 7, 2024

అమరావతిలో ORR విశేషాలు ఇలా.!

image

ఉమ్మడి గుంటూరు జిల్లా CRDA పరిధిలో 189 KM పొడవున ORR నిర్మాణం జరగనుంది. 150 మీటర్ల వెడల్పుతో 2 వైపులా సర్వీస్‌ రోడ్లు కాకుండా 6 వరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో నిర్మాణం పూర్తయితే కొల్లిపర, పొన్నూరు, తెనాలి, చేబ్రోలు, వట్టిచెరుకూరు, గుంటూరు, మేడికొండూరు, యడ్లపాడు, తాడికొండ, పెదకూరపాడు, అమరావతి మండలాల్లోని 38 గ్రామాల మీదుగా ORR వెళ్లనుంది.

News July 7, 2024

రాజాం: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

image

మానసిక పరిస్థితి బాగలేకపోవడంతో రాజాం మండలం పరశురాంపురం గ్రామానికి చెందిన బెవర అప్పలరాము పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు రాజాంలోని సామాజిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. భార్య అన్నపూర్ణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 7, 2024

మనుబోలు: రోడ్డు ప్రమాదంలో యువకుడిమృతి

image

కొమ్మలపూడి క్రాస్ రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై ఓ బస్సు ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. గూడూరు బాలాజీ నగర్‌కు చెందిన మనుబోలు సురేశ్ రెడ్డి ఉద్యోగం కోసం తన స్నేహితుడు పి.ప్రశాంత్‌తో కలిసి కృష్ణ పట్నం పోర్టుకు ఆదివారం బైక్ పై బయలుదేరాడు. కొమ్మలపూడి క్రాస్ రోడ్డు వద్ద బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 7, 2024

శ్రీకాళహస్తి: ఆశ చూపి మోసం చేశారని కేసు

image

శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామనగర్ కాలనీకి చెందిన సుధ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో నమ్మించి మోసం చేశారని ఫిర్యాదు చేయడంతో శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నరసింహారావు కథనం మేరకు.. ఓ ప్రకటనల కంపెనీలో పెట్టుబడులు పెట్టడంతో పెద్దఎత్తున ఆదాయాలు పొందవచ్చునని నర్మద కుటుంబ సభ్యులు సుధాని నమ్మించారు. దీంతో ఆమె ఏడాది పాటు రూ.39లక్షలు అందజేసింది. చివరికి ఇంటికి తాళంవేసి పరారయ్యారు.