Andhra Pradesh

News July 7, 2024

ప.గో.: ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాలేదని.. సూసైడ్

image

నిడదవోలుకు చెందిన ఓ యువతి (22) కోనసీమ జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రాజేష్ రెండేళ్లుగా ప్రేమించున్నారు. ప్రియుడికి ఏడాది క్రితం మరో యువతితో వివాహమైంది. రాజేష్‌ను రెండో పెళ్లి చేసుకుంటానని యువతి పేరెంట్స్‌తో చెప్పగా నిరాకరించారు. మనస్తాపంతో తాడేపల్లిగూడెంలో తాను నర్సుగా పనిచేస్తున్న ఆసుపత్రిలో శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మెరుగైన చికిత్సకోసం విజయవాడ తరలించగా చికిత్సపొందుతూ చనిపోయింది.

News July 7, 2024

తూ.గో.: ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాలేదని.. సూసైడ్

image

నిడదవోలుకు చెందిన ఓ యువతి (22) కోనసీమ జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రాజేష్ రెండేళ్లుగా ప్రేమించున్నారు. ప్రియుడికి ఏడాది క్రితం మరో యువతితో వివాహమైంది. రాజేష్‌ను రెండో పెళ్లి చేసుకుంటానని యువతి పేరెంట్స్‌తో చెప్పగా నిరాకరించారు. మనస్తాపంతో తాడేపల్లిగూడెంలో తాను నర్సుగా పనిచేస్తున్న ఆసుపత్రిలో శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మెరుగైన చికిత్సకోసం విజయవాడ తరలించగా చికిత్సపొందుతూ చనిపోయింది.

News July 7, 2024

శ్రీ సత్యసాయి: భార్యను చంపిన భర్త

image

పింఛన్ డబ్బులు అడిగితే ఇవ్వలేదని భార్యను భర్త రోకలిబండతో కొట్టి చంపాడు. బత్తలపల్లి మండలం తంబాపురంలోని YSR కాలనీకి చెందిన లక్ష్మమ్మ భర్త లక్ష్మన్న రాత్రి ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యను పింఛన్ డబ్బులు అడిగితే ఇవ్వలేదు. ఆగ్రహానికి లోనైన లక్ష్మన్న రోకలి బండతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కుమారుడు ముత్యాలప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

News July 7, 2024

ఉచితంగా ఇసుక స‌ర‌ఫ‌రా: విజయనగరం కలెక్టర్

image

రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు జిల్లాలో వినియోగ‌దారుల‌కు జులై 8వ తేదీ సోమ‌వారం నుంచి ఉచితంగా ఇసుక స‌ర‌ఫ‌రా చేస్తున్నట్లు కలెక్టర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ వెల్లడించారు. దానికి అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ామన్నారు. శ్రీ‌కాకుళం, మ‌న్యం జిల్లాల‌ నుంచి ఇసుక‌ను తీసుకువ‌చ్చి కొత్త‌వ‌ల‌స‌, డెంకాడ మండ‌లం పెద‌తాడివాడ‌, బొబ్బిలి గ్రోత్‌ సెంట‌ర్ త‌దిత‌ర ప్రాంతాల‌లో నిల్వ ఉంచామన్నారు.

News July 7, 2024

గుడివాడలో అర్ధరాత్రి నగ్నంగా క్షుద్రపూజల కలకలం

image

గుడివాడ పరిధిలోని రాజేంద్రనగర్‌లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నగ్నంగా ఇద్దరు మంత్రగాళ్లు క్షుద్రపూజలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గుడివాడ పరిధిలోని ఓ భవనంలో అఘోరాలను పోలిన ఇద్దరు తాంత్రికులు పూజలు చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. క్షుద్రపూజలపై గుడివాడ వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందగా పరిశీలిస్తున్నామని SI గౌతమ్‌ తెలిపారు.

News July 7, 2024

కడప: మరణంలోనూ వీడని స్నేహం

image

శనివారం రామాపురం మండలం కొండ్లవాండ్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా కడప వాసులేనని పోలీసులు గుర్తించారు. రాజారెడ్డి వీధికి చెందిన అలీఖాన్(35) ఇటీవల కారు కొన్నాడు. కారును టెస్ట్ డ్రైవ్ చేద్దామని తన స్నేహితులు జితేంద్ర (25), షేక్ అలీం (30), ఆంజనేయులు నాయక్ (28)‌తో కలిసి వెళ్లారు. కానీ.. మృత్యువు అనే రాకాసి వారిని తీసుకెళ్లింది.

News July 7, 2024

విశాఖ-కిరండూల్-విశాఖ ప్యాసింజర్ రద్దు

image

కేకే లైన్‌లో భద్రతాపరమైన ఆధునీకరణ పనుల కారణంగా విశాఖ-కిరండూల్-విశాఖ రైళ్లు ఈ నెల 8,9 తేదీల్లో రద్దు చేసినట్లు అరకు రైల్వేస్టేషన్ అధికారులు తెలిపారు. ఈనెల 8న ఉదయం 6.45 గంటలకు విశాఖ నుంచి కిరండూల్ బయలుదేరే స్పెషల్ ప్యాసింజర్(08551), అలాగే 9వ తేదీ ఉదయం 6 గంటలకు కిరండూల్ నుంచి విశాఖ బయలుదేరే ప్యాసింజర్(08552) రద్దు చేశారు. కావున ప్రయాణికులు, పర్యాటకులు గమనించి సహకరించాలని కోరారు.

News July 7, 2024

పలాస: మేకపోతు దొంగను పట్టుకుని చిత్తకొట్టారు

image

పలాస మండలం లొద్దభద్రలో శనివారం సాయంత్రం మేకపోతును దొంగలించి తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన కేశవరావు అనే గొర్రెల కాపరికి చెందిన మేకపోతును ముగ్గురు యువకులు కాళ్లు కట్టేసి తరలిస్తుండగా స్థానికులు చూశారు. ఆ సమయంలో ఇద్దరు యువకులు బైక్‌పై పరారవ్వగా ఓ యువకుడు స్థానికులకు చిక్కాడు. అతడిని స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు.

News July 7, 2024

విశాఖ: ‘రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవాలి’

image

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికపై పని చేస్తున్న అధ్యాపకులు సర్వీస్ రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవాలని వి.ఎస్.కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐవి జయబాబు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ నగరం జోన్-1,2 పరిధిలో 174 పోస్టులకు రెన్యువల్ చేస్తారని అన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో 2024 మార్చి 31 నాటికి కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.

News July 7, 2024

రాజాం: మంట పుట్టిస్తున్న మిర్చీ ధరలు

image

రాజాం కూరగాయల మార్కెట్లో గత నెల కిలో రూ.30 ఉన్న మిర్చిని ప్రస్తుతం రూ.100కు చేరింది. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు మిరపకు తెగుళ్లు సోకి మిరప పంటలు పాడైపోవడంతో దిగుమతి తగ్గింది. ఒకేసారి భారీగా ధరలు పెరిగిపోవడంతో వినియోగదారులకు మిరప మరింత ఘాటెక్కింది. ఇదిలా ఉండగా మిరప సాగు చేసే రైతులు నష్టాల్లో చిక్కుకుని అప్పుల పాలవతున్నామని వాపోయారు.