Andhra Pradesh

News April 21, 2025

శ్రీకాకుళం: నేడు ఈ మండలాల్లో రెడ్ అలర్ట్

image

శ్రీకాకుళం జిల్లాలో నేడు ఈ మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు తీవ్ర వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బూర్జ 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత , హిరమండలం 41.4, ఎల్ ఎన్ పేట 41.3, పాతపట్నం 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News April 21, 2025

కర్నూలు: పిడుగుపాటుతో యువకుడి మృతి

image

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొల్ల గోవిందు కుమారుడు గొల్ల ఈరన్న మరికొందరు ఆదివారం రాత్రి ఎమ్మిగనూరు SML డిగ్రీ కాలేజ్ వద్ద ఉన్నారు. అక్కడ ఒక్కసారిగా మెరుపులతో పిగుడు పడింది. దీంతో అక్కడున్న నలుగురు స్వల్ప గాయాలు కాగా.. ఈరన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 21, 2025

కడప: తాగిన మైకంలో గొంతు కోసుకున్న యువకుడు

image

కడపలో ఇమ్రాన్ మద్యం మత్తులో బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఇమ్రాన్‌కు తన భార్యతో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన అతను బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 21, 2025

GNT: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

image

జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో  అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.

News April 21, 2025

తమ్ముడి వివాహ నిశ్చయం కోసం వెళ్తూ..

image

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. తమ్ముడి వివాహ నిశ్చయానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అక్క మృతి చెందింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు.

News April 21, 2025

కడప: ఇవాళ ఆర్ట్స్ కళాశాలలో జాబ్ మేళా

image

కడప నగర పరిధిలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో 21 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 21, 2025

విశాఖలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం 

image

ద్వారకానగర్‌లో ఎస్టీ, ఎస్సి విద్యార్థుల ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్‌లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి డీఎస్సీ అభ్యర్థులు పాలాభిషేకం చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ  వేపాడ చిరంజీవరావు, తదితరులు పాల్గొన్నారు. 

News April 21, 2025

సమస్యలు ఉంటే తెలపండి: కడప కలెక్టర్

image

రేపు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కానీ వాటిపై నేరుగా కలెక్టరేట్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. దీంతో పాటు డయల్ యువర్ కలెక్టర్ ద్వారా 08562-244437 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను తెలపవచ్చన్నారు.

News April 21, 2025

కుప్పంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

కుప్పం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కరించడం లక్ష్యంగా కుప్పంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కడ పిడి వికాస్ మర్మత్ తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10.గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఏమైనా సమస్యలు ఉంటే అధికారులు దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు. అర్జీదారులు సద్వినియోగం చేసుకొవాలి

News April 21, 2025

రేపు యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్ 

image

ప్రజా సమస్యలు పరిష్కారo కోసం నిర్వహిస్తున్న పిజిఆర్ఎస్ కార్యక్రమం సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్ అలాగే డివిజన్, మునిసిపల్, మండల కేంద్రంలో ఉదయం 10 నుంచి మ.1 గంట వరకు ప్రజల నుంచి పిజిఆర్ఎస్ అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక అధికారులు , జిల్లా, డివిజన్ మండల, మునిసిపల్ క్షేత్ర స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు