Andhra Pradesh

News July 7, 2024

అనంత: మెట్రిక్‌ టన్నుకు రూ.195

image

ఇసుక పూర్తిగా ఉచితమే. కానీ.. లోడింగ్, రాయల్టీ కింద మెట్రిక్‌ టన్ను ఇసుకకు రూ.195 నిర్ణయించారు. లబ్ధిదారునికి రోజుకు 20 మెట్రిక్‌ టన్నులు మాత్రమే అందిస్తారు. ఆధార్‌ కార్డు, ఫోన్ నంబరు, డెలివరీ చిరునామా తప్పనిసరిగా అందించాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పంపిణీ చేస్తారు. అయితే డిపో నుంచి డెలివరీ చేయడానికి రవాణా ఛార్జీ కింద ఎంత వసూలు చేయాలనే దానిపై ఆదివారం వెల్లడించే అవకాశం ఉంది.

News July 7, 2024

కాకినాడ: క్షుద్రపూజలని అనుమానం.. అర్ధరాత్రి గొడవ

image

కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు సమీపంలో పోలవరం కాలువ గట్టు వద్ద కొన్నిరోజులుగా సంచార జాతులకు చెందిన కొందరు గుడారాలు వేసుకొని ఉంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వారు ఒక ఎనుబోతును బలిఇచ్చి పూజలుచేస్తుండగా స్థానికులు గుర్తించి ప్రశ్నించారు. ఈ క్రమంలో గొడవ జరిగి సంచారజాతులకు చెందిన ఓ వ్యక్తి స్థానికుడిపై కత్తితో దాడి చేశాడు. తుని గ్రామీణ పోలీసులకు ఫిర్యాదుచేయగా.. విచారణ చేపట్టారు.

News July 7, 2024

తంబళ్లపల్లె: పవన్ కళ్యాణ్ పీఏగా మధుసూదన్

image

డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ PAగా తంబళ్లపల్లె మండలం కోటకొండకు చెందిన జీఆర్ మధు సూదన్ నియమితులయ్యారు. విధి నిర్వహణలో ఎక్కడా అవినీతి మచ్చ లేకుండా నిజాయితీ పరుడిగా పేరు తెచ్చుకున్న మధుసూదన్‌ను డిప్యూటీ సీఎం తన PAగా ఎంచుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మధుసూదన్ కడప RDOగా పనిచేస్తూ సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించారు. పవన్ పీఏగా ఎంపికవడం పట్ల మండల ప్రజలు కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

News July 7, 2024

ఏలూరు: డిప్యూటీ తహశీల్దార్‌పై కత్తితో దాడి

image

ఏలూరు అమీనాపేట ప్రాంతంలో రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, ఏలూరు మండల డిప్యూటీ తహశీల్దార్‌ లామ్‌ విద్యాసాగర్‌పై నగరానికి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. శనివారం ఇంటి నుంచి కార్యాలయానికి బైక్‌పై వెళ్తుండగా ఇన్నోవా కారులో వచ్చిన సదరు వ్యక్తి తహశీల్దార్‌ను అడ్డుకొని దాడి చేసినట్లు చెబుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News July 7, 2024

తమ తల్లి హత్య కేసును సీఐడీకి అప్పగించాలని డీజీపీకి వినతి

image

ఆళ్లగడ్డలోని పాతూరు వీధిలో టీడీపీ మహిళా కార్యకర్త అట్లా శ్రీదేవి(54) ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావును శ్రీదేవి కుమారుడు అట్లా హర్షవర్ధన్ రెడ్డి, కుమార్తె రమ్యశ్రీ కోరారు. ఈ మేరకు శనివారం విజయవాడలో డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కేసును సీఐడీకి అప్పగించి విచారణ చేయించాలని కోరారు.

News July 7, 2024

ప్రకాశం: ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అగ్నివీర్ వాయు భారత సైన్యంలోకి చేరడానికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భారత వైమానిక దళం అధికారి సందీప్ తెలిపారు. అగ్నివీర్ వాయు అనుబంధ శాఖల అధికారులతో శనివారం బాపట్ల కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. భారత సైన్యంలోకి యువకులు చేరడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పారు. ఆసక్తి గలవారు ఈ నెల 8 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 7, 2024

కమలాపురం: రెండు నెలల బాలుడు మృతి

image

మండలంలోని వసంతపురం గ్రామానికి చెందిన రెండు నెలల బాలుడు శనివారం మృతిచెందాడు. ఏఎన్ఎం వ్యాధులు రాకుండా చిన్నారులకు శనివారం వ్యాధి నిరోధక టీకా వేసింది. అందులో భాగంగా రెండు నెలల బాలుడికి టీకా వేయించిన తల్లి అనంతరం పడుకోబెట్టింది. ఎంతసేపటికీ బాలుడు నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పెద్దచెప్పలి పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

News July 7, 2024

గుంటూరు: ఇంట్లో వ్యభిచారం.. మహిళపై కేసు

image

వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళపై శనివారం నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటి అగ్రహారంలో దేవి అనే మహిళ ఒక ఇంటిని కొన్ని నెలల కిందట అద్దెకు తీసుకుని ఉంటుంది. అయితే ఆ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. నిజమేనని తేలడంతో నిర్వాహకురాలు దేవిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మధుసూదన్ రావు తెలిపారు.

News July 7, 2024

శ్రీసత్యసాయి: బాలల పురస్కారాలకు దరఖాస్తులు చేసుకోండి

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని 18 సంవత్సరాలలోపు ఉన్న బాల బాలికలు పురస్కారాల ఎంపికకు దరఖాస్తులు చేసుకోవాలని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారులు పేర్కొన్నారు. 2025 సంవత్సరానికి సంబంధించి బాలల పురస్కారాలకు అర్హులైన బాల బాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నామన్నారు. క్రీడలు, సామాజిక రంగం, ధైర్య సాహసాలు, నూతన ఆవిష్కరణ, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాలపై ఈనెల 31లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News July 7, 2024

సత్యసాయి జిల్లాలో పనిచేయడం మరుపు రానిది: కలెక్టర్

image

సత్యసాయి జిల్లాలో కలెక్టర్‌గా పని చెయ్యడం మరుపురాని ఘట్టమని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. బదిలీ అయిన సందర్భంగా పుట్టపర్తిలో అధికారులు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో అన్ని శాఖల సహకారంతో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. భవిష్యత్‌లో కూడా అందరూ ఇలానే పని చేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు.