Andhra Pradesh

News July 7, 2024

సత్యసాయి జిల్లాలో పనిచేయడం మరుపు రానిది: కలెక్టర్

image

సత్యసాయి జిల్లాలో కలెక్టర్‌గా పని చెయ్యడం మరుపురాని ఘట్టమని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. బదిలీ అయిన సందర్భంగా పుట్టపర్తిలో అధికారులు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో అన్ని శాఖల సహకారంతో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. భవిష్యత్‌లో కూడా అందరూ ఇలానే పని చేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు.

News July 7, 2024

రాజంపేటలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం

image

రాజంపేట మండలం తుమ్మలబైలు అటవీ ప్రాంతంలో 32 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు ఫారెస్ట్ రేంజర్ నారాయణ తెలిపారు. పట్టుబడ్డ దుంగల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.25 లక్షలుగా ఉంటుందని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా గమనించిన ఎర్రచందనం దొంగలు పరారైనట్లు తెలిపారు. దుంగలను అటవీ శాఖ కార్యాలయానికి తరలించినట్లు ఆయన తెలిపారు.

News July 7, 2024

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ హుండీల లెక్కింపు

image

పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో శనివారం హుండీలను లెక్కించారు. 97రోజులకు గాను అమ్మవారి సాధారణ ఖాతా, అన్నదాన ట్రస్ట్ ద్వారా రూ.1,64,77,583 నగదు లభించినట్లు కార్యనిర్వాహణాధికారి రమేశ్ నాయుడు తెలిపారు. నగదుతో పాటు 0.83 గ్రాముల బంగారం, 1.850 గ్రాముల వెండి సమకూరిందన్నారు. కార్యక్రమంలో పాలకమండలి ఛైర్మన్ శ్రీనివాసరావు, సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 

News July 7, 2024

టీటీడీ నిర్ణయించిన ధరలకే భక్తులకు విక్రయించాలి

image

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరలకే వస్తువులను దుకాణదారులు విక్రయించాలని, అధిక ధరలు విక్రయిస్తే చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ  తెలియజేసింది. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు శనివారం టీటీడీ ఉద్యోగులు భక్తుల వలె శ్రీవారి మెట్టు వద్ద తనిఖీలు చేపట్టారు. వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

News July 7, 2024

నిత్యపూజా విధానంతో మనిషి ధర్మం వైపు: బ్రహ్మశ్రీ చాగంటి

image

నిత్యం పూజ విధానంతో మనుషులు ధర్మం వైపు నడుస్తారని బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. నాయుడుపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం సాయంత్రం జరిగిన నిత్య పూజా విధానం కార్యక్రమంలో పాల్గొని ప్రవచనం చేశారు. మనిషి దేవుడు పట్ల ఎప్పుడు కృతజ్ఞతలు ఉండాలని సూచించారు. భగవంతుడు సృష్టించిన పంచేంద్రియాలను సక్రమంగా వినియోగించుకొని ధర్మం వైపు నడవాలని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

News July 7, 2024

ఎంపీ పురందీశ్వరిని కలిసిన తూ.గో. కలెక్టర్ ప్రశాంతి

image

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమండ్రి MP దగ్గుబాటి పురందీశ్వరిని స్థానిక జేఎన్ రోడ్డులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ది, పర్యటక పరంగా అభివృద్ధి, తదితర అంశాలపై వారు చర్చించారు.

News July 7, 2024

ప.గో.: DRDA, మెప్మా అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

ప.గో. జిల్లాలోని DRDA, మెప్మా అధికారులతో కలెక్టర్ సి.నాగరాణి శనివారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలంతా ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు జీవనోపాధి మార్గాలను ఎంచుకొనేలా చొరవ చూపాలన్నారు. లేస్ పార్క్ ఉత్పత్తులను సొసైటీల ద్వారా మార్కెటింగ్ సహాయం తీసుకొని రానున్న రెండు నెలలల్లో బలోపేతం చేయాలని ఆదేశించారు.

News July 7, 2024

ఉచిత ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోండి: కలెక్టర్ నాగలక్ష్మి

image

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనల మేరకు సోమవారం నుంచి ఉచిత ఇసుక సరఫరాపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆమె కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ప్రజలకు అవసరమైన ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సరఫరా చేసే ఇసుక నాణ్యతగా ఉండేటట్లు చూడాలన్నారు.

News July 7, 2024

శ్రీకాకుళం: ‘YSR జయంతిని వేడుకగా జరపాలి’

image

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతిని ఈనెల 8న ఘనంగా నిర్వహించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రక్తదానం, స్కూల్లో పుస్తకాల పంపిణీ, మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైసీపీ కుటుంబ సభ్యులందరికీ పిలుపునిచ్చారు.

News July 6, 2024

నంద్యాల చేరుకున్న నూతన కలెక్టర్

image

నంద్యాల జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారిణి బీ.రాజకుమారి శనివారం రాత్రి నంద్యాల చేరుకున్నారు. ప్రస్తుతం గుంటూరు JCగా ఉన్న ఆమె పదోన్నతిపై నంద్యాల కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో నూతన జిల్లా కలెక్టర్‌ రాజకుమారికి డీఆర్వో పద్మజ, ఆర్డీవో మల్లికార్జున రెడ్డి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. కలెక్టర్‌గా రాజకుమారి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.