Andhra Pradesh

News July 6, 2024

శ్రీకాకుళం జిల్లా నేటి వార్తలు

image

*అక్రమ ఇసుక తవ్వకాలపై పిర్యాదు చేయండి: కలెక్టర్
* కొరియర్ ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తత: ఎస్పీ
* టెక్కలిలో 9న ఫార్మా ఉద్యోగుల జాబ్ మేళ
* B. Ed సెమిస్టర్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల : డీన్
* హెల్మెట్ లేని ప్రయాణం.. రూ .1000 జరిమానా
* ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలి: జేసీ
* ఈనెల 8 నుంచి ఉచిత ఇసుక పాలసీ

News July 6, 2024

విశాఖ: గోదావరి టైటాన్స్ విజయం

image

విశాఖ వైయస్సార్ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ సీజన్-3లో గోదావరి టైటాన్స్ బెజవాడ టైగర్స్ జట్లు శనివారం తలపడ్డాయి. ఒక్క పరుగు తేడాతో గోదావరి టైటాన్స్ విజయం సాధించింది. టాస్ గెలిచి బెజవాడ టైగర్స్ బౌలింగ్ ఎంచుకుంది. గోదావరి టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 225 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెజవాడ టైగర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ‌224 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. 

News July 6, 2024

తూ.గో.: గోదారిలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

image

ఐ.పోలవరం మండలంలోని యానాం-ఎదురులంక బాలయోగి వారధి పైనుండి ఓ మహిళ గోదావరిలో దూకి శనివారం ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. సకాలంలో మత్స్యకారులు సాయం అందించి రక్షించడంతో ప్రాణాలతో బయటపడింది. అనంతరం ఆమెను యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెను ఐ.పోలవరం మండలం కేశనకుర్రు గ్రామానికి చెందిన గుత్తుల పద్మ కుమారిగా పోలీసులు గుర్తించారు.

News July 6, 2024

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో మంత్రి అనగాని

image

మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్‌ ప్రజా‌భవన్‌లో శనివారం తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు హాజరవగా.. వారిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా ఉన్నారు. సీఎంల పక్కనే కూర్చొని విభజన అంశాలపై ఆయన చర్చించారు. భేటీ అనంతరం మీడియా సమావేశంలో అనగాని మాట్లాడారు. మంత్రులు కందుల దుర్గేశ్, బీసీ జనార్దన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

News July 6, 2024

CMల భేటీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

image

ఏపీ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల CMలు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో భేటీలో రాష్ట్రం నుంచి నలుగురు మంత్రులకు అవకాశం దక్కగా.. అందులో బనగానపల్లె MLA, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కూడా బీసీ జనార్దన్ రెడ్డి CM చంద్రబాబు వెంట పాల్గొన్నారు. దీంతో BCJRకి అరుదైన గౌరవం దక్కింది.

News July 6, 2024

ఈనెల 8నుంచి ఇసుక పంపిణీ ప్రారంభం: అనంత కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానం అమలులో భాగంగా ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక పంపిణీ చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉచిత ఇసుక విధానం అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలన్నారు.

News July 6, 2024

శ్రీకాకుళం: ఒక్కొక్కరిగా ఆస్పత్రిపాలవుతున్న విద్యార్థులు

image

కోటబొమ్మాలి కేజీబీవీ పాఠశాల విద్యార్థులు గత 2రోజులుగా ఒక్కొక్కరిగా తీవ్ర అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి వరకు పాఠశాలలో చదువుతున్న 20మంది విద్యార్థులకు తీవ్రంగా వాంతులు, విరేచనాలయ్యి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం 12 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

జీకేవీధి: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

జీకేవీధి మండలం వంచుల పంచాయతీ సిరిబాల గ్రామానికి చెందిన జోరంగి టైసన్ అనే యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. వీధి దీపాలు అమర్చేందుకు శనివారం విద్యుత్ స్తంబం ఎక్కాడు. ఈక్రమంలో విద్యుత్ వైర్ తగిలి షాక్‌కు గురై కింద పడ్డాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆర్వీ నగర్ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.

News July 6, 2024

అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం.. ఘటనా స్థలానికి మంత్రి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో గురువారం అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. కాగా ఘటనాస్థలాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం సాయంత్రం పరిశీలించారు. దోషులను వెంటనే శిక్షించేందుకు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు.

News July 6, 2024

అనంత: జాతీయ రహదారిపై లారీ బోల్తా

image

చెన్నేకొత్తపల్లి వద్ద జాతీయ రహదారిపై లారీ బోల్తా పడిన ఘటన శనివారం జరిగింది. మట్టి లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి జాతీయ రహదారిపై బోల్తా పడింది. దీంతో ఎన్‌ఎస్ గేటుకు రాకపోకలు కొద్దిసేపు స్తంభించిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.