Andhra Pradesh

News July 6, 2024

YS జగన్‌కు సవాల్ విసిరిన MLA జూలకంటి

image

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్ని ఆస్తులు దోపిడీ చేశాడో ఎంత గ్రానైట్‌ తరలించాడో చర్చిద్దామా అని MLA జూలకంటి బ్రహ్మారెడ్డి మాజీ CM జగన్‌కు సవాల్‌ విసిరారు. శుక్రవారం మాచర్లలోని TDP కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌ నెల్లూరు జైలులో పిన్నెల్లిని కలిసి, అనంతరం చేసిన ఆరోపణలపై స్పందించారు. పిన్నెల్లి అరాచకాలకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. అందుకే దమ్ముంటే తన సవాల్‌ని స్వీకరించాలని సూచించారు.

News July 6, 2024

కృష్ణా: ప్రేమ వ్యవహారంతో.. సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య

image

ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కానూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆజాద్‌ (23) అస్సాం రాష్ట్రం ననత్‌బస్తి పట్టణ నివాసి. ఇతని కుటుంబం మూడేళ్ల క్రితం కానూరు వచ్చి స్థిరపడ్డారు. హుస్సేన్‌ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ యువతిని ప్రేమించాడు. గుర్తించిన తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 6, 2024

అథ్లెట్లకు CM చంద్రబాబు అభినందనలు

image

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అథ్లెట్లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధి ఏవీ రాఘవేంద్ర పేర్కొన్నారు. పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో వై జ్యోతి, జ్యోతిక శ్రీలు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. వీరిని నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ ఉన్నారు.

News July 6, 2024

ఏలూరు జిల్లాలో హార్ట్ ఎటాక్‌తో VRA మృతి

image

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని దేవులపల్లి VRA పసుపులేటి మోహన్‌రావు శుక్రవారం అర్ధరాత్రి హార్ట్ ఎటాక్‌తో మృతి చెందారు. సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మోహన్‌రావు సేవలు మరువలేనివని అన్నారు.

News July 6, 2024

కర్నూలు: హెడ్ కానిస్టేబుల్ మృతి

image

మంత్రాలయం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమేశ్ అనారోగ్యంతో మృతిచెందినట్లు ఎస్సై గోపీనాథ్ తెలిపారు. రమేశ్ 15 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ రాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారన్నారు. 1998 బ్యాచ్‌కు చెందిన రమేశ్.. గతంలో ఆదోని వన్ టౌన్ ట్రాఫిక్ స్టేషన్‌లో పనిచేసేవారని, ప్రస్తుతం మంత్రాలయంలో విధులు నిర్వహించారని తెలిపారు.

News July 6, 2024

అనంత: తండ్రిపై కుమార్తె కత్తితో దాడి

image

తాడిపత్రి మండలంలో తండ్రిపై కుమార్తె కత్తితో దాడి చేసింది. మండల పరిధిలోని ఆలూరులో శుక్రవారం రాత్రి తండ్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి తల్లి సుభద్రమ్మను కొడుతుండగా కుమార్తె శాంతి అడ్డుకోబోయింది. ఆమెను తోసివేయడంతో తండ్రిని ఆపేందుకు పక్కనే ఉన్న కత్తి తీసుకుంది. పెనుగులాటలో కత్తి గుచ్చుకుని ఆయనకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News July 6, 2024

కంచిలి: జగన్నాథ స్వామి ఉత్సవ విగ్రహాలు సిద్ధం

image

కంచిలి మండల కేంద్రంలో ఆదివారం రోజున నిర్వహించే జగన్నాథ స్వామి రథయాత్రకు ఉత్సవ విగ్రహాలను శనివారం రోజున సిద్ధం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం నుంచి గుండిచా ఆలయం వరకు రథయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ మేరకు మేళ తాళాలు, గోష్ఠితో పాటు సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో అనేక చోట్ల జగన్నాథ యాత్ర నిర్వహించనున్నారు.

News July 6, 2024

చింతపల్లిలో బైక్ దొంగతనం.. నాయకుడి అరెస్ట్   

image

చింతపల్లిలో ఓ పార్టీకి చెందిన నేత బైక్‌ను దొంగలించి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ అరుణ్ తెలిపారు. నిందితుడు షేక్ మీరా ఇటీవలె స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని చేపట్టారు. ఎన్నికల తర్వాత ఈ నామినేటెడ్ పోస్టులు రద్దు కావడంతో ఆయన దొంగతనాల బాట పట్టారు. ఈ క్రమంలో శుక్రవారం చింతపల్లిలో బైక్‌ను దొంగలించి విక్రయిస్తుండగా పట్టుకున్నామని ఎస్ఐ తెలిపారు.

News July 6, 2024

కాకినాడ: గేదెను బలిచ్చి క్షుద్ర పూజలు

image

కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శుక్రవారం అమావాస్య కావడంతో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఓ గేదె దూడను బలి ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రశ్నించిన గ్రామస్థుడిపై సదరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. వారిలో ఓ వ్యక్తిని పట్టుకొని స్థానికులు చితక్కొట్టారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

News July 6, 2024

గుంటూరు: ఇంజినీరింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు

image

ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఆగస్టు 5 నుంచి 12వ తేదీ వరకు మాచర్ల-విజయవాడ (07782), వచ్చే నెల 5 నుంచి 10వ తేదీ వరకు విజయవాడ- గుంటూరు(07464), గుంటూరు-సికింద్రాబాద్ (17201), ఆగస్టు 4 నుంచి 10వ తేదీ వరకు నర్సాపూర్-గుంటూరు (07281), వచ్చే నెల 5 నుంచి 11వ తేదీ వరకు గుంటూరు- రేపల్లె (07784), రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.