Andhra Pradesh

News July 6, 2024

ఎలమంచిలి: మురికి కాలువలో మృతదేహం లభ్యం

image

ఎలమంచిలిలోని నాగేంద్ర కాలనికి చెందిన లక్ష్మణ్ రావు(40)రెండు రోజుల క్రితం స్థానిక మురికికాలువలో ప్రమాదవశాత్తు పడిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం నీటి ప్రవాహం తగ్గటంతో కాలువలో ఆయన మృతదేహం లభ్యమైనట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ చెల్లారావు పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడికి భార్య లక్ష్మి, ఓ కుమారుడు ఉన్నాడు.

News July 6, 2024

VZM: శిథిల భవనం.. అద్దె మాత్రం నెలకు రూ.52,000

image

విజయనగరం పాత LIC భవనం దగ్గరలో ప్రభుత్వ బాలురు కళాశాల వసతి కేంద్రం-1లో 62 మంది విద్యార్థులు ఉన్నారు. దానికి నెలకు రూ.52 వేల అద్దె చెల్లిస్తున్నారు. కాగా.. ఆ భవనానికి సరైన కిటికీలు, దోమ తెరలు లేవని, తలుపులు పూర్తిగా పాడయ్యాయని విద్యార్థులు వాపోతున్నారు. డైట్ బిల్లులు రూ.6 లక్షల వరకు రావాలని అధికారులే చెబుతుండటం గమనార్హం. ఈ భవనానికి విద్యుత్త్ బిల్లులు కూడా చెల్లించలేదని సమాచారం.

News July 6, 2024

కర్నూలు: రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

image

మంత్రాలయం రోడ్డు (తుంగభద్ర) రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పద్మ అనే మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే శాఖ ఎస్సై నరసింహ మూర్తి తెలిపారు. మంత్రాలయం రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన పద్మకు కర్ణాటకలోని అడివి కానాపురానికి చెందిన వీరేశ్‌తో వివాహం జరిగింది. పద్మ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన కర్ణాటక ప్రాంతంలో జరిగడంతో అక్కడి పోలీసులే కేసు నమోదు చేశారన్నారు.

News July 6, 2024

బాపట్ల: స్వగ్రామానికి చేరుకున్న జవాన్ భౌతికకాయం

image

బాపట్ల పట్టణం భావపురి కాలనీకి చెందిన షేక్ రజ్జుబాషా అనే ఆర్మీ ఉద్యోగి విధి నిర్వహణలో<<13561701>> ఈనెల 4న గుండెపోటుతో మృతి చెందాడు.<<>> శనివారం తెల్లవారుజామున బాపట్ల పట్టణంలోని భావపూరి కాలనీలోని స్వగృహానికి విర జవాన్ భౌతికయాన్ని తీసుకువచ్చారు. పట్టణానికి చెందిన పలువురు మాజీ సైనికులు, నాయకులు, అధికారులు అక్కడికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. అధికార లాంఛనాలతో అంతిమయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

News July 6, 2024

పెద్దపంజాణి: రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి.. 21 మందికి గాయాలు

image

పుంగనూరు పలమనేరు మార్గమధ్యంలోని కోగిలేరు సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా 25 మందికి తీవ్ర గాయాలు అయినట్లు గంగవరం సీఐ కృష్ణమోహన్ తెలిపారు. అనంతపురం జిల్లాకు చెందిన టూరిస్ట్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మిగిలిన క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

గూడూరు: ఈ నెల 15 నుంచి పలు మెము రైళ్లు రద్దు

image

నిర్వహణ పనుల నిమిత్తం పలు మెము రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ నుంచి గూడూరుకు వచ్చే 07500, 12744 రైళ్లు ఈ నెల 15 నుంచి 30 వరకు, గూడూరు నుంచి విజయవాడకు వెళ్లే 07458, 12743 రైళ్లు ఈనెల 16 నుంచి 31 వరకు రద్దయ్యాయి. గూడూరు నుంచి విజయవాడకు వెళ్లే 17259, విజయవాడ నుంచి గూడూరు వెళ్లే 17260 రైళ్లను 16, 23, 30 తేదీలలో నిలిపివేసినట్లు తెలిపారు.

News July 6, 2024

ప్రకాశం: భార్య బైక్ అడగలేదని భర్త ఆత్మహత్య

image

గుడికి వెళ్లేందుకు ఇతరులను బైక్ అడిగేందుకు భార్య నిరాకరించిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముండ్లమూరు మండలం నాయుడుపాలేంలో జరిగింది. బద్రి శ్రీకాంత్(34) భార్యతో కలిసి శింగనకొండ ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. భర్త భార్యను గుడికి వెళ్లడానికి ఎవరినైనా బైక్ అడగమని అడగ్గా.. భార్య నిరాకరించి బస్సులో వెళ్దామంది. దీంతో మనస్తాపానికి గురై విష రసాయనం తాగి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

News July 6, 2024

అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేయండి: కలెక్టర్

image

ఇసుక అక్రమ తవ్వకాలను నిషేధించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని చెప్పారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు టోల్ ఫ్రీ నంబర్లు విడుదల చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలు జరిగితే 1800 4256012,08942 293229,97016 91657 నంబర్లకి mgoskimsandcomplaints@myyahoo.com ద్వారా కూడా సమాచారమివ్వాలని కోరారు.

News July 6, 2024

ఏలూరు: GOOD NEWS.. ‘కియా ఇండియా’లో జాబ్స్

image

డిప్లొమా, బీటెక్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు కియా ఇండియా సంస్థలో ట్రైనింగ్‌, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గంటా సుధాకర్‌ తెలిపారు. 2019-2024లో డిప్లొమా, బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించిన 18-25 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,500 ఉపకార వేతనం ఉంటుందన్నారు.

News July 6, 2024

పుష్పగుచ్ఛాలు వద్దు.. పుస్తకాలు తీసుకురండి: నారా లోకేశ్

image

తనను కలిసేందుకు వస్తున్న వారంతా పుష్పగుచ్ఛాలు, శాలువాలను తీసుకురావొద్దని మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. వాటికి బదులుగా నోటుపుస్తకాలు, డిక్షనరీలు, లైబ్రరీ పుస్తకాలు ఇస్తే ఎంతో సంతోషిస్తానని తెలిపారు. తన దగ్గరకు వచ్చేవారు ఏమీ తేవద్దని.. తేవాలని భావిస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పనికొచ్చే పై వస్తువులను తీసుకురావాలని ఆయన కోరారు.