Andhra Pradesh

News July 6, 2024

రాజమండ్రి రైల్వే స్టేషన్‌ వద్ద DEAD BODY

image

రాజమండ్రి రైల్వే స్టేషన్‌ 5వ నంబరు ప్లాట్‌ ఫామ్‌పై 35 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉన్నాడని జీఆర్పీ ఎస్‌ఐ మావుళ్లు శుక్రవారం తెలిపారు. మృతుడి శరీరంపై నలుపు రంగు, తెలుపు రంగు చారలు కలిగిన షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. కుడిచేతి మీద లవ్‌ సింబల్‌‌లో R అనే పేరుతో పచ్చబొట్టు ఉందన్నారు. వివరాలు తెలిసిన వారు 94406 27551 నంబర్‌కు సంప్రదించాలని SI కోరారు.

News July 6, 2024

కృష్ణా: గ్రేట్.. ఆస్పత్రి నిర్మాణానికి రూ. 4.5 కోట్ల విరాళం

image

పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు వాసుల కల ఓ దాత సాయంతో నెరవేరనుంది. ఇప్పటివరకు ఇక్కడి పేదలకు ఉచిత వైద్యం అందుబాటులో లేక పక్కనున్న పెనమలూరు PHCకి వెళ్లేవారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు, స్థలం వంటి అడ్డంకులే కారణం. కాగా వెలగపూడి ఉమామహేశ్వరరావు జ్ఞాపకార్థం వెలగపూడి ట్రస్టు నిర్వాహకురాలు విజయలక్ష్మి రూ.4.5 కోట్ల విరాళం ఇవ్వడంతో నిర్మాణం పూర్తి చేశారు. కాగా నేడు ఈ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు.

News July 6, 2024

నెల్లూరు: ఎస్సీ కార్పొరేషన్ ఈఓ సస్పెండ్

image

ఎస్సీ కార్పొరేషన్ ఈఓ సెల్విని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్లో కొన్ని రకాల ఉద్యోగోన్నతుల నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ జరిపిన గత నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్ ఉన్నతాధికారులకు నివేదికను పంపారు. దీంతో ఈఓపై సస్పెన్షన్ వేటు పడింది.

News July 6, 2024

అన్నమయ్య: వేడి నీళ్లు పడి బాలుడికి తీవ్ర గాయాలు

image

వేడి నీళ్లు మీదపడి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డ ఘటన శుక్రవారం అన్నమయ్య జిల్లా పెద్దమండెం మండలంలో జరిగింది. వివరాలు వెళ్తే.. పాపేపల్లె పంచాయతీ, బండమీద తురకపల్లెకి చెందిన రెడ్డి బాషా కొడుకు ఖాసీంఖాన్ తన తల్లి వంట చేస్తుండగా పొయ్యి వద్దకు వెళ్లాడు. అదే సమయంలో పొయ్యిపైన ఉన్న వేడి నీళ్లు బాలుడిపై మీదపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని కుటుంబీకులు చికిత్సకోసం వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.

News July 6, 2024

శ్రీకాకుళం: చేయాల్సింది 960 చేసింది 184..!

image

PHCలో ప్రసవాలు నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. పలుచోట్ల సాధారణ ప్రసవాలు అవుతున్నా రిఫరల్‌ కేసులుగా మార్చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. మూడు నెలలకుగాను 960 ప్రసవాలు చేయాలని అధికారులు లక్ష్యం ఇవ్వగా.. కేవలం 184 ప్రసవాలు మాత్రమే చేశారంటే పరిస్థితి తీవ్రత అర్థం అవుతోంది. ఏప్రిల్‌లో 48, మే 54, జూన్‌ 82 ప్రసవాలు చేశారు. ఆరు కేంద్రాలో ఒక్కటి నమోదు కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

News July 6, 2024

ప.గో: ‘నేడే.. మర్చిపోకుండా టీకాలు వేయించండి’

image

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా జూనోసిస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించనున్నారు. జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల నివారణ కోసం రేబిస్ టీకాలు వేయనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలని కోరారు. రేబిస్ లక్షణాలున్న పెంపుడు జంతువు కరిస్తేనే కాకుండా వాటి చొంగ వల్ల కూడా రేబిస్ సోకుతుంది.

News July 6, 2024

ముండ్లమూరు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

మండలంలోని నాయుడుపాలెం గ్రామానికి చెందిన బద్రి శ్రీకాంత్ రెడ్డి ఎలుకల మందు తిని మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం పోలవరం సమీపంలో రేకుల షెడ్డులో ఎలుకలో మందు తిని అపస్మారస్థితిలో వెళ్లాడు. దీంతో కుటుంబ సభ్యులు ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 6, 2024

విశాఖ-కిరండూల్-విశాఖ రైళ్లు రద్దు

image

వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో కె.కె.లైనులో భద్రతకు సంబంధించి ఆధునీకరణ పనులు జరుగుతున్న కారణంగా విశాఖ-కిరండూల్-విశాఖ రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ తెలిపారు. 8న విశాఖ-కిరండూల్, 9న కిరండూల్-విశాఖ రైలును రద్దు చేశామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

News July 6, 2024

బాడంగి: రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం

image

బాడంగి మండలం గొల్లాది సమీపంలోని నక్కలబంద వద్ద రైలు ఢీకొని గొల్లాదికి చెందిన మన్నెల(48) శుక్రవారం మృతి చెందాడు. జీఆర్‌పీ హెచ్‌సీ ఈశ్వరరావు మాట్లాడుతూ.. వ్యవసాయ పనులకు వెళ్తూ పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందాడని తెలిపారు. పోస్ట్‌మార్టమ్ నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకీ మృతదేహాన్ని తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News July 6, 2024

నందికొట్కూరులో వైసీపీని వీడి టీడీపీలో చేరిక

image

నందికొట్కూరు మున్సిపాలిటీలోని 12వ వార్డుకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అనుచరుడు మారుతీ నగర్ బొల్లెద్దుల ఏసన్న ఆధ్వర్యంలో 20 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ప్రసాద్, అశోక్, ప్రభాకర్, డేవిడ్, రాజేశ్, నాగులు, యేసేపు, తదితరులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని రాజశేఖర్ రెడ్డి భరోసా ఇచ్చారు.