Andhra Pradesh

News July 6, 2024

కనిగిరి: భార్యపై కోపంతో కూతురిపై అత్యాచారం

image

భార్యపై కోపంతో కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా, టీపీ గూడూరులో జరిగింది. నెల్లూరు ఇన్ ఛార్జ్ డీఎస్పీ డి. శ్రీనివాస రెడ్డి వివరాల మేరకు టీపీ గూడూరుకు చెందిన మహిళ కనిగిరికి చెందిన కె.మల్లిఖార్జునను రెండో పెళ్లి చేసుకుంది. వీరి మధ్య విబేధాలు రావడంతో గతనెల 29న తన భార్య కుమార్తెను బట్టలు కొనిస్తానని చెప్పి బాలికను బైక్‌పై అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

News July 6, 2024

నంద్యాల: ‘నీలా’ పేరుతో రోబో ఆవిష్కరణ

image

పాణ్యం మండలంలోని ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం సీఎస్ఈ (ఏఐ అండ్ ఎంఎల్), బీఎస్ విభాగం ఆధ్వర్యంలో నీలా పేరుతో రోబోను ఆవిష్కరించారు. ఈ రోబో లైబ్రరీ నిర్వహణ, కార్యకలాపాలకు సహాయం చేయడం వంటి పనులు నిర్వహిస్తుందని యూనిఫాస్ట్ రోబోటిక్స్ వ్యవస్థాపకుడు సుబ్రమణ్యం తెలిపారు. ఈ రోబోపై విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు ఏఐ, ఎంఎల్ పద్ధతులను ఉపయోగించి పరిశోధనలు చేయవచ్చన్నారు.

News July 6, 2024

శ్రీకాకుళం: జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం

image

జిల్లావ్యాప్తంగా జగన్నాథస్వామి దేవాలయాల్లో రథయాత్ర ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. ఇచ్ఛాపురం, పాతపట్నం, టెక్కలి, శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఉత్సవాల నిర్వహించనున్నారు. శ్రీకాకుళం నగరంలోని బొందిలీపురం, ఇల్లిసిపురంలో పూరి సాంప్రదాయంలో 9 రోజులు, గుజరాతీపేటలో ఆంధ్ర సాంప్రదాయంలో 11 రోజులు వేడుకలు చేస్తారు. ఆదివారం జరిగే రథయాత్రకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News July 6, 2024

గోదావరిలో పెరుగుతున్న వరద నీరు

image

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప నదులు, కొండవాగులు పొంగి వరద ప్రవాహం పెరిగింది. శుక్రవారం నాటికి పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే ఎగువన 26.470 మీటర్లు, స్పిల్వే దిగువన 16.350 మీటర్లు, ఎగువ కాపర్ డ్యామ్ ఎగువన 26.530 మీటర్లు, దిగువ కాపర్ డ్యామ్ దిగువన 15.330 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు ప్రాజెక్టు ఈఈలు మల్లికార్జునరావు, వెంకటరమణ తెలిపారు.

News July 6, 2024

నెల్లూరు: భార్యపై కోపంతో కూతురిపై అత్యాచారం

image

భార్యపై కోపంతో కూతురిపై అత్యాచారం చేసిన ఘటన టీపీ గూడూరులో జరిగింది. పోలీసుల వివరాలు.. టీపీ గూడూరుకు చెందిన మహిళకు ఇదివరకే వివాహమవ్వగా ఆమెకు కూతురు, కొడుకు ఉన్నారు. భర్తతో విభేదాలు వచ్చి కనిగిరికి చెందిన కె.మల్లిఖార్జునను చేసుకుంది. వీరికి కూడా గొడవలు రావడంతో జూన్ 29న స్కూలుకు వెళ్లి.. దుస్తులు కొనిస్తానని భార్య కుమార్తెను బైకుపై బల్లిపల్లి అడవిలోకి తీసుకువెళ్లాడు. రెండురోజుల పాటు అత్యాచారం చేశాడు.

News July 6, 2024

ముదినేపల్లి: కత్తిదాడి ఘటనలో మహిళ మృతి

image

ముదినేపల్లి మండలం చిగురుకోటలో నడకదారిలో మురుగునీటి విషయమై ఈ నెల 3న <<13559596>>కత్తులతో దాడి చేసిన ఘటన<<>>లో, తీవ్ర గాయాలకు గురై అపస్మారక స్థితిలో ఉన్న పరసాదేవి (32) అనే మహిళ శుక్రవారం చనిపోయింది. ఈ ఘటనలో పరసా వెంకట బాలాజీ, అతని భార్య దేవిపై బాలాజీ తమ్ముడు సురేశ్, అతని భార్య అనిత కత్తితో దాడి చేసిన విషయం విదితమే. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవి శుక్రవారం మృతి చెందిందని SI వెంకట్‌ తెలిపారు.

News July 6, 2024

పుత్తూరు: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

image

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం పుత్తూరు రైల్వేస్టేషన్‌లో జరిగింది. రేణిగుంట రైల్వే ఎస్ఐ రవి కథనం మేరకు.. పుత్తూరు మండలం ఉత్తరపు కండ్రిగ దళితవాడకు చెందిన వడివేలు కుమారుడు నారాయణమూర్తి(30) శుక్రవారం ఉదయం పుత్తూరు రైల్వేప్లాం-1 సమీపంలో చెన్నై నుంచి విజయవాడకు వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి తీవ్ర గాయాలై మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 6, 2024

రామసముద్రం: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి

image

తిరుమల రెడ్డిపల్లెకు చెందిన సీనియర్ IAS అధికారి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్‌ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో తెలంగాణ GAD సెక్రటరీగా ఉన్న సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించింది.  ఈయన 2002 IAS బ్యాచ్‌కు చెందిన అధికారి.

News July 6, 2024

రాజాం: ప్రాణ భయంతో పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

image

రాజాం పట్టణానికి చెందిన వెంకటేష్, లక్ష్మి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు ఒకటే అయినప్పటికీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో జూన్ 5న అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని రాజాం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.

News July 6, 2024

మచిలీపట్నం: అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తులు

image

అగ్నివీర్ పథకంలో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డి విక్టర్ బాబు తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసేందుకు కనీసం 50% మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. ఆన్లైన్‌లో agnipathvayu.cdac.in లింక్ ద్వారా ఈనెల 8 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.