Andhra Pradesh

News July 6, 2024

గుంటూరు: ఇంజినీరింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు

image

ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఆగస్టు 5 నుంచి 12వ తేదీ వరకు మాచర్ల-విజయవాడ (07782), వచ్చే నెల 5 నుంచి 10వ తేదీ వరకు విజయవాడ- గుంటూరు(07464), గుంటూరు-సికింద్రాబాద్ (17201), ఆగస్టు 4 నుంచి 10వ తేదీ వరకు నర్సాపూర్-గుంటూరు (07281), వచ్చే నెల 5 నుంచి 11వ తేదీ వరకు గుంటూరు- రేపల్లె (07784), రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

News July 6, 2024

కర్నూలు: లా సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో లా కోర్సుకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. 3, 5వ సంవత్సరాల 2, 4, 6, 8, 10వ సెమిస్టర్లకు సంబంధించిన ఫలితాలను రెక్టార్ ఎన్టీకే నాయక్ శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలను రాయలసీమ వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెల్లడించారు.

News July 6, 2024

అంతర్జాతీయ పోటీలకు ద్వారకనాథరెడ్డి ఎంపిక

image

బాస్కెట్‌బాల్‌ కీర్తి కిరీటంలో ఒక ఆణిముత్యం చేరింది. 26 ఏళ్ల తర్వాత అనంతపురానికి చెందిన క్రీడాకారుడు ద్వారకానాథ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో జిల్లా కీర్తిని రెపరెపలాడించాడు. జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ ప్రాబబుల్స్‌ జట్టుకు ఎంపికైన ఈ క్రీడాకారుడు అద్వితీయ ఆటతీరుతో అందరినీ మెప్పించి శ్రీలంకలో పర్యటించనున్న జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ సాబ టోర్నీకి ఎంపికయ్యాడు. కొలంబోలో ఈ నెల 10 నుంచి 13 వరకు టోర్నీ జరగనుంది.

News July 6, 2024

ప.గో: ఉరేసుకుంటున్నానంటూ ప్రియుడికి వీడియో కాల్

image

నిడదవోలుకు చెందిన 22ఏళ్ల యువతి తాడేపల్లిగూడెంలో నర్సుగా పనిచేస్తుంది. కపిలేశ్వరపురానికి చెందిన రాజేశ్, సదరు యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రాజేశ్‌కి ఏడాది కింద పెళ్లైంది. అయినా వీరి ప్రేమ కొనసాగింది. తనను 2వ పెళ్లి చేసుకోవాలని యువతి రాజేశ్‌ను కోరగా.. పెద్దలు అంగీకరిస్తే చేసుకుంటానన్నాడు. ఆమె బంధువులు తిరస్కరించగా.. ప్రియుడికి వీడియో కాల్ చేసి ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించింది.

News July 6, 2024

తూ.గో: ఉరేసుకుంటున్నానంటూ ప్రియుడికి వీడియో కాల్

image

నిడదవోలుకు చెందిన 22ఏళ్ల యువతి తాడేపల్లిగూడెంలో నర్సుగా పనిచేస్తుంది. కపిలేశ్వరపురానికి చెందిన రాజేశ్, సదరు యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రాజేశ్‌కి ఏడాది కింద పెళ్లైంది. అయినా వీరి ప్రేమ కొనసాగింది. తనను 2వ పెళ్లి చేసుకోవాలని యువతి రాజేశ్‌ను కోరగా.. పెద్దలు అంగీకరిస్తే చేసుకుంటానన్నాడు. ఆమె బంధువులు తిరస్కరించగా.. ప్రియుడికి వీడియో కాల్ చేసి ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించింది.

News July 6, 2024

చిత్తూరు: 501 మంది సర్వీసుదారులపై కేసులు

image

విద్యుత్తు అక్రమ వాడకంపై ఎస్పీడీసీఎల్ తిరుపతి సర్కిల్ పరిధిలో అధికారులు శుక్రవారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి 2,719 సర్వీసులు తనిఖీలు చేసి అక్రమంగా విద్యుత్తు వాడుతున్న 501 మంది సర్వీసుదారులపై కేసులు నమోదు చేసి రూ.10.17 లక్షల జరిమానా విధించామని ఎస్ఈ సురేంద్రనాయుడు తెలిపారు.

News July 6, 2024

తాళ్లూరు : టీడీపీ ఫ్లెక్సీ చించివేతపై కేసు నమోదు

image

మండలంలోని వెలగలవారిపాలెంలో ఇటీవల టీడీపీ వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చించివేసిన ఘటనపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెలుగు లక్ష్మయ్య వర్గీయులు బొద్దికూరపాడు రహదారివైపు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ఇద్దరు వ్యక్తులు దాన్ని చింపేయగా లక్ష్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.

News July 6, 2024

భీమసింగి: తుప్పల్లో 7 రోజుల ఆడ శిశువు లభ్యం

image

జామి మండలం భీమసింగి శివారులో గురువారం రాత్రి రోడ్డు పక్కన తుప్పల్లో రోజుల వయసున్న ఆడ శిశువు దొరికినట్లు స్థానికులు తెలిపారు. విషయాన్ని అంగన్వాడీలకు తెలుపగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. శుక్రవారం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమచారం అందించారు. ICDS ప్రాజెక్ట్ సూపర్వైజర్ ఎస్.కృష్ణవేణి స్పందించి జిల్లా ఘోషా ఆసుపత్రికి తరలించారు. పాపకు 7రోజుల వయసు ఉంటుందని వైద్యులు తెలిపారు.

News July 6, 2024

నెల్లూరు: 33 వేల యాంటీ రేబిస్ టీకాలు సిద్ధం

image

నెల్లూరు జిల్లాలోని కుక్కలకు ఉచితంగా వేసేందుకు 33 వేల యాంటీ రేబిస్ టీకాలను సిద్ధం చేసినట్లు జిల్లా పశుసంవర్థక శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వీటిని వేయనున్నట్లు తెలిపింది. అన్ని పశు, ప్రాంతీయ పశు వైద్యశాలలు, వెటర్నరీ పాలి క్లినిక్‌లలో వీటిని వేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

News July 6, 2024

గుంటూరు రేంజ్ ఐజీని కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

image

గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో శుక్రవారం ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి (IPS)ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాన్ని అందజేసి శాలువతో సత్కరించారు. లా అండ్ ఆర్డర్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వీళ్లతో పాటు ఒంగోలు పార్లమెంట్ జనసేన అధ్యక్షుడు రియాజ్ ఉన్నారు.