Andhra Pradesh

News July 6, 2024

రణస్థలం: మొదటి జీతాన్ని అమరావతికి విరాళం

image

తన మొదటి నెల జీతాన్ని రాజధాని అమరావతి నిర్మాణానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు రణస్థలంలోని ఎంపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. తన జీతం చెక్కుని శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి అందజేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం ఎంతో అవసరమని ఎంపీ కలిశెట్టి అభిప్రాయపడ్డారు.

News July 6, 2024

స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు రూ.3 కోట్ల ఆర్థిక సాయం

image

పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం పాడేరు మండలంలోని 75 స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు రూ.3 కోట్ల ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ చెక్కు రూపంలో అందజేశారు. ఆర్థిక సాయాన్ని స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. వారపు సంతల్లో కూరగాయలు, బట్టల వ్యాపారం చేసుకుంటామని స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించారు.

News July 6, 2024

అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటుచేయండి: ఎంపీ అంబికా

image

అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేయవలసిందిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామమోహన్ నాయుడుని శుక్రవారం అనంతపురం ఎంపీ ఢిల్లీలో అంబికా లక్ష్మి నారాయణ కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హిందూపూర్ ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి త్వరితగతిన అవసరమైన అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

News July 6, 2024

సీఎంల భేటీకి మంత్రి అనగాని సత్య ప్రసాద్

image

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు హాజరు కానున్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్ సమావేశానికి హాజరవుతున్నట్లు సమాచారం. వీరితో పాటు ఏపీ సీఎస్‌, ఆర్థిక, ఇతర శాఖల కార్యదర్శులు భేటీకి వెళ్లనున్నారు. చర్చలకు సంబంధించి ఇరు ప్రభుత్వాలు ఇప్పటికే 10 అంశాలను సిద్ధం చేసుకున్నాయి.

News July 6, 2024

తూ.గో.: సీఎంల భేటీకి మంత్రి కందుల దుర్గేశ్

image

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు హాజరు కానున్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేశ్ సమావేశానికి హాజరవుతున్నట్లు సమాచారం. వీరితో పాటు ఏపీ సీఎస్‌, ఆర్థిక, ఇతర శాఖల కార్యదర్శులు భేటీకి వెళ్లనున్నారు. చర్చలకు సంబంధించి ఇరు ప్రభుత్వాలు ఇప్పటికే 10 అంశాలను సిద్ధం చేసుకున్నాయి.

News July 6, 2024

జగన్ పాలనలో ఇరిగేషన్ శాఖ 20 ఏళ్లు వెనక్కి: మంత్రి

image

మాజీ సీఎం జగన్ పాలనలో నీటి ప్రాజెక్ట్‌లు అన్ని ఇబ్బందుల్లో పడ్డాయని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం సీఈ, ఎస్ఈలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల జగన్ పాలన‌లో జలవనరుల శాఖ 20 ఏళ్లు వెనక్కు వెళ్లిందని చెప్పారు. వర్షాకాలానికి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలను జగన్ ప్రభుత్వం తీసుకోలేదని అన్నారు.
– మంత్రి వ్యాఖ్యలపై మీ కామెంట్..?

News July 6, 2024

నేడు జిల్లాకు మంత్రి శ్రీనివాస్ రాక

image

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి శనివారం ఉదయం టీటీడీసీ మహిళా ప్రాంగణంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ వసతులను పరిశీలిస్తారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని మంత్రి కోరారు.

News July 5, 2024

త్వ‌ర‌లోనే విజ‌య‌వాడ నుంచి క‌ర్నూలుకు విమాన స‌ర్వీసులు

image

విజ‌య‌వాడ నుంచి క‌ర్నూలుకు త్వ‌ర‌లోనే విమాన స‌ర్వీసులు ప్రారంభం కానున్నాయని మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ను కలసి ఈ అంశంపై చర్చించానని భరత్ చెప్పారు. విజయవాడ- కర్నూలు విమాన స‌ర్వీసులు త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని, ఏడాదిలోపు రాత్రి స‌మ‌యాల్లో కర్నూలులో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేస్తామని రామ్మోహన్‌ హామీ ఇచ్చారని భరత్ అన్నారు.

News July 5, 2024

ఏపీ, తెలంగాణ సీఎంల భేటీకి మంత్రి జనార్దన్ రెడ్డి

image

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. వీరి భేటీలో ఏపీ నుంచి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, కందుల దుర్గేశ్ పాల్గొననున్నట్లు సమాచారం. వీరితో పాటు ఏపీ సీఎస్‌, ఆర్థిక, ఇతర శాఖల కార్యదర్శులు వెళ్లనున్నారు. చర్చలకు సంబంధించి ఇరు ప్రభుత్వాలు ఇప్పటికే 10 అంశాలను సిద్ధం చేసుకున్నాయి.

News July 5, 2024

శ్రీకాకుళం జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

* వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం: కలెక్టర్ స్వప్నిల్ * 8 నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు దరఖాస్తులు : మన్యం జిల్లా ఉపాధి అధికారి * అధికారులు అంకితభావంతో పనిచేయాలి: కలెక్టర్ * ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌ను పూర్తి చేసేందుకు చర్యలు: కలెక్టర్ * MSc పరీక్షల టైం టేబుల్ విడుదల * కోటబొమ్మాళి: విద్యుత్ షాక్‌తో లారీ క్లీనర్ మృతి *శ్రీకాకుళం: చెక్ బౌన్స్ కేసులో ముద్దాయికి జైలు శిక్ష