Andhra Pradesh

News July 5, 2024

శ్రీకాకుళం జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

* వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం: కలెక్టర్ స్వప్నిల్ * 8 నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు దరఖాస్తులు : మన్యం జిల్లా ఉపాధి అధికారి * అధికారులు అంకితభావంతో పనిచేయాలి: కలెక్టర్ * ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌ను పూర్తి చేసేందుకు చర్యలు: కలెక్టర్ * MSc పరీక్షల టైం టేబుల్ విడుదల * కోటబొమ్మాళి: విద్యుత్ షాక్‌తో లారీ క్లీనర్ మృతి *శ్రీకాకుళం: చెక్ బౌన్స్ కేసులో ముద్దాయికి జైలు శిక్ష

News July 5, 2024

ఈనెల 8న ఇసుక విక్రయాలు ప్రారంభించాలి: కలెక్టర్

image

ఈనెల 8న ఇసుక విక్రయాలు ప్రారంభించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చింతూరు డివిజన్ గుండాల-1 రీచ్‌లో 87,800 టన్నులు, గుండాల-2 రీచ్‌లో 79,026 టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. సీనరేజ్ టన్నుకు రూ.88 మాత్రమేనని, మిగిలినవి లోడింగ్, పరిపాలనా ఛార్జీలు, జీఎస్‌టీ ఛార్జీలు నిబంధనల మేరకు చెల్లించాలన్నారు.

News July 5, 2024

హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి జోగి రమేశ్

image

సీఎం చంద్రబాబు ఇంటిపై గతంలో జరిగిన దాడి కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్‌ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. జోగి రమేశ్ పిటిషన్‌ను కోర్టు ఈ నెల 8న విచారించనున్నట్టు సమాచారం.

News July 5, 2024

గుత్తి: సిమెంటు లారీ బోల్తా

image

గుత్తి శివారులోని గుంతకల్లు రోడ్డులో చెరువు కట్ట వద్ద సిమెంటు లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. సిమెంట్ లోడుతో తాడిపత్రి నుంచి గుంతకల్లు వైపు వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ బాలకృష్ణ స్వల్పంగా గాయపడ్డాడు. లారీ పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News July 5, 2024

శ్రీకాకుళం ఎత్తిపోతల పథకాలకు మహర్దశ

image

శ్రీకాకుళం జిల్లాలోని పలు ఎత్తిపోతల పథకాలకు మహర్దశ పట్టింది. ఆధునీకరణ, మరమ్మతులకు రూ.78.85 లక్షలు మంజూరు చేస్తూ శుక్రవారం సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఎత్తిపోతల పథకాలైన మదనగోపాలసాగరం(రూ.31.20 లక్షలు), చిన్నసాన(రూ.14.60 లక్షలు), సౌడాం(రూ.13.80 లక్షలు), సుభద్రాపురం(రూ.4.40 లక్షలు), టెక్కలిపాడు(రూ.6.50 లక్షలు), తొగిరి (రూ.8.35 లక్షలు) ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

News July 5, 2024

VZM: ‘రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి’

image

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆ సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. దాసన్నపేట కార్యాలయంలో ఉమ్మడి విజయనగరం జిల్లా రజక సంఘ నేతల శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రజకులపై సాంఘిక బహిష్కరణ జరగకుండా తక్షణమే రజక చట్టం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్, సన్యాసి, చిన్న తదితరులు పాల్గొన్నారు.

News July 5, 2024

అనకాపల్లి: చెరువు ఊబిలో కూరుకుపోయి కూలీ మృతి

image

వ్యవసాయ కూలీ స్నానం కోసం చెరువులో దిగి ఊబిలో కూరుకుపోయి శుక్రవారం మృతి చెందారు.‌ నక్కపల్లి మండలం ఎన్.నరసాపురానికి చెందిన బాల సత్తిబాబు(56) ఉపమాక గ్రామానికి వ్యవసాయ పనులకు వెళ్లారు. పని ముగించుకుని వచ్చే సమయంలో పక్కనే ఉన్న చెరువులో స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు ఊబిలో కూరుకుపోయారు. గమనించిన తోటి కూలీలు బయటికి తీసి చూసేసరికి అప్పటికే మృతిచెందారు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 5, 2024

శ్రీకాకుళం: గడ్డి మందు తాగి యువకుడి ఆత్మహత్య

image

ఆమదాలవలస మండలం నిమ్మతోర్లాడలో గడ్డిమందు తాగిన యువకుడు మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. మృతుడు పెంట చిన్నప్పుడు (27) గడ్డి మందు తాగినట్లు కుటుంబ సభ్యులు గుర్తించి గురువారం చికిత్స నిమిత్తం రాగోలు జెమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని వారు తెలిపారు. మృతుడికి భార్య లావణ్య, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 5, 2024

పెనుగంచిప్రోలు: మున్నేరు వరదలో కొట్టుకువచ్చిన మృతదేహం

image

పెనుగంచిప్రోలు మున్నేరు వరద నీటిలో మృతదేహం కొట్టుకొచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడు ప్రకాశం జిల్లా కడవకుదురు గ్రామానికి చెందిన అనిల్ నాయుడుగా పోలీసులు గుర్తించారు. మృతదేహం అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News July 5, 2024

కోటబొమ్మాళి: విద్యుత్ షాక్‌తో లారీ క్లీనర్ మృతి

image

కోటబొమ్మాళి మండలం కొత్తపేట తారకరామాకాలనీకి చెందిన అత్తిని వెంకట్ రావు (36) అనే లారీ క్లీనర్ శుక్రవారం విద్యుత్ షాక్‌కు గురైనట్లు పోలీసులు తెలిపారు. నందిగం మండలం జడ్యాడ గ్రామం వద్ద జేసీబీతో పనులు చేపట్టిన అనంతరం లారీ పైకి ఎక్కించి మెలియాపుట్టి వైపు వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదవశాత్తు 11కెవి విద్యుత్ తీగ తగలడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.