Andhra Pradesh

News July 5, 2024

జగన్‌పై లోకేశ్ మరోసారి విమర్శలు

image

మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారా లోకేశ్ విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం తాజాగా.. సీఎంగా చంద్రబాబు తొలి పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారన్నారు. అదే విధంగా జగన్ తొలి పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా జైలుకు వెళ్లారంటూ వ్యంగ్యంగా పలు ఫొటోలతో ‘నాయకుడు- ప్రతినాయకుడు’ అని రాసి Xలో పోస్ట్ చేశారు.

News July 5, 2024

బకాయిలు చెల్లించని షాపులపై అధికారుల కొరడా

image

కర్నూలు నగర పాలక సంస్థకు చెందిన దుకాణాలను లీజుకు తీసుకుని, అద్దె చెల్లించని షాపులపై నగరపాలక రెవెన్యూ అధికారులు శుక్రవారం కొరడా ఝుళిపిస్తున్నారు. 3 నెలలుగా బకాయిలు చెల్లించని షాపులను సీజ్ చేస్తున్నారు. కమిషనర్ ఏ.భార్గవ్ తేజ ఆదేశాలతో నగరపాలక రెవెన్యూ అధికారులు రెండో రోజు స్పెషల్ డ్రైవ్ కొనసాగించారు. నేడు రూ.12,26,261ను వసూలు చేసినట్లు కమిషనర్ తెలిపారు.

News July 5, 2024

వైద్యఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన కాకినాడ ఎంపీ

image

అమరావతిలో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను శుక్రవారం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, బోధన ఆసుపత్రులను అభివృద్ధి చేయడంతో పాటు, మెరుగైన సేవలు అందించేందుకు సహకరించాలని కోరారు. అలాగే కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో జరిగిన అవినీతి, అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

News July 5, 2024

SVU ఫలితాలు విడుదల

image

SVU: తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మొదటి సెమిస్టర్, మూడవ సెమిస్టర్ రీవాల్యూయేషన్ ఫలితాలు విడుదల చేశారు. స్టూడెంట్స్ తమ ఫలితాలను SVU వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవాలని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ధామాల నాయక్ తెలిపారు. దీ దీంతోపాటు ఫలితాలను www.manabadi.com వెబ్‌ సైట్‌లో చెక్ చేసుకోవాలని సూచించారు.

News July 5, 2024

శ్రీకాకుళం: చెక్ బౌన్స్ కేసులో ముద్దాయికి జైలు శిక్ష

image

చెక్ బౌన్స్ కేసులో రూ.2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్షను పాలకొండ పట్టణ సివిల్ జడ్జ్ కోర్టు న్యాయమూర్తి ఎ.విజయ్ రాజ్ కుమార్ విధిస్తూ తీర్పు వెలువరించారు. బూర్జ మండలం లచ్చయ్య పేటకు చెందిన గిరడ చిన్నారావుకు ఈ శిక్ష ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 3 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని శుక్రవారం తెలిపారు.

News July 5, 2024

శ్రీకాకుళం: MSc పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MSc(మైక్రోబయాలజీ)చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జులై 27, 29, 30, 31 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News July 5, 2024

వీరఘట్టం: వైయస్సార్ విగ్రహం ధ్వంసం

image

వీరఘట్టం మండలం తూడిలోని వైయస్సార్ విగ్రహాన్ని దుండగులు 2రోజుల క్రితం పాక్షికంగా ధ్వంసం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని సచివాలయం గేటును విరగొట్టి సమీపంలో ఉన్న పంట పొలాల్లో విసిరేశారని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనలపై పంచాయతీ కార్యదర్శి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్.ఐ కళాదర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 5, 2024

VZM: ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా

image

ఈ నెల 10న ఎస్.వీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చింతల చలపతిరావు తెలిపారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. పది, ఇంటర్, ఐటీఐ. డిప్లొమా ఏదైనా డిగ్రీ బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అర్హులన్నారు. ఆసక్తి గలవారు 10వతేదిన ఉదయం సర్టిఫికెట్స్ జిరాక్స్‌తో హాజరు కావాలన్నారు.

News July 5, 2024

ఢిల్లీలో తప్పిపోయిన బాలిక ముద్దనూరులో ప్రత్యక్షం

image

ఢిల్లీలో కనిపించకుండా పోయిన బాలిక ముద్దనూరులో ప్రత్యక్షమైంది. సీఐ దస్తగిరి తెలిపిన వివరాల ప్రకారం.. 15 ఏళ్ల మొహంతి కాంతు ఢిల్లీ నుంచి పారిపోయి ముద్దనూరులో ఉన్నట్లు సమాచారం రావడంతో ఢిల్లీ పోలీసులు సీఐ సహాయం కోరారు. దాదాపు 2 గంటల సర్చ్ ఆపరేషన్ తర్వాత ఆ అమ్మాయితో పాటు వచ్చిన మహమ్మద్ రెహ్మాన్‌ల జాడ కనుక్కొని ఢిల్లీ పోలీసులకు అప్పచెప్పినట్లు ఆయన చెప్పుకొచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 5, 2024

మహిళా అథ్లెట్లు ఒలింపిక్స్‌కు ఎంపికవడం గర్వంగా ఉంది: నారా లోకేశ్

image

ఏపీకి చెందిన మహిళా అథ్లెట్లు 2024 పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికవడం గర్వంగా ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. కొన్నేళ్లుగా దండి జ్యోతికశ్రీ, యర్రాజి జ్యోతి పడిన కష్టానికి మంచి అవకాశం లభించిందన్నారు. కృషి, పట్టుదలతో వారు కచ్చితంగా ఒలింపిక్ మెడల్ అందుకోవాలనే కలను నెరవేర్చుకుంటారన్నారు. ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన కనబరిచి ఏపీ ప్రజలు గర్వపడేలా చేయాలని లోకేశ్ ఆకాంక్షించారు.