Andhra Pradesh

News July 5, 2024

మహిళా అథ్లెట్లు ఒలింపిక్స్‌కు ఎంపికవడం గర్వంగా ఉంది: నారా లోకేశ్

image

ఏపీకి చెందిన మహిళా అథ్లెట్లు 2024 పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికవడం గర్వంగా ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. కొన్నేళ్లుగా దండి జ్యోతికశ్రీ, యర్రాజి జ్యోతి పడిన కష్టానికి మంచి అవకాశం లభించిందన్నారు. కృషి, పట్టుదలతో వారు కచ్చితంగా ఒలింపిక్ మెడల్ అందుకోవాలనే కలను నెరవేర్చుకుంటారన్నారు. ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన కనబరిచి ఏపీ ప్రజలు గర్వపడేలా చేయాలని లోకేశ్ ఆకాంక్షించారు.

News July 5, 2024

శ్రీకాకుళం: జాబ్ మేళా.. 16 మంది ఎంపిక

image

శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో జిల్లా ఉపాధి అధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహించగా.. నిరుద్యోగ యువత 88 మంది హాజరయ్యారు. ఇందులో 16 మందిని ఎంపిక చేసి, వారికి ఉపాధి కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సుధా తెలిపారు.

News July 5, 2024

పుట్టపర్తిలో విచక్షణ రహితంగా కొట్టుకున్న హిజ్రాలు

image

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో హిజ్రాలు కట్టెలతో, కత్తులతో విచక్షణ రహితంగా కొట్టుకున్న ఘటన ఇవాళ జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. పుట్టపర్తికి చెందిన హిజ్రా పల్లవి పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన హిజ్రాలు ఆధిపత్యం కోసం దాడికి తేగబడ్డారని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి కేసు నమోదుచేసి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

News July 5, 2024

విశాఖ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు

image

అగ్నివీర్ వాయు స్కీంలో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరేందుకు అవివాహితులైన పురుష, స్త్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కే.శాంతి తెలిపారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 28వ తేదీ రాత్రి 11 గంటల వరకు https://agnipathvayu.cdac.inలో అర్హులైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

News July 5, 2024

తిరుపతికి భారీ వర్ష సూచన

image

తిరుపతి జిల్లాలో శుక్రవారం రాత్రి అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

News July 5, 2024

తూ.గో.: మద్యం మత్తులో యువతిపై బ్లేడుతో దాడి

image

తూ.గో. జిల్లా గోకవరం మండలకేంద్రంలో శుక్రవారం దారుణం జరిగింది. తంటికొండ వెళ్లే దారిలోని అరవపేటలో ఉంటున్న గుర్తుతెలియని వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుపై మతిస్థిమితం లేని యువతిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. యువతి పరుగులు తీస్తుండగా బ్లేడుతో ఆమె చేతిపై, ముఖంపై దాడి చేసాడు. స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకొని స్తంభానికి కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తి గత కొంత కాలంగా స్మశానంలో జీవిస్తున్నాడు.

News July 5, 2024

నందికొట్కూరులో వైసీపీకి భారీ షాక్

image

నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మున్సిపల్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు 12 మంది కౌన్సిలర్లు శుక్రవారం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బైరెడ్డి మాట్లాడుతూ.. ఎవరి బెదిరింపులకూ భయపడవద్దని, అందరం కలిసి పేదల అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

News July 5, 2024

క్రీడాకారులు దరఖాస్తులు చేసుకోండి: క్రీడాభివృద్ది అధికారి

image

పాడేరు: కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ అవార్డుల కోసం అర్హులైన క్రీడాకారులు దరఖాస్తులు చేసుకోవాలని అల్లూరి జిల్లా క్రీడాభివృద్ది అధికారి జగన్మోహన్ రావు శుక్రవారం తెలిపారు. అంతర్జాతీయ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారు ఈ దరఖాస్తులకు అర్హులన్నారు. అర్హత గల క్రీడాకారులు ఆగష్టు 1వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుని, విజయవాడలోని క్రీడా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

News July 5, 2024

శ్రీకాకుళం: నేటితో ముగుస్తున్న ఫీజు చెల్లింపు గడువు

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ డిగ్రీ చివరి ఏడాది 5వ సెమిస్టర్ ఇన్స్టంట్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు జూన్ 29 నుంచి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఈ పరీక్షకు అర్హులైన జాబితాను ఆయా కళాశాలలకు అధికారులు అందజేశారు. ఇంకా చెల్లించని విద్యార్థులు నేడు సాయంత్రం లోగా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.

News July 5, 2024

మంత్రాలయం మండలంలో ఒడిశా వాసి మృతి

image

మంత్రాలయం మండలం సుగూరు గ్రామంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతిచెందాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన మంత్రిగాండ్ అనే వ్యక్తి బోర్ వెల్ లారీలో దినసరి కూలీగా పనిచేసేవాడు. పని ముగించుకుని అదే లారీపై తిరుగు ప్రయాణమయ్యారు. అకస్మాత్తుగా పైకి లేవడంతో పైన ఉన్న సర్వీస్ వైర్లు తగిలి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు ఎస్సై గోపీనాథ్ తెలిపారు.