Andhra Pradesh

News July 5, 2024

యర్రగొండపాలెం ఎస్సై సుదర్శన్ సస్పెండ్

image

యర్రగొండపాలెం ఎస్సై సుదర్శన్ ను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఎస్సైపై అవినీతి ఆరోపణలు రావడంతో ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ విచారణకు ఆదేశించారు. దీంతో మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు ఆధ్వర్యంలో విచారణ జరిపిన అనంతరం ఆ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు.

News July 5, 2024

విశాఖలో సందర్శనకు ‘కల్కి’ బుజ్జి

image

కల్కి సినిమాలో హీరో ప్రభాస్ ఉపయోగించిన బుజ్జి వాహనాన్ని విశాఖలో సందర్శకులకు అందుబాటులో ఉంచారు. శుక్రవారం విశాఖ వ్యాలీ స్కూల్ ప్రాంగణంలో దీన్ని ఉంచారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ వాహనం వద్ద నిలుచుని ఫొటోలు తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. కల్కి సినిమాలో ఉపయోగించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వాహనాన్ని దేశంలోని పలు ప్రాంతాల్లో నిర్వాహకులు సందర్శనకు వీలుగా ఉంచుతున్నారు.

News July 5, 2024

రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్.. ఐదుగురికి ప్రాణదానం

image

రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబీకులు ముందుకొచ్చారు. మంగళగిరికి చెందిన న్యాయవాది ప్రసాద్‌కు 2రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరగగా NRI ఆసుపత్రికి తరలించారు. కాగా వైద్యులు ప్రసాద్‌కు బ్రెయిన్ డెడ్‌గా నిర్థారించారు. అతని అవయువాలను శుక్రవారం మధ్యాహ్నం NRI నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తిరుపతికి తరలించనున్నారు.

News July 5, 2024

విశాఖ: సచివాలయ సేవల్లో జాప్యం..?

image

గ్రామ సచివాలయానికి సంబంధించిన సేవల్లో గత వారం రోజులుగా జాప్యం జరుగుతోందని లబ్ధిదారులు అంటున్నారు. సర్వర్ పనిచేయడం లేదంటూ వివిధ సర్టిఫికెట్ల జారీ, దరఖాస్తులు చేసుకునే ప్రక్రియలు సిబ్బంది నిలిపి వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు వివిధ సర్టిఫికెట్ల కోసం సచివాలయాలు చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. అదే సమయంలో భూములకు సంబంధించిన మ్యుటేషన్ సంబంధించిన పనులు కూడా జరగడం లేదని సమాచారం.

News July 5, 2024

చీమకుర్తి : నూడుల్స్ తింటూ వ్యక్తి మృతి

image

చీమకుర్తిలోని ఓ రెస్టారెంటులో గురువారం రాత్రి నాగశేషులు అనే వ్యక్తి మృతి చెందాడు. రాత్రి 9 గంటల సమయంలో నాగశేషులు పట్టణంలోని ఓ రెస్టారెంట్‌కి వచ్చి నూడుల్స్ ఆర్డర్ చేసి కొంత వరకు తిన్నాడు. తింటుండగానే కుర్చీలోనే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం ఆత్మకూరుగా స్థానికులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 5, 2024

గూడూరు మీదుగా వెళ్ళే పలు రైళ్లు రద్దు

image

గూడూరు మీదుగా వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. విజయవాడ డివిజన్ పరిధిలో జరిగే నాన్ ఇంటర్ లాక్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు3 నుంచి 10వ తేదీ వరకు విజయవాడ-గూడూరు, గూడూరు-విజయవాడ మెమూ, ఆగస్టు 4-11 వరకు విజయవాడ-చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ ప్రెస్, ఆగస్టు 5-10 వరకు చెన్నై సెంట్రల్-విజయవాడ జనశతాబ్ధి ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

News July 5, 2024

బ్రహ్మోత్సవాలకు రండి.. మంత్రి సవితకు శ్రావణి ఆహ్వానం

image

రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితను శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కలిశారు. పెనుకొండలో కలిసిన ఆమె గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బీసీ వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగు పర్చాలని కోరారు. ఈ మేరకు పలు అంశాలపై మంత్రికి వినతి పత్రం సమర్పించారు.

News July 5, 2024

జగన్ పర్యటనతో వైసీపీ ఊపందుకుంది: కాకాణి

image

నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు మాట్లాడారు. గురువారం నెల్లూరులో మాజీ సీఎం జగన్ పర్యటన విజయవంతంగా జరిగిందని వైసీపీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ పర్యటనతో కార్యకర్తలకు ఆత్మస్థైర్యం వచ్చిందన్నారు.మళ్లీ వైసీపీ పుంజుకుంటోందని వ్యాఖ్యానించారు.

News July 5, 2024

పార్లమెంటు హౌస్ కమిటీ సభ్యులుగా ఎంపీ మాగుంట

image

ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డిని పార్లమెంటు హౌస్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా శుక్రవారం ప్రకటించారు. పార్లమెంటు సభా ప్రాంగణంలో ఒంగోలు ఎంపీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హౌస్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఎంపీ మాగంటకు సహచర ఎంపీలు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు.

News July 5, 2024

తిరుపతి సమస్యలను తీరుస్తా: మంత్రి దుర్గేశ్ 

image

రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతికి వచ్చిన మంత్రి కందుల దుర్గేశ్‌ను శుక్రవారం ఉదయం MLA ఆరణి శ్రీనివాసులు, తిరుపతి జనసేన అధ్యక్షుడు రాజారెడ్డి, కిరణ్ రాయల్ ఆత్మీయంగా కలిశారు. మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శాలువతో సత్కరించారు. అనంతరం ప్రజా సమస్యలపై మంత్రితో రాజారెడ్డి చర్చించారు. తిరుపతిలోని పర్యాటక శాఖలో ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.