Andhra Pradesh

News July 5, 2024

రేపు కడపకు రానున్న YS జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లా పర్యటనకు రానున్నారు. అనంతరం 8వ తేదీన తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు ఆయన రేపు సాయంత్రం కడప రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విమానం ద్వారా కడపకు చేరుకొని రోడ్డు మార్గాన ఇడుపులపాయ వెళ్తారని కడప మేయర్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేశ్ బాబు తెలిపారు.

News July 5, 2024

విజయవాడ: నేటి నుంచి తిరుమల ఎక్స్ ప్రెస్ రద్దు

image

తిరుమల ఎక్స్ ప్రెస్‌ను జులై 5 నుంచి 11వ తేదీ వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ సమీపంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతుండటంతో తాత్కాలికంగా తిరుమల ఎక్స్ ప్రెస్ రద్దు చేస్తున్నట్లు చెప్పారు. రాజమండ్రి మీదుగా తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని కోరారు.

News July 5, 2024

రేపు CMల భేటీ.. తెరపైకి ఆ 5 గ్రామ పంచాయతీలు

image

తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు HYDలో శనివారం భేటీ కానున్నారు. ప్రస్తుతం భద్రాచలం మండలంలో భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా మిగిలినవి AP పరిధిలో ఉన్నాయి. ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. రేపు ఇద్దరు CMల భేటీ నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జరుగుతుందా..? అనే ఉత్కంఠ నెలకొంది.

News July 5, 2024

దేవదాయ శాఖ మంత్రితో పొంగూరు నారాయణ భేటీ

image

రాష్ట్ర దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖామంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డితో మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు న‌గ‌రం సంత‌పేట‌లోని ఆనం నివాసంలో మంత్రిని పొంగూరు నారాయ‌ణ మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. మంత్రి ఆనంకు నారాయ‌ణ పుష్ప‌గుచ్ఛం అంద‌చేసి శాలువాతో స‌త్క‌రించారు. ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నట్లు సమాచారం.

News July 5, 2024

అమరావతి కోసం తొలి వేతనాన్ని విరాళంగా ఇచ్చిన ఎంపీ కలిశెట్టి

image

అమరావతి అభివృద్ధి కోసం ఎంపీగా అందుకొన్న తొలి గౌరవ వేతనాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును నేడు ఎంపీ కలిశెట్టి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు రూ.1.57 లక్షల చెక్కును ఆయన చంద్రబాబుకు అందజేశారు. దీంతో ఎంపీని సీఎం అభినందించారు.

News July 5, 2024

శ్రీకాకుళం: గడ్డి మందు తాగి మహిళ మృతి

image

పాలకొండకు చెందిన వివాహిత మాధవి(42) గురువారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గారమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఆమె గత రాత్రి గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆమెను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News July 5, 2024

గుంటూరు: అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య

image

వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడుకి చెందిన కౌలు రైతు రాణాప్రతాప్ (34) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI వినోద్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. 3 సంవత్సరాలుగా మృతుడు మిర్చి సాగు చేస్తున్నాడని, పంటలపై రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చే మార్గం లేక ప్రతాప్ జూన్ 29న పురుగు మందు తాగాడన్నారు. బంధువులు గుంటూరు GGHకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై కేసు పోలీసులు నమోదు చేశారు.

News July 5, 2024

NLR: ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు

image

జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు.. అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు డీఈఓ రామారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. nationalawards toteachers. education. gov. in వెబ్‌సైట్‌లో ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హతలు, ఇతర వివరాల కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాలని డీఈవో సూచించారు.

News July 5, 2024

NTR: పిల్లలు పుట్టడం లేదని వివాహిత ఆత్మహత్య

image

NTRజిల్లా కంభంపాడుకి చెందిన శేషుకుమార్‌‌కి TG మహబూనగర్ జిల్లా శిర్సనగండ్లకు చెందిన రాజశ్రీ(29)తో 2014లో పెళ్లయింది. 10ఏళ్లయినా పిల్లలు పుట్టడం లేదని ఇద్దరూ గొడవపడుతూ ఉండేవారు. దీంతో మనస్తాపం చెందిన రాజశ్రీ ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లా మాల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ..బుధవారం రాత్రి మృతిచెందారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

News July 5, 2024

VZM: పోస్టింగులకు కార్యదర్శుల ఎదురు చూపులు..!

image

సరిగ్గా మూడు నెలల క్రితం జిల్లాలో తొమ్మిది మంది గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-1 ఉద్యోగులుగా పదోన్నతి లభించింది. ఇప్పటికీ కూడా వారికి పోస్టింగులు ఇవ్వకపోవడంతో ఎదురు చూస్తున్నారు. మార్చి 16 నుంచి జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనలు అడ్డొచ్చాయి. కోడ్ ముగిసి నెల దాటుతున్నా పోస్టింగులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.