Andhra Pradesh

News July 5, 2024

మార్గాని భరత్ ప్రచారరథం దహనం కేసులో వ్యక్తి అరెస్టు

image

రాజమండ్రిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచారరథం దహనం కేసులో వీఎల్ పురానికి చెందిన దంగేటి శివాజీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని తూర్పు మండల డీఎస్పీ కిషోర్ గురువారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుడిని రిమాండ్ కోసం కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.

News July 5, 2024

విశాఖ: డీసీఐకి రూ.156.5 కోట్లతో ఒప్పందం

image

ప్రతిష్ఠాత్మకమైన కొచ్చిన్ పోర్టు అథారిటీ‌తో రూ. 156.50 కోట్ల విలువైన డ్రెడ్జింగ్ ఒప్పందం కుదిరినట్లు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఛైర్మెన్ అంగముత్తు తెలిపారు. డ్రెడ్జింగ్ పరిశ్రమల్లో డీసీఐ అగ్రగామిగా ఉందన్నారు. భారీస్థాయి డ్రెడ్జింగ్ ప్రాజెక్టులను అమలు చేయడంలో మంచి రికార్డు ఉందని వెల్లడించారు. ఈ ఒప్పందం డీసీఐ ప్రతిష్ఠను మరింత పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News July 5, 2024

రేపు జడ్పీ సమావేశం.. ఎమ్మెల్యేలకు అందని సమాచారం

image

కర్నూలులో జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు రేపు నిర్వహించేందుకు పాలకవర్గం సిద్ధమైంది. ఈ సమావేశాలకు ఇప్పటికీ ఎమ్మెల్యేలకు సమాచారం అందకపోవడం గమనార్హం. జడ్పీ పాలక వర్గంలో ఛైర్మన్‌తో పాటు 52 మంది జడ్పీటీసీ సభ్యులు వైసీపీకి చెందిన వారే. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ఎక్కువ మంది గెలిచారు. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు లేకుండా జడ్పీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.

News July 5, 2024

గుంటూరు: అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య

image

వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడుకి చెందిన కౌలు రైతు రాణాప్రతాప్ (34) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI వినోద్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. 3 సంవత్సరాలుగా మృతుడు మిర్చి సాగు చేస్తున్నాడని, పంటలపై రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడన్నారు. అప్పు తీర్చే మార్గం లేక ప్రతాప్ జూన్ 29న గడ్డి మందు తాగడన్నారు. బంధువులు గుంటూరు GGHకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై కేసు పోలీసులు నమోదు చేశారు.

News July 5, 2024

VZM: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..!

image

సాధారణంగా జూన్, జులై నెలల్లో కూరగాయల ధరలు అదుపులోనే ఉంటాయి. ఈ సారి మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ధరలు అమాంతంగా పెరగడంతో వినియోగదారులు కొనేందుకు బెంబేలెత్తిపోతున్నారు. పచ్చి మిర్చి, అల్లం, టమాటా ధరలు భారీగా పెరిగాయి. కిలో అల్లం రూ. 150 పైచిలుకు పలుకుతోంది. దళారుల ప్రవేశంతో సిండికేట్‌గా మారి ధరలు పెంచేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.

News July 5, 2024

కృష్ణమ్మకు సిద్ధమైన మరో మణిహారం

image

విజయవాడ పశ్చిమ బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా సూరాయపాలెం వద్ద కృష్ణా నదిపై భారీ వంతెన కడుతున్నారు. ఈ వంతెన నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. NHAIఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ వంతెన చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్, ఏలూరు నుంచి వచ్చే వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండా గొల్లపూడి మీదుగా కాజ వద్ద చెన్నై హైవేను చేరుకోవచ్చు.

News July 5, 2024

అనంతపురం జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

image

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో దారుణ హత్య జరిగింది. నల్ల దాసరి పల్లి గ్రామంలో బోయ ఆవుల లక్ష్మన్న (48) అనే వ్యక్తి ఇవాళ తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News July 5, 2024

అనంతసాగరం: పాము కాటుతో కౌలు రైతు మృతి

image

అనంతసాగరం మండలం, చిలకలమర్రి గ్రామానికి చెందిన డబ్బుకుంట శీనయ్య అనే కౌలు రైతు పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు. బుధవారం రాత్రి నీళ్లు వదిలేందుకు పొలానికి వెళ్ళగా పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆత్మకూరు వైద్యశాలకు తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 5, 2024

TPT: దరఖాస్తులకు రేపే చివరి తేదీ

image

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర శిల్ప కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు దరఖాస్తు గడువు శనివారంతో ముగుస్తుందని కార్యాలయం పేర్కొంది. సాంప్రదాయ కళంకారి కళలో డిప్లొమా, వివిధ రకాల సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు https://www.tirumala.org/ వెబ్‌సైట్ చూడగలరు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జులై 06.

News July 5, 2024

కడప: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సూర్యరావు తెలిపారు. వాణిజ్యశాస్త్రం, భౌతికశాస్త్రం, ఆధునిక ఉర్దూ సబ్జెక్టులలో బోధించుటకు అర్హులైన అధ్యాపకులు కావాలన్నారు. మాస్టర్ డిగ్రీలో 50% మార్కులు కలిగిన వారు అర్హులని తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 9వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 12వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.