Andhra Pradesh

News July 4, 2024

విశాఖ: నాటు తుపాకీతో వీధి కుక్కను కాల్చి చంపాడు

image

కొండపాలెంలో నాటు తుపాకీతో వీధి కుక్కను కాల్చి చంపిన యాదగిరి నూకరాజును, అతనిని తీసుకువచ్చిన పెద్దాడ శ్రీనివాసరావును అరెస్టు చేశామని బుచ్చయ్యపేట ఎస్సై డి.ఈశ్వరరావు తెలిపారు. గ్రామంలోని వీధి కుక్క నాటు కోళ్లను తినేస్తోందని శ్రీనివాసరావు అనే వ్యక్తి కేపి. అగ్రహారానికి చెందిన నూకరాజును తీసుకువచ్చి అతని వద్ద ఉన్న నాటు తుపాకీతో వీధి కుక్కని కాల్చి చంపినట్లు స్థానిక వీఆర్వో ఫిర్యాదు చేశారన్నారు.

News July 4, 2024

శ్రీకాకుళం: B.Ed పరీక్షల టైం టేబుల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ బి.ఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు జులై 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయని తెలిపారు.

News July 4, 2024

కల్లూరు: గుండెపోటుతో RTC బస్సు డ్రైవర్ మృతి

image

పులిచెర్ల మండలం కొక్కువారిపల్లె సమీపంలో RTC డ్రైవర్ రాఘవయ్య గుండెపోటుతో మృతి చెందాడు. పుంగనూరు RTC డిపోకు చెందిన బస్సు తిరుపతి నుంచి కల్లూరుకి వస్తుండగా మార్గమధ్యంలో ఆర్‌టీసీ డ్రైవర్ రాఘవయ్యకు గుండెపోటు వచ్చింది. దీంతో కండక్టర్ హుటాహుటిన డ్రైవర్‌ను సమీపంలోని పులిచెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

News July 4, 2024

ఏపీలో పెట్టుబ‌డుల‌కు అపార‌ అవ‌కాశాలు: మంత్రి స‌త్య‌కుమార్

image

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ చెప్పారు. గురువారం అబుదాబికి చెందిన ఎంఎఫ్‌2 సంస్థ ప్ర‌తినిధులతో మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో మంత్రి సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ ప్ర‌తినిధులు ఒప్పందాలు చేసుకుంటామని చెప్పినట్లు మంత్రి తెలిపారు.

News July 4, 2024

నెల్లూరులో వ్యక్తి దారుణ హత్య

image

నెల్లూరు రూరల్ రామకోటయ్య నగర్‌లో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు నీతురాజ్ (23) అనే వ్యక్తిని గొంతు కోసి నడి రోడ్డుపైనే వదిలేసి పారిపోయారు. దీంతో నీతూరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తి రామకోటయ్య నగర్‌ సుజాత రావు కాంప్లెక్స్ కు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. హత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

News July 4, 2024

ప్రభుత్వ టీచర్‌పై టీడీపీ నేత దుర్భాషలు: వైసీపీ

image

నంద్యాల జిల్లాలో ప్రభుత్వ టీచర్‌పై టీడీపీ నేత దుర్భాషలాడారని వైసీపీ విమర్శించింది. ‘కొలిమిగుండ్ల మండలంలో రేషన్ బియ్యాన్ని ప్రభుత్వ పాఠశాల గదుల్లో పెట్టొద్దని టీచర్ చెప్పారు. దీంతో టీడీపీ నేత విజయ్ భాస్కర్ రెడ్డి ఉపాధ్యాయుడిపై నోటికి వచ్చినట్లు తిట్టాడు. తిట్లకు టీచర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. గురువులను గౌరవించే విధానం ఇదేనా?’ అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టింది.

News July 4, 2024

కనిగిరిలో రెండో రోజూ ఆక్రమణల తొలగింపు

image

కనిగిరిలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం రెండో రోజూ కొనసాగుతోంది. పామూరు రోడ్డులో డ్రైనేజీ కాలువలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను జేసీబీతో మున్సిపల్ అధికారులు తొలగించారు. రహదారులకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపు కారణంగా పట్టణంలోని రహదారులు విస్తారంగా దర్శనమిస్తున్నాయి. నిన్న చెప్పులబజారు, ఒంగోలు బస్టాండు, పామూరు బస్టాండు సెంటర్లలో రోడ్డు వెంట ఉన్న ఫుట్‌పాత్‌ వ్యాపారులకు సంబంధించిన బంకులను తొలగించారు.

News July 4, 2024

ఎయిర్ ఫోర్సులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అగ్ని వీర్ స్కీంలో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి వహీదా తెలిపారు. పది, ఇంటర్ వివాహం కానీ యువతీ యువకులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని అన్నారు. ఈనెల 8 నుంచి 28 వరకు అప్లికేషన్ నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. http://agnopathvayu.cdac.in లింకు ద్వారా అప్లే చేసుకోవాలని సూచించారు.

News July 4, 2024

కడప: సుమోను ఢీకొన్న లారీ.. ఇద్దరు దుర్మరణం

image

పుల్లంపేట మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామం చెరువుకోట వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. సుమోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దెబ్బతిన్న వాహనాలను ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తొలగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 4, 2024

NTR హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరుకు ఫ్లైఓవర్: ఎంపీ చిన్ని

image

విజ‌య‌వాడ ఆర్థిక వృద్ధిని పున‌ః నిర్మించ‌డానికి దోహ‌ద‌ప‌డే విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒప్పుకున్నట్లు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. సీఎం చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గురువారం గ‌డ్క‌రీతో స‌మావేశ‌మ‌య్యారని చెప్పారు. ఈ ఫ్లైఓవర్ NTR హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.