Andhra Pradesh

News July 4, 2024

SVU : 10వ తేదీ నుంచి పీజీ పరీక్షలు ప్రారంభం

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో PG M.A, M.Com, M.Sc నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. సుమారు 3000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలియజేశారు.

News July 4, 2024

ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గడువు పెంపు

image

ఏయూ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో విద్యను అభ్యసిస్తున్న వారు పరీక్షల దరఖాస్తుకు ఈనెల 10వ తేదీలోగా ఎటువంటి అపరాధ రుసుము లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్రం సంచాలకులు ఆచార్య ఎన్.విజయమోహన్ తెలిపారు. రూ.5 వేల అపరాధ రుసుముతో తత్కాల్ విధానంలో ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. తత్కాల్ విధానంలో దరఖాస్తు చేసిన వారికి విశాఖలో పరీక్షలు నిర్వహిస్తారు.

News July 4, 2024

విశాఖ ఐఐఎంలో పెరిగిన మహిళల ప్రవేశాలు

image

ఆనందపురం మండలంలోని గంభీరంలో ఉన్న విశాఖ ఐఐఎంలో మహిళల ప్రవేశాలు గణనీయంగా పెరిగాయని యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. రెండేళ్ల రెసిడెన్షియల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్ మెంట్ ప్రోగ్రాం కింద 338 మంది ప్రవేశాలు పొందగా అందులో 135 మంది మహిళలే ఉన్నారన్నారు. అన్ని ఐఐఎంలు సగటు కంటే ఇక్కడ 10 శాతం మహిళలే ఎక్కువని తెలిపారు. ఇక్కడ ఎక్కువగా మహారాష్ట్ర, ఆంధ్రకు చెందిన వారే ప్రవేశాలు పొందుతున్నారని చెప్పారు.

News July 4, 2024

పెనుకొండ: ఒకే కాన్పులో ముగ్గురు జననం.. తల్లి మృతి

image

పెనుకొండ మండలం మోటువారిపల్లికి చెందిన వెన్నెల(25) ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చి.. మృతి చెందారు. వెన్నెల జూన్ 29న ఒకే కాన్పులో ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పిల్లలు క్షేమంగా ఉన్నారు. అయితే వెన్నెల బిడ్డలకు జన్మనిచ్చి కోమాలోకి వెళ్లిపోయింది. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

News July 4, 2024

అల్లూరి సీతారామరాజుకు పల్నాడు ఎస్పీ నివాళులు

image

పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలలో జిల్లా మలికా గర్గ్ పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు దేశానికి చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రాఘవేంద్ర, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

News July 4, 2024

రిలీవ్ అయిన జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శ్రీధర్

image

బాపట్ల జిల్లా కలెక్టర్‌గా వెంకట మురళీ బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన చామకూరి శ్రీధర్ రిలీవ్ అయ్యారు. ఇటీవల జరిగిన బదిలీలలో ఆయన అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. త్వరలోనే శ్రీధర్ అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

News July 4, 2024

శ్రీకాకుళం: కీలక కమిటీలలో ఎంపీ రామ్మోహన్‌కు స్థానం

image

కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా రూపొందించిన 2 కీలక కేబినెట్ కమిటీలలో చోటు కల్పించింది. ఈ మేరకు పార్లమెంటరీ, రాజకీయ వ్యవహారాల కమిటీలో రామ్మోహన్‌కు కేంద్ర ప్రభుత్వం చోటు కల్పించినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కాగా పార్లమెంటరీ వ్యవహారాల కమిటీకి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజకీయ వ్యవహారాల కమిటీకి మోదీ నేతృత్వం వహిస్తారు.

News July 4, 2024

యర్రగుంట్ల: బొగ్గు వ్యాగన్లలో మృతదేహం

image

యర్రగుంట్ల మండల పరిధిలోని ఆర్టీపీపీలో బొగ్గు వ్యాగన్లలో గుర్తుతెలియని మృతదేహం బయటపడింది. కార్మికుల వివరాల ప్రకారం.. బొగ్గును యూనిట్లకు సరఫరా చేస్తున్న సమయంలో మృతదేహం కనిపించింది. రెండు రోజుల క్రితం కృష్ణపట్నం పోర్టు నుంచి బయలుదేరి ఈ వ్యాగన్లు ఇవాళ ఆర్టీపీపీకి చేరుకున్నాయి. ఈ విషయం ఈ విషయం తెలుసుకున్న ఎస్పీఎఫ్ కలమల్ల పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు.

News July 4, 2024

త్వరలో విస్తృతస్థాయి సమావేశాలు: గుడివాడ

image

కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికి త్వరలో విస్తృతస్థాయి సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామన్న ఆయన.. మళ్లీ ప్రజాభిమానాన్ని సంపాదిస్తామని పేర్కొన్నారు. అలాగే ఈనెల 8న జరిగే వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతికి విస్తృత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు.

News July 4, 2024

గిరి ప్రదక్షిణ రూట్ పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్

image

వచ్చే నెలలో నిర్వహించే సింహాచలం సింహాద్రి అప్పన్న గిరి ప్రదిక్షణ రూట్‌ను జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ ఇంజనీర్ అధికారులతో పరిశీలించారు. గిరి ప్రదక్షిణ రోజున లక్షల సంఖ్యలో ప్రజలు సింహాద్రి అప్పన్నతో గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రహదారిని చదును చేయాలని సూచించారు.