Andhra Pradesh

News July 4, 2024

శ్రీకాకుళం: ఆదిత్యుని సేవలో సినిమా హీరో సంపూర్ణేశ్ బాబు

image

శ్రీకాకుళం నగరంలోని ప్రత్యక్షదైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని సినిమా హీరో శ్రీ సంపూర్ణేశ్ బాబు స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాన్ని జ్ఞాపికగా ఆలయ జూనియర్ అసిస్టెంట్ బి. చక్రవర్తి అందజేశారు.

News July 4, 2024

శ్రీకాకుళం: విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఎమ్మెల్యే

image

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో ప్రాథమికోన్నత పాఠశాలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు సందర్శించారు. 5వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారికి పాఠాలను చెప్పారు. విద్యార్థులు చదువుల్లో రాణించాలని సూచించారు. పాఠశాలలో ఉన్న సమస్యలను ఇన్‌ఛార్జ్ హెచ్ఎం సరళ ఎమ్మెల్యేకు వివరించారు. సర్పంచ్ భాను, ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారు.

News July 4, 2024

దాచేపల్లి వద్ద స్కూల్ ప్రిన్సిపల్ మృతదేహం కలకలం

image

దాచేపల్లి పిడుగురాళ్ల హైవేపై వాసవి గ్రీన్ సిటీ‌లో స్థానిక ఆక్స్ ఫర్డ్ విద్యాసంస్థల ప్రిన్సిపల్ నాగిరెడ్డి మృతదేహంగా కనిపించడం గురువారం కలకలం రేపింది. ఈనెల ఒకటో తారీకు నుంచి నాగిరెడ్డి కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తించలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు నాగిరెడ్డిగా గుర్తించి దర్యాప్తు వేగవంతం చేశారు. మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

News July 4, 2024

కత్తిపూడి జాతీయ రహదారిపై ప్రమాదం.. మహిళ మృతి

image

కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ(62) అక్కడికక్కడే మృతి చెందింది. కత్తిపూడి నుంచి రావికంపాడు వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు గాయలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే అథారిటీ గాయాలైన భర్తను అంబులెన్సులో తుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

News July 4, 2024

టీడీపీ నాయకుల దాడిలో గాయపడి వైసీపీ నాయకుడి మృతి

image

హిందూపురం రూరల్ గొల్లాపురంలో టీడీపీ నాయకులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన వైసీపీ కార్యకర్త సతీశ్(45) బెంగళూరులో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాజకీయ కక్షతో కొంతమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు సతీశ్‌పై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మృతిచెందినట్లు వాపోయారు.

News July 4, 2024

తూ.గో: ఈ నెల 10న బైకుల వేలం

image

తూ.గో జిల్లాలోని ఎస్ఈబీ దేవరపల్లి స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు ఈ నెల 10వ తేదీన వేలం నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనే వారు తమ ఆధార్ కార్డు తీసుకురావాలని, రూ.5 వేల ధరావతు చెల్లించాలని సీఐ కె.వెంకటేశ్వరస్వామి తెలిపారు.. పాట దక్కించుకున్న వారు అదే రోజు వేలం సొమ్ముతో పాటు GST కలిపి చెల్లించాలని సూచించారు.

News July 4, 2024

VZM: 28,490 పెంపుడు కుక్కలకు ఉచిత టీకాలు

image

జునోసిస్ దినోత్సవ సందర్భంగా ఈ నెల 6న జిల్లాలోని 28,490 పెంపుడు కుక్కలకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు వై.వి.రమణ తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న పెంపుడు కుక్కల యజమానులు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సమీప పశు వైద్య కేంద్రాలను సంప్రదించాలన్నారు.

News July 4, 2024

బాపట్ల: విధి నిర్వహణలో సైనికుడు గుండెపోటుతో మృతి

image

బాపట్ల పట్టణం భావపురి కాలనీకి చెందిన షేక్ రజ్జుబాషా అనే ఆర్మీ ఉద్యోగి విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందినట్లు, మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో వీధి నిర్వహణలో ఉన్న రజ్జుబాషా అకాల మరణం బాధాకరమన్నారు. నేటి సాయంత్రానికి ఆయన మృతదేహం స్వస్థలానికి చేరుకుంటుందని తెలిపారు. వారి కుటుంబానికి మాజీ సైనిక సంక్షేమ సంఘం అండగా ఉంటుందన్నారు.

News July 4, 2024

నెల్లూరు కలెక్టర్‌గా ఆనంద్ బాధ్యతలు

image

నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఓ.ఆనంద్ గురువారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సబ్ కలెక్టర్ విద్యాధరి, జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, ఇన్‌ఛార్జ్ డీఆర్‌ఓ పద్మావతి స్వాగతం పలికారు. అనంతరం ఆయన అల్లూరు సీతారామ రాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

News July 4, 2024

జేఎన్టీయూ పరిధిలో 8 ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు కోత

image

జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ పరిధిలో 8 ఇంజనీరింగ్ కళాశాలలో నాణ్యత ప్రమాణాలు సరిగా లేవని అధికారులు సీట్ల కోత విధించారు. అనంత జిల్లాలో రెండు, చిత్తూరులో ఒకటి, నెల్లూరులో రెండు, కడపలో 1, అన్నమయ్య జిల్లాలో రెండు ఇంజనీరింగ్ కళాశాల ఉన్నట్లు తెలిపారు. నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్లు తీసుకోవద్దని సూచించారు. మొత్తం మీద 66 ఇంజనీరింగ్ కళాశాలలకు జేఎన్టీయూ అనుమతి ఇచ్చింది.