Andhra Pradesh

News July 4, 2024

కృష్ణా: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

విజయవాడ నుంచి ముంబైకు ఆగస్టు 16 నుంచి నాన్ స్టాప్ ఫ్లైట్స్ నడపనున్నట్లు ఇండిగో సంస్థ తెలిపింది. విజయవాడలో రాత్రి 9 గంటలకు బయలుదేరే ఈ ఫ్లైట్ రాత్రి 11 గంటలకు ముంబై చేరుకుంటుందని, ముంబైలో సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరే ఈ ఫ్లైట్ రాత్రి 8.20 గంటలకు విజయవాడ చేరుకుంటుందని ఆ సంస్థ పేర్కొంది. వివరాలకు ఇండిగో సంస్థ అధికారిక వెబ్‌సైట్ చూడాలని స్పష్టం చేసింది.

News July 4, 2024

రామచంద్రాపురం: జాతరలో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

రామచంద్రాపురం మండలం నెత్తకుప్పం గంగమ్మ జాతరలో అపశృతి చోటుచేసుకుంది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి గంగమ్మ ఆలయంలో విద్యుత్ షాక్‌కు గురై శానంపూరి గోపి(40) తీవ్రంగా గాయపడ్డారు. అతడిని కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే చనిపోయాడని డాక్టర్ నిర్దారించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

News July 4, 2024

పెదపాడులో ప్రమాదం.. వ్యక్తి మృతి

image

పెదపాడు మండలం కొక్కిరపాడు సాయిబాబా గుడి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 16 నంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో పెదపాడు మండలం పాతముప్పర్రు గ్రామానికి చెందిన గుళ్లంకి ఉమ(26) గా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 4, 2024

VZM: మార్కెట్‌లో సెంచరీ కొట్టిన మిరప

image

మార్కెట్‌లో మిరప మరింత ఘాటెక్కింది. స్థానిక రామభద్రపురం కూరగాయల మార్కెట్‌లో గత నెల కిలో రూ.30 ఉన్న మిర్చిని ప్రస్తుతం రూ.100కు వ్యాపారులు అమ్ముతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మిరపకు తెగుళ్లు సోకి, పంట పాడైపోవడంతో గిరాకీ పెరిగిందని రైతులు చెబుతున్నారు. ఒకే సారి భారీగా పెరిగిపోవడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

News July 4, 2024

మౌలిక వసతుల కల్పనకు కృషి: విశాఖ కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం విశాఖను ఐటీ, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని భావిస్తుందని అందుకు తగ్గట్లుగా మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తానని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించిన తరువాత మాట్లాడుతూ.. జిల్లాలో భూముల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. అర్హులకు అన్యాయం జరగకుండా చూస్తానన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు.

News July 4, 2024

గిద్దలూరు: కిరోసిన్ పోసుకొని యువతి ఆత్మహత్య

image

గిద్దలూరు మండలం కొంగలవీడు రహదారిలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. బ్రహ్మంగారి గుడి సమీపంలో రవణమ్మ అనే 15 సంవత్సరాల యువతి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో రవనమ్మ శరీరం పూర్తిగా కాలిపోయింది. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరీక్షించగా.. రవణమ్మ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News July 4, 2024

రాజానగరం: రూ.40 లక్షల నిధుల గోల్ మాల్

image

రాజానగరం మండలం జి.యర్రంపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో రూ.40 లక్షలు గోల్ మాల్ జరిగిందని సమాచారం. దీనికి సంబంధించి బిజినెస్ కరస్పాండెంట్ నానిబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారని తూ.గో. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. మహిళా సభ్యులు చేసిన ఫిర్యాదుతో జూన్ 20న విచారణ చేపట్టి నివేదికను అందించారన్నారు. DRDA అధికారి జనార్ధన్ రావు దీనిపై విచారణ చేస్తారన్నారు.

News July 4, 2024

విజయవాడ: YCP నాయకుల గుండెల్లో రైళ్లు..?

image

మంగళగిరి TDP రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో YCP నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నాయకులను అరెస్టు చేయగా.. దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న విజయవాడ YCP నాయకులు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. 2021 అక్టోబర్ 19న TDP కార్యాలయంపై YCP నాయకులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై CC కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు ప్రాథమికంగా నిందితుల జాబితా తయారు చేశారు.

News July 4, 2024

విజయవాడ- విజయనగరానికి RTC సూపర్ లగ్జరీ బస్సు

image

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి విజయనగరానికి సూపర్ లగ్జరీ బస్సును నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సాయంత్రం 6.45 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సు తర్వాతి రోజు ఉదయం 5 గంటలకు విజయనగరం చేరుకుంటుందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో ఉదయం 6.50 గంటలకు విజయనగరంలో బయలుదేరి సాయంత్రం 5.15 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని RTC విజ్ఞప్తి చేసింది.

News July 4, 2024

వెలుగొండ అడవుల్లో రెండు పులులు: డీఎఫ్ఓ చంద్రశేఖర్

image

ఇటీవల వెలుగొండ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలలో రెండు పులులను గుర్తించినట్లు జిల్లా అటవీశాఖ అధికారి ఆవుల చంద్రశేఖర్ తెలిపారు. ఈ పులులు నల్లమల అటవీ ప్రాంతం నుంచి వెలుగొండ అటవీ ప్రాంతాలకు వచ్చినట్లు గుర్తించారు. పులుల సంచారంతో పొంచి ఉన్న ప్రమాదకర పరిస్థితుల దృష్యా పశువులు, మేకలు, గొర్రెల కాపరులు అడవిలో వెళ్లద్దన్నారు.