Andhra Pradesh

News July 4, 2024

కడప: 6న డిగ్రీ అర్హతతో జాబ్ మేళా

image

కడప రిమ్స్ రోడ్డులోని స్పిరిట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఈ నెల 6వ తేదీ ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్లేస్మెంట్ అధికారి ఎస్ఎండీ మునీర్ తెలిపారు. ఏదైనా డిగ్రీ లేక పీజీ ఉత్తీర్ణులై 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఈ జాబ్ మేళాను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News July 4, 2024

కర్నూలు జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ ప్రారంభం

image

నీట్, యూజీసీ నెట్ పరీక్షల పేపర్ల లీక్‌ను నిరసిస్తూ నేడు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. గురువారం కర్నూలులోని ఇందిరా గాంధీ స్మారక మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని విద్యార్థులను ఇంటికి పంపించారు. నీట్, నెట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీకేజీపై సిట్టింగ్ సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

News July 4, 2024

చిత్తూరులో రేపు ఉద్యోగ మేళా

image

జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి పద్మజ పేర్కొన్నారు. సుగుణ ఫుడ్స్, శ్రీరామ్ గ్రూప్, క్రియా నెక్స్ట్ వెల్త్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమాతోపాటు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18-30 సంవత్సరాలలోపు అభ్యర్థులు అర్హులన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 4, 2024

కొండపి: కిలో పొగాకు గరిష్ఠ ధర రూ.362

image

కొండపి వేలం కేంద్రంలో కిలో పొగాకు గరిష్ఠ ధర రూ.362 పలికిందని వేలం నిర్వహణాధికారి జి. సునీల్ కుమార్ తెలిపారు. బుధవారం బోర్డు పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు వేలం కేంద్రానికి 1,183 బేళ్లను అమ్మకానికి తీసుకురాగా.. 1085 బేళ్లను కొనుగోలు చేశారు. మిగిలినవి వివిధ కారణాలతో తిరస్కరించారు. పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.362, కనిష్ఠ ధర రూ. 204, సరాసరి ధర రూ.294.91 పలికిందన్నారు.

News July 4, 2024

తిరుపతి: JRFకు దరఖాస్తుల ఆహ్వానం

image

శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో డీఆర్డీవో ఆర్థిక సహకారంతో నడుస్తున్న రీసెర్చ్ ప్రాజెక్టులో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) ఖాళీల భర్తీకి అధికారులు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పీజీలో మైక్రోబయాలజీ /బయోకెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/వైరాలజీ కోర్సు పూర్తిచేసి నెట్/సీఎస్ఐఆర్/డీబీటీ/ గేట్ పరీక్షలో అర్హత సాధించిన మహిళా అభ్యర్థులు ఈనెల 5లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 4, 2024

గుంటూరు: YCP నాయకుల గుండెల్లో రైళ్లు?

image

మంగళగిరి TDP రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో YCP నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నాయకులను అరెస్టు చేయగా.. దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న విజయవాడ YCP నాయకులు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. 2021 అక్టోబర్ 19న TDP కార్యాలయంపై YCP నాయకులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై CC కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు ప్రాథమికంగా నిందితుల జాబితా తయారు చేశారు.

News July 4, 2024

ఉత్తమ అవార్డు కోసం దరఖాస్తులు చేసుకోండి: డీఈఓ

image

పుట్టపర్తిలో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం టీచర్లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ అవార్డుకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా అర్హులేనన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 15వ తేదీలోపు https:/nationalawardstoteachers. education.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు పంపాలని సూచించారు.

News July 4, 2024

అనంత ఉమ్మడి జిల్లాలో ముగిసిన కౌన్సిలింగ్

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లకు రెండు రోజుల పాటు నిర్వహించిన కౌన్సిలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. నార్పల బీసీ గురుకుల పాఠశాలలో తొలిరోజు బాలురకు, రెండోరోజు బాలికలకు మెరిట్ జాబితా మేరకు కౌన్సిలింగ్ చేపట్టారు. ఆయా తరగతుల్లో మొత్తం 63 సీట్లకు గాను 1.2 నిష్పత్తిలో 126 మందిని కౌన్సిలింగ్‌కు పిలిచారు.

News July 4, 2024

చిత్తూరు: పెళ్లైన 3నెలలకే వేధింపులు

image

పెళ్లైన 3 నెలలకే నవ వధువును కట్నం కోసం వేధించిన భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మదనపల్లె తాలూకా ఎస్సై రవికుమార్ కథనం మేరకు.. తిరుపతికి చెందిన యశ్వంత్ కుమార్(25) 3నెలల క్రితం మదనపల్లె మండలం సీటీఎం రేగంటివారిపల్లెకు చెందిన నాగమణిని పెళ్లి చేసుకున్నాడు. 3నెలలకే అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వరలక్ష్మి, వెంకట సూర్య నారాయణ వేధించడంతో బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.

News July 4, 2024

కర్నూలు: తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్లకు ఇంక్రిమెంట్ల తొలగింపు

image

కృష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం తహసీల్దార్ ఎం.మాధూరి, సబ్ రిజిస్ట్రార్ బీ.సాయి కృష్ణారెడ్డికి రెండు ఇంక్రిమెంట్లు తొలగించినట్లు లోకాయుక్త రిజిస్ట్రార్ వెంకటేశ్వరరెడ్డి బుధవారం తెలిపారు. వెబ్‌ల్యాండ్ దస్త్రాల్లో అవకతవకలు జరిగినట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వానికి నివేదించగా తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్‌కు రెండు ఇంక్రిమెంట్లు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసిందన్నారు.