Andhra Pradesh

News July 4, 2024

కర్నూలు: నేటి నుంచి ‘స్కౌట్స్ అండ్ గైడ్స్’ దరఖాస్తుల ఆహ్వానం

image

కర్నూలు జిల్లాలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పాత యూనిట్ల పునరుద్ధరణ, కొత్త యూనిట్ల నమోదుకు నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శామ్యూల్ తెలిపారు. 8వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఇందుకు రిజస్ట్రేషన్ క్లడ్/బుల్బులకు రూ.211, స్కాట్స్ అండ్ గైడ్స్‌కు రూ.381, రివర్స్ అండ్ రేంజర్స్‌కు రూ.301 ప్రకారం ఫీజు చెల్లించి ప్రతి స్కూల్ యాజమాన్యం రసీదు పొందాలన్నారు.

News July 4, 2024

రామచంద్రపురం: బాలికను అపహరించి అత్యాచారం

image

ప్రేమ పేరుతో బాలికను యువకుడు అపహరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన రామచంద్రపురంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు జూన్ 24న బాలిక అదృశ్యమైంది. సురేశ్ ప్రేమ పేరుతో ఆమెను హైదరాబాద్ తీసుకువెళ్లి ఒక లాడ్జిలో అత్యాచారం చేశాడని ఎస్సై సురేశ్ బాబు తెలిపారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదుతో యువకుడిపై కిడ్నాప్, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశామన్నారు. సురేశ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందన్నారు.

News July 4, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి

image

తాడిపత్రి మండల పరిధిలోని ఆర్జాస్ స్టీల్ ప్లాంట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలంలోనే జాకీర్ మృతి చెందగా, అక్బర్‌కు త్రీవంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించగా.. ఆస్పత్రిలో మృతిచెందినట్లు వెల్లడించారు. ఇద్దరూ అన్నదమ్ములు కావడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News July 4, 2024

జనవాసాల్లోకి చుక్కల దుప్పి

image

అటవీ ప్రాంతం నుంచి దారి తప్పిన ఓ చుక్కల దుప్పి జనావాసాల్లోకి వచ్చింది. దీనిపై కుక్కలు దాడి చేయడంతో శ్రీకాకుళం జిల్లా మందస మండలం కంచుమాయమ్మ కాలనీలోని ఓ ఇంటిలోకి ప్రవేశించింది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందజేశారు. వెనుక కాలికి తీవ్ర గాయం అవ్వడంతో పశువైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. అనంతరం బుడంబో సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

News July 4, 2024

గుంటూరు: నేడు విద్యాసంస్థల బంద్‌కు SFI పిలుపు

image

గుంటూరు నగరంలోని విద్యాసంస్థలను గురువారం మూసివేయాలని బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ బుధవారం తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌లో భాగంగా.. ఈ బంద్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ కోరుతూ.. ఈ బంద్‌ చేపట్టినట్లు SFI నాయకులు తెలిపారు.

News July 4, 2024

పల్నాడు జిల్లాలో క్షుద్రపూజల కలకలం

image

నరసరావుపేట మండలంలోని చిన్నతురకపాలెంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి చెట్లకు ఇనుప మేకులు కొట్టి, రోడ్డు కూడలిలో నిమ్మకాయలు వేసి, పసుపు, కుంకుమ పెట్టి వెళ్తున్నారు. దాంతో ఇనుప మేకులు కొట్టిన చెట్లను గ్రామస్థులు నరికివేస్తున్నారు. కొత్త వ్యక్తులు గ్రామంలోకి రాకుండా రాత్రులు కాపలా కాస్తున్నారు. అయితే క్షుద్రపూజల భయంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

News July 4, 2024

నల్లజర్లలో దారుణం.. రక్తపు మడుగులో వ్యక్తి

image

నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. గ్రామంలోని తమిరిసి వెంకటేశ్వరరావు (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. గ్రామంలోని ప్రధాన సెంటర్లో మదర్ థెరిసా విగ్రహం ఎదుట వెంకటేశ్వరరావు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు నల్లజర్ల పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో 200 మీటర్ల నుంచి రక్తపు మరకలు ఉండడంతో హత్యగా భావిస్తున్నారు.

News July 4, 2024

కంభం: SIపై SPకి ఫిర్యాదు

image

పల్నాడు జిల్లా మాచర్ల SI బత్తుల గోపాల్‌పై SP మలికాగార్గ్‌కు ప్రకాశం జిల్లా, కంభం మండలం, రావిపాడుకు చెందిన కోట వెంకట సుబ్బయ్య దంపతులు ఫిర్యాదు చేశారు. గతేడాది జూన్‌లో వెంకట సుబ్బయ్యకు చెందిన 3.75 ఎకరాల పొలాన్ని ఎస్సై గోపాల్ తన భార్య వరలక్ష్మి పేరుతో రూ.37లక్షలకు కొన్నారు. రూ.24లక్షలు చెల్లించగా.. మిగతా రూ.13లక్షలు ఇవ్వాలని అడిగితే చంపుతానని బెదిరిస్తున్నారని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

News July 4, 2024

గుంటూరు రైలు ఔరంగాబాద్ వరకు పొడిగింపు

image

గుంటూరు- సికింద్రాబాద్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు (17253)ను, ఈ నెల ఒకటి నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఔరంగాబాద్- గుంటూరు రైలు (17254) తిరుగు ప్రయాణంలో ఇదే మార్గంలో నడుస్తుందని వివరించారు.

News July 4, 2024

రామచంద్రాపురం: గ్రామ జాతరలో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

image

రామచంద్రాపురం మండలం నెత‌్తకుప్పం గ్రామ గంగమ్మ జాతరలో అపశృతి చోటుచేసుకుంది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి గంగమ్మ ఆలయంలో విద్యుత్ షాక్ కు గురై శానంపూరి గోపి(40) తీవ్రంగా గాయపడ్డారు. అతడిని కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే చనిపోయాడని డాక్టర్ నిర్దారించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.