Andhra Pradesh

News July 4, 2024

రాయచోటి: GREAT.. ఏడాదికి రూ.32 లక్షల జీతం

image

రాయచోటిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన విజయ్‌ రూ.32 లక్షల వేతనంతో కొలువు సాధించాడు. ఆన్లైన్ విధానంలో బ్యాంకింగ్ వ్యవస్థకు చెందిన ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. జపాన్‌లో పేరు కలిగిన సాప్ట్ బ్యాంకు సంస్థలో ఏడాదికి రూ.32 లక్షల వేతనానికి విజయ్ ఎంపికయ్యారని తెలిపారు.

News July 4, 2024

చిత్తూరు: మద్యం మత్తులో యాసిడ్ తాగిన వ్యక్తి

image

మద్యంమత్తులో తాగునీరు అనుకొని యాసిడ్ తాగి వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై మల్లికార్జున బుధవారం తెలిపారు. బంగారుపాళ్యం మండలం పాలేరుకు చెందిన చంద్రశేఖర్ (40) డ్రైవరుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల ఒకటో తేదీన విధులు ముగించుకొని మధ్యాహ్నం మద్యం తాగడానికి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో దాహం వేయడంతో బాత్రూమ్‌లోని యాసిడ్‌ను నీరుగా భావించి తాగాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News July 4, 2024

తెలంగాణలో నెల్లూరు యువకుడి మృతి

image

ఏఎస్ పేట మండలం, జమ్మవరం గ్రామానికి చెందిన వెంకట్రావు (36) మంగళవారం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఆయన బంధువులు తెలిపారు. వెంకట్రావు మంగళవారం మరో ఇద్దరితో కలిసి బైక్‌పై వెళుతుండగా మర్రిగూడ మండలం, తమ్మిడిపల్లి గ్రామం వద్ద బైక్ అదుపు తప్పి సమాధిని ఢీకొంది. ఘటనలో బాలరాజు అక్కడికక్కడే మృతి చెందగా, వెంకట్రావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కృష్ణకు తీవ్ర గాయాలు అయ్యాయి.

News July 4, 2024

5న ఆదోని మార్కెట్ యార్డుకు సెలవు

image

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు 5వ తేదీన సెలవు ప్రకటించినట్లు యార్డు అధికారులు బుధవారం తెలిపారు. అమావాస్య సందర్భంగా పంట దిగుబడుల క్రయవిక్రయాలు జరగవన్నారు. మార్కెట్ యార్డులో తిరిగి శనివారం యథావిధిగా వ్యాపారాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.

News July 4, 2024

అనంత: బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు అరెస్ట్

image

పుట్లూరు మండలంలో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పుట్లూరు ఎస్సై హేమాద్రి తెలిపారు. నిందితులు రవితేజ, నాగేంద్రను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని ఈనెల 16వ తేదీ వరకు రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 4, 2024

శ్రీకాకుళం: 5,6 తేదీల్లో పలు రైళ్ల రద్దు

image

పలాస-విశాఖపట్నం మెయిన్ రైల్వే లైన్‌లో జరగనున్న భద్రత, ఆధునీకరణ పనుల నేపథ్యంలో ఈనెల 5వ తేదీన జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. 5న పలాస-విశాఖ ప్యాసింజర్, గునుపూర్-విశాఖ ప్యాసింజర్, విశాఖ-బరంపురం ప్యాసింజర్, విశాఖ-భువనేశ్వర్(ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్) రైళ్లతో పాటు 6వ తేదీన బరంపురం-విశాఖ, భువనేశ్వర్-విశాఖ ఇంటర్ సిటీ రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

News July 4, 2024

నేటి నుంచి సంపూర్ణ అభియాన్: కలెక్టర్

image

అత్యంత వెనుకబడిన మండలాలైన హోళగుందలో గురువారం, మద్దికెరలో 5న, చిప్పగిరిలో 6న సంపూర్ణ అభియాన్ సభలు నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. 30 అంశాలను సాచురేషన్ పద్ధతిలో 100 శాతం తీసుకొని వెళ్లాలన్నదే భారత ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలకు అవగాహన కల్పించే విధంగా విద్యార్థులతో 6 అంశాలకు సంబంధించిన ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించాలని ఎంపీడీవోలను ఆదేశించారు.

News July 4, 2024

ప్రత్తిపాడు: బాలుడి విక్రయం కేసులో మహిళ అరెస్ట్

image

ఏడాదిన్నర బాలుడి విక్రయం కేసులో ప్రత్తిపాడుకు చెందిన అమ్ములును మహారాష్ట్ర పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆమెను ముంబైకి తీసుకువెళ్లారని ప్రత్తిపాడు పోలీసులు తెలిపారు. మానవ అక్రమ రవాణా కేసులో నిందితురాలి కోసం ముంబై కంజూర్మార్క్ పోలీసులు 3 రోజులుగా గాలిస్తున్నారు. నిందితురాలిగా అనుమానిస్తున్న తోట మంగతాయారు పరారీలో ఉంది. ఆమె బంధువు అమ్ములు కేసులోని వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చిందని అరెస్టు చేశారు.

News July 4, 2024

నరసరావుపేట: క్షుద్రపూజల కలకలం

image

మండలంలోని చిన్నతురకపాలెంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి చెట్లకు ఇనుప మేకులు కొట్టి, రోడ్డు కూడలిలో నిమ్మకాయలు వేసి, పసుపు, కుంకుమ పెట్టి గుర్తు తెలియని వ్యక్తులు వెళ్తున్నారు. దాంతో ఇనుప మేకులు కొట్టిన చెట్లను గ్రామస్థులు నరికివేస్తున్నారు. కొత్త వ్యక్తులు గ్రామంలోకి రాకుండా రాత్రులు కాపలా కాస్తున్నారు. అయితే క్షుద్రపూజల భయంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

News July 4, 2024

VZM: రేపు పలు రైళ్లు రద్దు చేసిన రైల్వే అధికారులు

image

పలాస-విజయనగరం డివిజన్ పరిధిలో భర్త భద్రతాపరమైన పనులు కారణంగా రేపు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డిసిఎం కే సందీప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 07471 పలాస-విశాఖ, 07470 విశాఖ -పలాస, 08522 విశాఖ – గునుపూర్, 08521 గునుపూర్ – విశాఖ, 08504 విశాఖ – భవానీపట్నం, 08532 విశాఖ – బ్రహ్మపుర ప్యాసింజర్ ట్రైన్ లు, 22820 విశాఖ – భువనేశ్వర్ ఇంటర్ సిటీ రైలు రద్దు చేసినట్లు తెలిపారు.