Andhra Pradesh

News July 4, 2024

నేడు మాజీ CM జగన్ నెల్లూరు పర్యటన వివరాలు.!

image

మాజీ సీఎం జగన్ నేడు నెల్లూరుకు వెళ్లనున్నారు. తాడేపల్లి నుంచి బయలుదేరి ఉ.11.15 గంటలకు కనుపర్తిపాడు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కనుపర్తిపాడుకు చేరుకొని హెలికాప్టర్ ద్వారా తాడేపల్లికి బయలుదేరుతారు.

News July 4, 2024

ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి: మంత్రి రామ్మోహన్

image

శ్రీకాకుళంలో గవర్నెన్స్ అంశాలపై ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. డిగ్రీ/పీజీ చేసిన వారు 6 నెలల ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన వారికి ప్రతినెలా స్టైపెండ్ ఇస్తామని ఆయన చెప్పారు. ఆగస్టు 1 నుంచి జనవరి 2025 వరకు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుందన్నారు.

News July 4, 2024

నేడు మంత్రుల సబ్ కమిటీ సమావేశం

image

రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు మంత్రుల సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోంమంత్రి అనిత అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన ఈ సబ్ కమిటీలో రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంధ్ర, సత్యకుమార్ యాదవ్, గుమ్మిడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు. ఈ సబ్ కమిటీ తొలి సమావేశం 4వ తేదీ గురువారం రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో ఉదయం 11.00 గంటల నుంచి జరుగనుంది.

News July 4, 2024

కర్నూలు: కూటమిలో కలిసేందుకు వైసీపీ నేతల కసరత్తు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూటమి పార్టీల్లో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. YCP పాలనలో చేసిన పనులకు బిల్లులు రాక, అవినీతి ఆరోపణలు ఎదుర్కొటున్న నేతలు కండువా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. అయితే అలాంటి వారిని చేర్చుకోవద్దని స్థానిక నాయకులు తమ నేతలకు తెగేసి చెబుతున్నట్లు సమాచారం. కాగా కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ పురపాలికల్లో ఇప్పటికే పలువురు పార్టీ మారారు.

News July 4, 2024

విశాఖ: రేషన్ లబ్ధిదారులకు ఈనెల పంచదార లేదు

image

రేషన్ కార్డుదారులకు జులై నెల కోట కింద పంచదారను సరఫరా చేయలేదు. ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లాలోని పౌర సరఫరాల సంస్థ గిడ్డంగుల్లో ఆకస్మికంగా తనిఖీ చేయగా కందిపప్పు పంచదార ఇతర సరుకులు తూకంలో తక్కువగా ఉన్నాయి. ఫలితంగా కాంట్రాక్టర్‌ను నిలిపివేశారు. విశాఖ జిల్లాలో 5.20 లక్షల కార్డుదారులు ఉండగా వారెవరికి జులై నెల పంచదారను సరఫరా చేయడం లేదు.

News July 4, 2024

నేడు మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటన వివరాలు..

image

మాజీ సీఎం జగన్ నేడు నెల్లూరుకు రానున్నారు. తాడేపల్లి నుంచి బయలుదేరి ఉ.11.15 గంటలకు కనుపర్తిపాడు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కనుపర్తిపాడుకు చేరుకొని హెలికాప్టర్ ద్వారా తాడేపల్లికి బయలుదేరుతారు.

News July 4, 2024

రేణిగుంట: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

image

రేణిగుంట రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి బుధవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. రైల్వేస్టేషన్ ప్లాట్ఫాం-1 చివర్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని, మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతుడి వయస్సు 55 సంవత్సరాలకు పైగా ఉంటుందన్నారు. మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు.

News July 4, 2024

అనంత: JNTUలో పరీక్షలు వాయిదా

image

అనంతపురం జిల్లా కేంద్రంలోని JNTU పరిధిలో సెమిస్టర్ పరీక్షలు 4న జరగాల్సి ఉండగా వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య కేశవరెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్న బంద్ సందర్భంగా పరీక్షలు వాయిదా వేశామన్నారు. తదుపరి పరీక్షల నిర్వహణ తేదీలను యూనివర్సిటీ వెబ్ సైట్‌లో అప్‌డేట్ చేసినట్లు తెలిపారు.

News July 4, 2024

చక్రాయపేట: గొట్లమిట్ట సమీపంలో చిరుత సంచారం

image

వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల సరిహద్దులో ఉన్న మండలంలోని గొట్లమిట్ట సమీపంలో బుధవారం చిరుత కనిపించినట్లు గంగారపువాండ్లపల్లె సర్పంచ్ నాగరత్నమ్మ భర్త మల్రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. చక్రాయపేట వైపు నుంచి కొర్లకుంటకు వెళుతుండగా వారికి రోడ్డుకు అడ్డుగా వచ్చిందన్నారు. వారు హారన్ కొట్టడంతో దగ్గర్లో ఉన్న గుట్టల్లోకి వెళ్లిందని, దీనిపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించామన్నారు. 

News July 4, 2024

మార్కాపురంలో వ్యాపారి కిడ్నాప్?

image

మార్కాపురం మండలం బిరదులనరవకు చెందిన మిర్చి వ్యాపారి రావి వెంకటరెడ్డిని కిడ్నాప్ చేసినట్లు బుధవారం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వెంకటరెడ్డి గతంలో రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకపోవడంతో విసుగెత్తి రైతులు కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. బిరదుల నర్వ గ్రామానికి వచ్చి వ్యాపారి వెంకటరెడ్డిని రైతులు కొట్టి ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యుల వాదన. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.