Andhra Pradesh

News July 4, 2024

మార్కాపురంలో వ్యాపారి కిడ్నాప్?

image

మార్కాపురం మండలం బిరదులనరవకు చెందిన మిర్చి వ్యాపారి రావి వెంకటరెడ్డిని కిడ్నాప్ చేసినట్లు బుధవారం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వెంకటరెడ్డి గతంలో రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకపోవడంతో విసుగెత్తి రైతులు కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. బిరదుల నర్వ గ్రామానికి వచ్చి వ్యాపారి వెంకటరెడ్డిని రైతులు కొట్టి ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యుల వాదన. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News July 4, 2024

తూ.గో: నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్స్

image

వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం నిర్వహించే సదరం స్లాట్ బుకింగ్ శిబిరాలు గురువారం నుంచి తూ.గో జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జులై నుంచి సెప్టెంబర్ వరకు వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. దీనికోసం మీసేవా, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ముందస్తు స్లాట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.

News July 4, 2024

ఢిల్లీలో సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన కలిశెట్టి

image

ఢిల్లీ పర్యటనకు విచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబుకు ఎంపీ కలిశెట్టి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు పలువురు టీడీపీ ఎంపీలు ఉన్నారు.

News July 4, 2024

ఏలూరులో ‘వందేభారత్’ హాల్ట్ ఇవ్వాలని ఎంపీ వినతి

image

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డు ఛైర్మన్ & సీఈఓ జయ వర్మ సిన్హాను బుధవారం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కలిశారు. న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో వందేభారత్ రైళ్లకు ఏలూరులో హాల్ట్ కోరుతూ వినతిపత్రం అందించారు. భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్‌ను పనులు వేగవంతం చేయాల్సిందిగా కోరారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించిట్లు తెలిపారు.

News July 4, 2024

క్లబ్ మహీంద్రా ఛైర్మన్‌ గుర్నాని‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు

image

క్లబ్ మహీంద్రా ఛైర్మన్‌ సీపీ గుర్నాని‌, ఆయన బృందంతో సీఎం చంద్రబాబు బుధవారం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో హాస్పిటాలిటీ, టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వారు ఎదురు చూస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నానంటూ చంద్రబాబు ఈ మేరకు ట్వీట్ చేశారు. గుర్నాని బృందంతో అమరావతిలో జరిపిన సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూల వాతావరణం, వనరుల గురించి వివరించానని చంద్రబాబు స్పష్టం చేశారు.

News July 4, 2024

నరసన్నపేట: ‘104 సిబ్బంది సమస్యలను పరిష్కరించండి’

image

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన 104 వైద్య సేవలలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే రమణమూర్తికి వినతి పత్రం సమర్పించారు. బుధవారం జిల్లాలోని 104 సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తాము వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తూనే ఉన్నామని, కాని తమ సమస్యలు పరిష్కారం అవ్వడంలేదని ఆయనకు విన్నవించుకున్నారు.

News July 4, 2024

నీటిపారుదల ప్రాజెక్టులపై నివేదిక ఇవ్వండి: జిల్లా కలెక్టర్

image

జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టుల పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జలవనరులు, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆలూరు బ్రాంచ్ కెనాల్, కేసీ కెనాల్, హంద్రీ నీవా, గాజుల దిన్నె ప్రాజెక్ట్, వేదవతి, ఆర్డీఎస్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజి వివరాలు తెలుసుకున్నారు.

News July 4, 2024

వాల్మీకి మహర్షి పీఠాధిపతిని కలిసిన ఎంపీ అంబికా

image

ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు, ఉజ్జయిని వాల్మీకి మహర్షి పీఠాధిపతి బాలయోగి ఉమేశ్ నాథ్ గురూజీని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్మి నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాల్మీకుల ఎస్టీ అంశం గురించి చర్చించారు. సమస్య పరిష్కారానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

News July 4, 2024

శ్రీకాకుళం: నేడు మన్యందొర జయంతి వేడుకలు

image

అల్లూరి సీతారామ రాజు జయంతిని జూలై 4న కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మనజీర్ జిలాని తెలిపారు. జిల్లా అధికారులు, కలెక్టరేట్ ప్రాంగణంలోని అధికారులు, సిబ్బంది ఈ వేడుకలకు హాజరు కావాలని ఆదేశించారు. అదేవిధంగా అన్ని జిల్లా, డివిజినల్, మండల, గ్రామస్థాయి కార్యాలయాల్లోనూ అల్లూరి జయంతి వేడుకలను నిర్వహించాలన్నారు.

News July 4, 2024

కాలేజీలో సీట్లు పునరుద్ధరించాలని ఎంపీ వినతి

image

రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజీలో పీజీ సీట్లను పునరుద్ధరించాలని కేంద్ర మంత్రి ప్రతాప్ రావు గణపతిరావు జాదవ్‌ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ, దగ్గుబాటి పురందీశ్వరి కోరారు. కేంద్ర మంత్రిని కలిసి బుధవారం వినతిపత్రం సమర్పించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు.