Andhra Pradesh

News July 4, 2024

కడప: ‘మాజీ VC, రిజిస్ట్రార్ అవినీతిపై విచారణ జరపాలి’

image

యోగివేమన ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలలో ఔట్ సోర్సింగ్ నియామకాలలో అక్రమాలకు పాల్పడిన మాజీ రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. పిడిఎస్‌యు ఆధ్వర్యంలో బుధవారం యోగివేమన విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. యూనివర్సిటి మాజీ వీసీ చింతా సుధాకర్‌పై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

News July 4, 2024

రాష్ట్రంలో గంజాయి నియంత్రకు మంత్రుల సబ్ కమిటీ

image

రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు మంత్రుల సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన ఈ సబ్ కమిటీలో మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంధ్ర, సత్యకుమార్ యాదవ్, గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు. ఈ సబ్ కమిటీ తొలి సమావేశం 4వ తేదీ గురువారం రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులో ఉదయం 11.00 గంటల నుంచి జరుగనున్నట్లు చెప్పారు.

News July 4, 2024

రైల్వే రాయితీని పునరుద్ధరించాలి: ఎంపీ కలిశెట్టి

image

కోవిడ్ సమయంలో జర్నలిస్టులకు రద్దు చేసిన రైల్వే రాయితీని పునరుద్ధరించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఢిల్లీలో సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సీనియర్ సిటిజన్లకు రైల్ టికెట్ ఛార్జీలలో రాయితీని పెంచాలని.. అలాగే వికలాంగులకు రాయితిని అందించే సౌకర్యాలు పెంచాలన్నారు.

News July 3, 2024

శ్రీకాకుళం జిల్లా నేటి ముఖ్యంశాలు

image

* M.com పరీక్షల టైం టేబుల్ విడుదల * రేపు శ్రీకాకుళంలో ఘంటసాల గీతామృత మహోత్సవాలు * ఏపీఎల్‌లో సిక్కోలు ఆటగాడి ప్రతిభ * నంద్యాల జిల్లా కలెక్టర్‌గా టెక్కలి వాసి* హత్రాస్ బాధితులకు మంత్రి రామ్మోహన్ నాయుడు సానుభూతి * ఆపదలో ఆదుకున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ * రేపు జిల్లా వ్యాప్తంగా వర్షాలు

News July 3, 2024

ఏలూరు: కుమార్తెను చూడటానికి వెళ్తూ తల్లి మృతి

image

కుమార్తెను చూసేందుకు వెళ్తూ రైలులోంచి జారి పడి తల్లి మృతి చెందిన ఘటన ఏలూరులో జరిగింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. వేలేరుపాడు మండలం కోయమాదారం గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ(60) కుమార్తె నెల్లూరులో ఉంటోంది. బుధవారం ఆమెను చూసేందుకు వెళ్తూ ఏలూరు రైల్వే స్టేషన్‌లో యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతూ జారి పడి మృతి చెందింది. దీనిపై రైల్వే ఎస్ఐ డి.నరసింహారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 3, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా న్యూ టిన్‌సుఖియా(NTSK), SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.05952 NTSK- SMVB రైలును జులై 4 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రతి గురువారం, నం.05951 SMVB- NTSK రైలును జులై 8 నుంచి నవంబర్ 4 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News July 3, 2024

శ్రీకాకుళం: వాయిదా పడ్డ డిగ్రీ పరీక్షలు

image

విద్యార్థి సంఘాల బంద్ కారణంగా గురువారం ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు రేపు జరగాల్సిన 2, 4వ సెమిస్టర్ డిగ్రీ(రెగ్యులర్ & సప్లిమెంటరీ) పరీక్షలను వాయిదా వేశామని యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలపింది. వాయిదా పడిన పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.

News July 3, 2024

కొత్తూరులో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

image

ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ముంచంగిపుట్టు మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తూరు రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు దాటుతుండగా పాడేరు నుంచి ముంచంగిపుట్టు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

News July 3, 2024

గూగూడు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఆగ్రహం

image

శ్రీ గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో జాప్యం చేస్తున్న అధికారులపై ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడ్రోజుల క్రితం సమావేశం నిర్వహించి ఆదేశాలిచ్చినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇంకెప్పుడు పూర్తి చేస్తారంటూ మండిపడ్డారు. మరో నాలుగు రోజుల్లో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని.. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

News July 3, 2024

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 18 మందికి జరిమానా

image

తిరుపతి నగర పరిధిలో డిఎస్పీ రమణ కుమార్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 18 మందిని అదుపులోకి తీసుకుని కానిస్టేబుల్ గిరిబాబు కోర్టులో హాజరు పరిచారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి 4వ అదనపు మున్సిఫ్ కోర్టు జడ్జి గ్రంధి శ్రీనివాస్ బుధవారం తీర్పు చెప్పారు.