Andhra Pradesh

News July 3, 2024

గ్రీన్ టాక్స్ తగ్గించేందుకు కృషి: పల్లా శ్రీనివాస్

image

భారీ వాహనాలకు భారంగా మారిన గ్రీన్ టాక్స్ తగ్గించేందుకు కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక మండలం కూర్మన్నపాలెంలో ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన నెల రోజుల్లోనే అగనంపూడి టోల్ ప్లాజా ఎత్తివేయించానన్నారు.

News July 3, 2024

జిల్లా కలెక్టర్‌కు స్వాగతం పలికిన జిల్లా అధికారులు

image

తిరుపతి జిల్లా కలెక్టర్ గా నియమితులైన వెంకటేశ్వర్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. నూతన జిల్లా కలెక్టర్ కు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ధ్యానచంద్ర సాదర స్వాగతం పలికారు. గురువారం జిల్లా కలెక్టర్‌గా వెంకటేశ్వర్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News July 3, 2024

ర‌క్షిత మంచినీటి ప‌థ‌కాల‌పై ప్ర‌త్యేక దృష్టి: క‌లెక్ట‌ర్ సృజ‌న‌

image

ర‌క్షిత తాగునీరు, పారిశుద్ధ్యంతో ప్ర‌జ‌ల ఆరోగ్య ర‌క్ష‌ణ త‌ద్వారా జీవ‌న ప్ర‌మాణాల మెరుగుకు దోహ‌దం చేస్తాయ‌ని క‌లెక్ట‌ర్ సృజ‌న అధికారుల‌ను ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్‌లో అధికారులతో బుధవారం ఆమె స‌మావేశం నిర్వ‌హించారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాల ప‌రిధిలో మంజూరైన ప‌నులు, చేప‌ట్టిన ప‌నులు, వాటిలో పురోగ‌తి త‌దిత‌రాల‌పై చ‌ర్చించారు.

News July 3, 2024

TPT : రేపు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

image

శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS) నందు గురువారం ఉదయం 10 గంటలకు రీసర్చ్ అసోసియేట్ (మెడికల్/పారామెడికల్) పోస్ట్ కు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి. MSC నర్సింగ్, MPT న్యూరో, MSC న్యూరో ఫిజియాలజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://svimstpt.ap.nic.in/jobs వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News July 3, 2024

ఏర్పేడు : IITలో 21న కాన్వొకేషన్ కార్యక్రమం

image

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు జూలై 21వ తేదీ ఆదివారం 6వ కాన్వొకేషన్ (Convocation) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన అభ్యర్థులు 20వ తేదీ హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News July 3, 2024

పులివెందుల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పులివెందుల-ముద్దనూరు ప్రధాన హైవేపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. సైదాపురం మడూరు మార్గమధ్యంలో పులివెందుల వైపు నుంచి ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఎదురుగా ముద్దనూరు నుంచి బూడిద ట్యాంకరు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News July 3, 2024

ఏలూరు: రెండేళ్ల తర్వాత దొరికిన బాలుడు

image

ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ బాలుడి ఆచూకీ రెండేళ్ల తర్వాత తెలిసింది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం మర్లగూడెంకు చెందిన మహాలక్ష్మి కుమారుడు నందకిశోర్ చదవడం ఇష్టంలేక 2022లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గతంలోనూ అలానే వెళ్లి తిరిగి వచ్చేసేవాడు. కానీ.. రెండేళ్ల కింద వెళ్లిన నందకిశోర్ తిరిగి రాలేదు. అతడు కోల్‌కతాలో ఉన్నట్లు 4 రోజుల కింద తెలియగా.. తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

News July 3, 2024

శ్రీకాకుళం: M.Com పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఎం.కామ్ చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల(రెగ్యులర్ & సప్లిమెంటరీ) టైం టేబుల్ విడుదలైంది. జులై 26, 27, 29, 30, 31 ఆగస్టు1, 2, 3 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News July 3, 2024

రేపు శ్రీకాకుళంలో ఘంటసాల గీతామృత మహోత్సవాలు

image

శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియం వద్ద అంబేడ్కర్ ఆడిటోరియంలో ప్రముఖ గాయకుడు టీ.శరత్ చంద్ర ఆధ్వర్యంలో ఘంటసాల గీతామృత మహోత్సవాలు ఈ నెల 4న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఘంటసాల గీతాలు శరత్ చంద్ర ఆలపిస్తారు. అభిమానులు, సంగీత ప్రియులు హాజరు కావాలని నిర్వాహకులు ఈ సందర్భంగా కోరారు.

News July 3, 2024

తూ.గో: గురువారం నుంచి సదరం స్లాట్ బుకింక్స్

image

వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం నిర్వహించే సదరం స్లాట్ బుకింగ్ శిబిరాలు గురువారం నుంచి తూ.గో జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జులై నుంచి సెప్టెంబర్ వరకు వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. దీనికోసం మీసేవా, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ముందస్తు స్లాట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.