Andhra Pradesh

News July 3, 2024

విశాఖ: స్వామీజీలపై దుష్ప్రచారం మానుకోవాలి- వీహెచ్పీ

image

స్వార్థపరమైన రాజకీయ దురుద్దేశంతో హిందూమత స్వామిపై దుష్ప్రచారం తగదని వీహెచ్పీ నేత విజయ శంకర్ ఫణి హితవు పలికారు. డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్‌లో బుధవారం పెందుర్తి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. విజయ శంకర్‌ మాట్లాడుతూ ఇటీవల కొంత మంది స్వలాభం, వైఖరి వల్ల బ్రాహ్మణ వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాముల మీద దుష్ప్రచారం తగదన్నారు.

News July 3, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,645 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇందులో ఎస్ఓటీ పోస్టులు 1,731 వరకు ఖాళీలు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ 84, సెకండ్ లాంగ్వేజ్ 113, ఎస్ఏ ఇంగ్లీషు 61, ఎస్ఏ గణితం 89, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 63, ఎస్ఏ బయోలాజికల్ సైన్స్ 61, ఎస్ఏ సోషల్ స్టడీస్ 78, ఎస్ఏ పీఈటీ 211 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది.

News July 3, 2024

డీఎస్సీ ద్వారా 2,645 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ: కలెక్టర్

image

డీఎస్సీలో భాగంగా జిల్లాలో 2,645 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గతేడాది 62 శాతం మాత్రమే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ ఏడాది ప్రతి విద్యార్థి పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రణాళికను అమలు చేయాలన్నారు.

News July 3, 2024

కొరిశపాడు: పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

కొరిశపాడు మండలంలోని రావినూతల గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో మోపర్తి బసవరాజు బుధవారం తన పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకోగా అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 3, 2024

VZM: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఆహ్వానం

image

జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2024 సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారి ప్రేమ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో కనీసం 10 సంవత్సరముల సేవ పూర్తిచేసిన వారు అర్హులు. ఈ నెల 15వ తేదీలోగా వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలను teacher.education.gov.in వెబ్ సైట్‌‌ ద్వారా పొందవచ్చు

News July 3, 2024

శ్రీకాకుళం: B.Ed సెమిస్టర్ ఫీజు చెల్లించేందుకు నేడే ఆఖరు

image

జిల్లాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష రుసుము చెల్లించేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు అభ్యర్థులు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు జూలై 3వ తేదీ సాయంత్రంలోగా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థులు మొత్తం యూనివర్సిటీ మైగ్రేషన్ ఫీజుతో కలిపి 1,635 ఫీజులు చెల్లించాలి. జూలై 19వ తేదీ నుంచి B.Ed సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

News July 3, 2024

వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగయ్య పరిస్థితి విషమం

image

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటికి వాచ్మెన్‌గా ఉన్న రంగయ్య పరిస్థితి బుధవారం విషమించింది. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న రంగయ్యను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు ఆయన్ను కడప రిమ్స్‌కు తరలించారు. వివేకానంద హత్య కేసులో ఈయన్ను గతంలో సీబీఐ విచారించిన విషయం తెలిసిందే.

News July 3, 2024

నెల్లూరు కలెక్టర్ నేపథ్యం ఇదే..!

image

నెల్లూరు నూతన కలెక్టర్‌గా ఓ.ఆనంద్ నియమితులయ్యారు. తిరువనంతపురంలో ఆయన ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2016లో IAS‌కు ఎంపికయ్యారు. తూ.గో జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేశారు. 2018లో గూడూరు సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే ఆయనకు వివాహమైంది. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్‌గా, ITDO పీవోగా, మన్యం జిల్లా జేసీగా పని చేశారు. ఆయన భార్య ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించడం విశేషం.

News July 3, 2024

ఏలూరు: జాతీయ అవార్డులకు దరఖాస్తు

image

ఏలూరు జిల్లాలోని అర్హత కలిగిన ఉపాధ్యాయులు జాతీయ అవార్డులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని బుధవారం విద్యాశాఖ అధికారి ఎన్. అబ్రహం తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దరఖాస్తు చేసుకోవడానికి http://natioonlawardstoteachers.education.gov.in వెబ్సైట్ నందు అప్లికేషన్స్ పొందుపరిచామన్నారు. జూలై 15 వరకు అవకాశం ఉందని తెలిపారు.

News July 3, 2024

ఆదోని ఎంపీపీ వైసీపీ నుంచి బీజేపీలో చేరిక

image

ఆదోని మండల పరిషత్ అధ్యక్షురాలు బడాయి దానమ్మ వైసీపీని వీడి బీజేపీలో చేరారు. ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే పార్థసారథి కండువా కప్పి ఆహ్వానించారు. ఆమెతో పాటు కౌన్సిలర్లు లలితమ్మ, చిన్న, పద్మావతి, పలువురు సర్పంచులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ నుంచి చేరికలు మొదలయ్యాయని, ఆదోనిలో ఆ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమని ఎమ్మెల్యే అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి సూచించారు.