Andhra Pradesh

News July 3, 2024

సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్‌ను సీఎం కార్యాలయం వెల్లడించింది. ఉదయం 11.00 గంటలకు సచివాలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 03.00 గంటలకు అమరావతి రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేస్తారు.
సాయంత్రం 05.00 గంటలకు ఢిల్లీ బయలుదేరుతారని సీఎం కార్యాలయం తెలియజేసింది.

News July 3, 2024

బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

పలాస మీదుగా సత్రాగచ్చి(SRC), SMVT బెంగళూరు(SMVB) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల సౌలభ్యం మేరకు కొద్దిరోజులు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.08845 SRC- SMVB ట్రైన్‌ను జులై 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం, నం.08846 SMVB- SRC ట్రైన్‌ను జులై 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు ఏపీలో విజయనగరం,విజయవాడ తదితర స్టేషన్లలో ఆగుతాయి.

News July 3, 2024

DSC అభ్యర్థులకు.. విజయవాడలో ఫ్రీ కోచింగ్

image

DSC పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీనికై అభ్యర్థులు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ సంచాలకులు కిరణ్మయి తెలిపారు. అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో పండరీపురం రోడ్ నం.8 అశోక్‌నగర్‌, విజయవాడలోని స్టడీ సర్కిల్‌లో నిర్ణీత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 30తో దరఖాస్తు గడువు ముగియగా తాజాగా జులై 10 వరకు పెంచామని ఆమె చెప్పారు.

News July 3, 2024

VZM: ఓపెన్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

image

సార్వత్రిక విద్యాపీఠం పదోతరగతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో విజయనగరం జిల్లా రాష్ట్రంలో వరుసగా 15, 16వ స్థానాల్లో నిలిచింది. పదో తరగతిలో 543 మందికి 369, ఇంటర్‌లో 658కి 411 మంది పాసైనట్లు డీఈవో ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసేందుకు సబ్జెక్టుకు రూ.200, రీవెరిఫికేషన్‌కు రూ.1000 (సబ్జెక్టుకు) చొప్పున ఈనెల 13వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

News July 3, 2024

కడప: రైలు కింద పడి ASI ఆత్మహత్య

image

కడప జిల్లా కమలాపురం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న నాగార్జున రెడ్డి బుధవారం గంగాయపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన కమలాపురం పోలీస్ స్టేషన్‌ ఏఎస్ఐగా విధులు నిర్వర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 3, 2024

గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి

image

ఏలూరు జిల్లా: పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం ఉదయం నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి, MLa చిర్రి బాలరాజు, ఉంగుటూరు MLA ధర్మరాజు, ఐటీడీఏ పీఓ ఏం. సూర్యతేజ తదితరులు ఉన్నారు.

News July 3, 2024

నంద్యాల: ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

image

నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. కర్నూలు నుంచి వస్తున్న ఒంగోలు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బ్రాహ్మణకొట్కూరు సమీపంలో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రవి(35) చెందాడు. ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News July 3, 2024

జీతాల కోసం ఏయూ ఉద్యోగుల ఎదురుచూపులు..!

image

జీతాల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. మూడో తేదీ వచ్చినా ఉద్యోగులకు ఖాతాల్లో ఇంకా జీతాలు పడలేదు. ప్రతినెలా ఉద్యోగుల జీతాలకు దాదాపు రూ.36 కోట్లు వరకు ఖర్చవుతుంది. దీనికి సంబంధించిన ఫైల్‌పై స్వయంగా వీసీ సంతకం పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఏయూ వీసీ తన పదవికి రాజీనామా చేయగా, కొత్తవారిని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నియమించలేదు. ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌‌తో పాలన సాగుతోంది.

News July 3, 2024

సత్తెనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

మండలంలోని వెన్నదేవి గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సత్తెనపల్లికి మండలం కట్టవారిపాలెం గ్రామానికి చెందిన గొట్టిముక్కల వెంకట రామిరెడ్డి హైదరాబాదు నుంచి స్వగ్రామానికి వస్తుండగా, వెన్నాదేవి వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట రామారెడ్డి (55) మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

News July 3, 2024

శతాధిక గిరిజనుడిని ఎత్తుకున్న అల్లూరి కలెక్టర్ దినేష్

image

అల్లూరి కలెక్టర్‌‌గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం జిల్లాలోని పలు లోతట్టు గ్రామాల్లో పర్యటించారు. ఈ క్రమంలో పెదబయలు అనే గ్రామం వద్ద ప్రజా సమస్యలు చెప్పేందుకు వచ్చిన బాలంనాయుడుకు 100 ఏళ్ల వయసు అని, అతను మాజీ ఎంపీపీ అని తెలిసి సంతోషపడ్డారు. అతనిని ఎత్తుకొని అందర్నీ ఆశ్చర్య పరిచారు. ప్రజా సమస్యల పట్ల నాయుడు శ్రద్ధను కలెక్టర్ మెచ్చుకొని అభినందించారు.