Andhra Pradesh

News July 3, 2024

విజయనగరం: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

AU పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ నెల 4,6 తేదీలలో డా.వీఎస్ కృష్ణ కళాశాలలో స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 10 వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని.. 11 తేదీ నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 19న సీట్ల కేటాయించి..22 లోపు క్లాసులు ప్రారంభిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. AU పరిధిలో మొత్తం 163 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.

News July 3, 2024

విశాఖ: పలు రైళ్లకు అదనపు బోగీలు జత

image

ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు అదనపు బోగీలను జత చేసి నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖ-సాయినగర్ శిర్డీ(18503) రైలుకు ఈనెల 4న, సాయినగర్ శిర్డీ-విశాఖ(18504) రైలుకు ఈనెల 5న అదనంగా ఒక జనరల్ బోగీ, అదేవిధంగా విశాఖ-చెన్నై సెంట్రల్(22869) రైలుకు ఈనెల 8న, చెన్నై సెంట్రల్-విశాఖ(22870) రైలుకు ఈనెల 9న అదనంగా ఒక జనరల్ బోగీని జత చేస్తారని పేర్కొన్నారు.

News July 3, 2024

తూర్పుగోదావరి జిల్లాలో 99.05% పెన్షన్లు పంపిణీ పూర్తి

image

తూర్పు గోదావరి జిల్లాలో 99.05% పెన్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేయడం పూర్తయిందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ విషయాన్ని ఆమె మంగళవారం రాత్రి మీడియాకు తెలియజేశారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 2,41,771 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా 2,39,479 మందికి పెన్షన్లను అందించామని స్పష్టం చేశారు.

News July 3, 2024

విజయవాడ: దేవదాయశాఖ అధికారిణి సస్పెండ్

image

ఉమ్మడి కృష్ణా జిల్లా దేవదాయశాఖ అధికారిణి కె శాంతిని సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం దేవదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఉమ్మడి కృష్ణా జిల్లా దేవదాయశాఖ అధికారిణినిగా ఉన్న ఈమెను బాధ్యతల నుంచి తొలగించగా, తాజాగా ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కృష్ణా జిల్లాకు సంధ్యా, ఎన్టీఆర్ జిల్లాకు సీతారావమ్మలను సహాయ కమిషనర్లుగా నియమించారు.

News July 3, 2024

అనంత: రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షాలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ శంకర్, నారాయణ స్వామి తెలిపారు. వచ్చే ఐదు రోజులు ఉష్ణోగ్రతలు పగటి వేళ 35.5 డిగ్రీల నుంచి 36.6 డిగ్రీలుగా, రాత్రి వేళ 25.6 డిగ్రీల నుంచి 26.2 డిగ్రీలుగా నమోదయ్యే సూచనలు ఉన్నాయన్నారు. నైరుతి దిశగా గాలులు గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

News July 3, 2024

నంద్యాల నూతన కలెక్టర్ ప్రస్థానం

image

నంద్యాల జిల్లా నూతన కలెక్టర్‌గా బీ.రాజకుమారి నియమితులయ్యారు. శ్రీకాకుళం (D) టెక్కలి మండలం కొల్లివలస ఆమె స్వస్థలం. 2009 గ్రూప్‌-1 అధికారి అయిన ఈమె విజయనగరం ఆర్డీవోగా ఎంపికయ్యారు. 2013లో సింహాచలం దేవస్థానం స్పెషల్ డీసీగా, 2017లో తూ.గోలో డ్వామా పీడీగా, 2019లో అదే జిల్లాకు JC(వెల్ఫేర్)గా పని చేశారు. 2021లో IAS హోదా పొందారు. ప్రస్తుతం గుంటూరు JCగా ఉన్న ఈమె నంద్యాల కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

News July 3, 2024

నెల్లూరు: బస్సులో రూ.80 లక్షల చోరీ

image

బస్సులోనే మత్తు పెట్టి భారీగా నగదు చోరీ చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. విజయవాడ నుంచి ఇద్దరు వ్యాపారులు రూ.80 లక్షలతో బెంగళూరుకు బయల్దేరారు. కావలి సమీపంలోని మద్దూరుపాడు దాబా వద్ద భోజనానికి ఆపారు. ఇందులో ఒకరు దాబాలో తిని మరొకరికి పార్శిల్ తీసుకు రావడానికి వెళ్లారు. బస్సులో ఉన్న దొంగలు అతడికి మత్తు పెట్టి అతని వద్ద ఉన్న రూ.80 లక్షల డబ్బు సంచి తీసుకుని రోడ్డు దాటుకుని మరొక వాహనంలో పరారయ్యారు.

News July 3, 2024

ఖాజీపేట హై‌స్కూల్ ఇన్‌ఛార్జ్ హెచ్ఎం సస్పెండ్

image

ఖాజీపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత నీరు తాగి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవిని సస్పెండ్ చేసినట్లు డీఈవో అనురాధ తెలిపారు. దీంతోపాటు ఖాజీపేట ఎంఈఓ-1 నాగ స్వర్ణలత, ఎంఈఓ-2 నాగరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నీటి ట్యాంకుల శుభ్రతలో ఇన్‌ఛార్జ్ హెచ్ఎం నిర్లక్ష్యం వల్లే నీరు కలుషితమైందన్నారు.

News July 3, 2024

విశాఖ: సీబీసీఎస్సీ స్థలంలో తవ్వకాలపై గనుల శాఖ ఆరా

image

సిరిపురం కూడలి సమీపంలో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన ఎంవీవీ పీక్ ప్రాజెక్టులో జరిపిన తవ్వకాలపై గనుల శాఖ ఆరా తీసింది. అనుమతులు పొందిన ప్రాంతంలో ప్రత్యేక పరికరాలతో సర్వే నిర్వహించి అనుమతులు పొందిన దాని కంటే ఎక్కువగా తవ్వకాలు జరిపినట్లు తేల్చారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని సంబంధిత ప్రాజెక్టు ప్రతినిధులకు నోటీసులు జారీ చేశారు. కాగా కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించారు.

News July 3, 2024

శ్రీకాకుళంలో 3రోజులు వర్షాలు

image

ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో రానున్న 3 రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈనెల 3, 4, 5 తేదీల్లో జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. రేపు మబ్బులతో కూడి అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.