India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న తాడిగడపకు చెందిన నూకల విజయశ్రీని సైబర్ నేరగాళ్లు భారీ మోసం చేశారు. ఆన్‌లైన్ టాస్కుల పేరుతో గ్రూపుల్లో చేర్చి, పెట్టుబడికి అధిక లాభాలంటూ నమ్మబలికిన నేరస్తులు దశలవారీగా ఆమె నుంచి రూ.22 లక్షలు దోచుకున్నారు. స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నల్లచెరువు అంబేడ్కర్ ఎయిడెడ్ పాఠశాలలో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను డీఈఓ సీవీ రేణుక సస్పెండ్ చేశారు. హాజరు తప్పుగా చూపడం, మధ్యాహ్న భోజన లబ్దిదారుల సంఖ్యను పెంచడం, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వంటి ఆరోపణలపై జాకీర్ హుస్సేన్, డి. రవిపై చర్యలు తీసుకున్నారు. డీఈఓ తనిఖీలో 46 మందికి హాజరు వేసినా, కేవలం 9 మంది విద్యార్థులే ఉండటం గమనార్హం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. భార్య నీలం మంగమ్మ (45)ను భర్త నీలం శ్రీనివాసరావు హతమార్చాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు ప్రాథమిక సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చిత్తూరు జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం 41 డిగ్రీలకు పెరిగాయి. నగరిలో 41.4, శ్రీరంగ రాజపురం, తవణంపల్లె మండలాల్లో 41.2, గుడిపాల, చిత్తూరు మండలాల్లో 40.8, యాదమరిలో 40.3, గంగాధరనెల్లూరులో 40.1 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంగారుపాళ్యంలో 38.6, పులిచెర్ల, పూతలపట్టు, రొంపిచెర్ల, వెదురుకుప్పం మండలాల్లో 38.1, చౌడేపల్లె, ఐరాల, కార్వేటినగరం, నిండ్ర, పాలసముద్రంలో 37.7 డిగ్రీలు నమోదైంది.
పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో మాజీ ఎంపీ హర్షకుమార్ కొవ్వొత్తులతో నివాళులర్పిస్తామని పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు హర్షకుమార్‌ను అదుపులోకి తీసుకుని జీపులో తీసుకెళ్లారు. క్రైస్తవులు, వివిధ సంఘాల నేతలు పాస్టర్ ప్రవీణ్‌కి నివాళులర్పించారు. పరిస్థితి ఉద్రిక్తత అవ్వడంతో నలుగురు నేతలను అదుపులోకి తీసుకుని రాజనగరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ బంగారు సరోజినీపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు జోరుగా చర్చ సాగుతుంది. ప్రస్తుతం ఈమె జనసేనలో ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే కౌన్సిలర్లు చర్చించినట్లు సమాచారం. పొత్తులో ఉన్న TDP, జనసేన సఖ్యత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మొత్తం 20 వార్డుల్లో TDPకి 7, YCPకి 9, BJPకి 1, జనసేనకు 3 చొప్పున సభ్యుల బలం ఉంది. సభ్యులు సహకరిస్తే TDPకి ఛైర్మన్ దక్కే అవకాశం ఉంది.
ప్రధాని పర్యటనలో విధులు నిర్వహించేందుకు 31 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లకు ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని పర్యటన విజయవంతం చేసే బాధ్యత వారిదే . రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా జి.వీరపాండియన్ ఉన్నారు. పీఎంవో, ఎస్పీజీ, సీఎంవోలతో సమన్వయం చేసుకోటానికి శాంతిభద్రతల అదనపు డీజీ మధుసూదన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ప్రధాని రోడ్, బహిరంగ సభ, వీఐపీల బాధ్యతలు అప్పగిస్తూ ఆయనకు ఆదేశాలిచ్చారు.
రణస్థలంలోని పైడిభీమవరంలో నడిరోడ్డుపై శనివారం వివాహిత భవాని దారుణ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి చాకుతో ఆమె గొంతుకోసి సంఘటన స్థలంలోనే చాకును నీళ్లతో కడిగి పడేసి వెళ్లాడు. మృతురాలు పని చేస్తున్న హోటల్‌లోని వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవానీ స్వగ్రామం విజయనగరం(D) పెద్ద పతివాడ గ్రామం. నాలుగేళ్ల క్రితం పైడిభీమవరంలోని వెంకట సత్యంతో ఈమెకు వివాహమైంది.
హైదరాబాద్ పరిధిలోని కొండాపూర్‌లో 39 ఎకరాల స్థల వివాదంలో హైడ్రా రంగంలోకి దిగింది. శనివారం పోలీసుల బందోబస్తుతో అక్కడికి చేరుకున్న అధికారులు, స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌తో పాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించారు. ఈ స్థలం ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌కు చెందినదని సమాచారం. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లి నష్టపరిహారం వసూలు చేస్తామని తెలిపారు.
నెల్లూరు జిల్లాలో ఉదయాన్నే జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మర్రిపాడు మండలం కదిరినాయుడు పల్లి సమీపంలో నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై ఓ బైక్ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న యువతి అక్కడికక్కడే మృతిచెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.